ETV Bharat / sports

IPL 2022: ఈ సీజన్​లో ప్లేఆఫ్స్​కు చేరుకునే జట్లు ఇవేనా? - లఖ్​నవూ సూపర్​ జెయింట్స్

IPL 2022: ఐపీఎల్​ కోసం ప్రతి సీజన్​లోనూ ఉత్కంఠగా ఎదురుచూస్తారు అభిమానులు. తమ జట్టు కప్పు గెలుస్తుందంటే.. తమ జట్టే అంటూ పోటీ పడుతుంటారు. పది జట్లు పాల్గొంటున్న ఈ మెగా టోర్నీలో ఏ జట్లకు ప్లేఆఫ్స్​​ అవకాశాలు ఉన్నాయో ఒకసారి పరిశీలిద్దాం.

chance to qulaify playoffs ipl
ఈ నాలుగు జట్లే ప్లేఆఫ్​కు..
author img

By

Published : Mar 15, 2022, 5:59 AM IST

Updated : Mar 15, 2022, 6:53 AM IST

IPL 2022: ఐదుసార్లు టైటిల్​ గెలిచిన జట్టు ఒకటైతే.. నాలుగు సార్లు గెలిచిన జట్టు మరొకటి.. ఇలా చెప్పుకుంటూ పోతే ప్రతీ జట్టు ఐపీఎల్​లో ప్రత్యేక స్థానాన్ని సంపాదించుకున్నాయి. ఎనిమిది జట్లతో హోరాహోరిగా కొనసాగుతున్న ఐపీఎల్​లోకి ఈసారి మరో రెండు కొత్త జట్లు ఎంట్రీ ఇచ్చాయి. మరి వీటిలో ఏ జట్లకు ప్లేఆఫ్స్​ చేరుకునే అవకాశం ఉందో చూడండి.

1.చెన్నై సూపర్ కింగ్స్​

నాలుగు సార్లు టైటిల్​ విజేత, డిఫెండింగ్ ఛాంపియన్​ చెన్నై సూపర్​ కింగ్స్​.. మరో టైటిల్​ కోసం సిద్ధమవుతోంది. ఈ జట్టుకు ప్రధాన బలం మహేంద్రసింగ్​ ధోనీ నాయకత్వమే. రవీంద్ర జడేజా, మొయిన్​ అలీ రూపంలో అద్భుతమైన ఆల్​రౌండర్లు సీఎస్​కే సొంతం. గతేడాది అత్యధిక పరుగులు చేసి ఆరెంజ్​ క్యాప్ దక్కించుకున్న రుత్​రాజ్​ గైక్వాడ్​ లాంటి ఆటగాళ్లతో ఉన్న చెన్నై ​ప్లేఆఫ్​కు చేరడం కష్టమైన పని కాదు. అయితే దీపక్​ చాహర్​ లాంటి ప్రధాన బౌలర్​ ఈ సీజన్​ మొత్తానికీ దూరమైతే జట్టుపై కొంత ప్రతికూల ప్రభావం చూపవచ్చు.

chennai super kings
చెన్నై సూపర్ కింగ్స్​

2.దిల్లీ క్యాపిటల్స్​

శిఖర్​ ధావన్​, శ్రేయస్​ అయ్యర్​ల​ రూపంలో ప్రధాన ఆటగాళ్లను కోల్పోయినా.. దిల్లీ క్యాపిటల్స్​ బలంగానే కనిపిస్తోంది. 2020లో రన్నరప్​గా నిలిచిన ఈ జట్టు.. ఈ సారి జరిగిన మెగావేలంతో మరింత పటిష్ఠంగా మారింది. స్టార్​ బ్యాటర్​​ డేవిడ్​ వార్నర్​తో కలిసి పృథ్వీ షా ఓపెనింగ్​ చేయనున్నాడు. రిషభ్​ పంత్​, మిచెల్​ మార్ష్​లతో మిడిల్​ ఆర్డర్ దృఢంగా ఉండగా...​ బౌలింగ్​లో శార్దుల్​ ఠాకూర్​, కుల్దీప్ యాదవ్, అక్షర్ పటేల్,​ ఖలీల్​ అహ్మద్​, చేతన్​ సకారియా, రెహ్మన్​లతో జట్టు సమతూకంగా కనబడుతోంది.

delhi capitals
దిల్లీ క్యాపిటల్స్

3. కోల్​కతా నైట్​రైడర్స్​

రెండు సార్లు కప్పు గెలిచిన కోల్​కతా నైట్​రైడర్స్​.. ఈ సారి కొత్త కెప్టెన్​తో బరిలోకి దిగనుంది. శ్రేయస్​ అయ్యర్​ను వేలంలో కొన్న యాజమాన్యం అతడికే జట్టు పగ్గాలను అప్పగించింది. వెంకటేశ్​ అయ్యర్, నితీశ్​ రాణా, ఆండ్రూ రసెల్, సునీల్​ నరైన్​ లాంటి హిట్టర్లతో బలంగా ఉంది. ఇక బౌలింగ్​ విషయానికి వస్తే ప్యాట్​ కమిన్స్​, ఉమేశ్​ యాదవ్​, టిమ్ సౌథీ, నరైన్​, చక్రవర్తిలతో బ్యాలెన్స్​డ్​గా ఉంది.

kolkata knight riders
కోల్​కతా నైట్​ రైడర్స్​

4. లఖ్​నవూ సూపర్​ జెయింట్స్​

తొలిసారిగా ఐపీఎల్​లో అడుగుపెడుతున్న లఖ్​నవూ సూపర్​ జెయింట్స్​ కూడా ఈసారి టైటిల్​ ఫేవరెట్​గానే కనబడుతోంది! పేపర్​పైన ఈ జట్టు బలంగా ఉంది. అనుభవం కలిగిన ఆటగాళ్లు కేఎల్​ రాహుల్​, క్వింటన్ డికాక్​లతో ఓపెనింగ్​ జోడి చక్కగా కుదిరింది. అలాగే మనీశ్​ పాండే, దీపక్ హుడా, కృనాల్ పాండ్య, మార్కస్​ స్టోయినిస్​, జేసన్​ హోల్డర్​లతో పవర్​ఫుల్​ బ్యాటింగ్ లైనప్​ ఉంది. ఇక బౌలింగ్​ విషయానికొస్తే అవేశ్​ ఖాన్​, మార్క్​ వుడ్​, హోల్డర్​, స్టోయినిస్​, రవి బిష్ణోయ్​, పాండ్య ఉన్నారు. దీంతో కొత్త జట్టు కూడా ప్లేఆఫ్స్​కు గట్టి పోటీనే ఇస్తుంది.

lucknow super gaints
లఖ్​నవూ సూపర్​ జెయింట్స్

ఐపీఎల్​ 2022 ఈనెల 26న ప్రారంభం కానుంది. ఇప్పటికే జట్లన్నీ కెప్టెన్లను నియమించుకొని ప్రాక్టీస్​ను మొదులుపెట్టేశాయి. వీటిలో ఏ జట్టు ప్లేఆఫ్స్​కు చేరుతుందో చూడాలంటే మరికొన్ని రోజులు వేచిచూడాల్సిందే.

ఇదీ చదవండి: కోహ్లీలా ఉండలేను.. ధోనీకి నాకూ పోలిక ఉంది: డుప్లెసిస్​

Last Updated : Mar 15, 2022, 6:53 AM IST
ETV Bharat Logo

Copyright © 2025 Ushodaya Enterprises Pvt. Ltd., All Rights Reserved.