ETV Bharat / sports

IPL 2022: సీఎస్కే ఫ్యాన్స్​కు గుడ్​ న్యూస్​​.. అతడు వచ్చేస్తున్నాడు!

author img

By

Published : Mar 9, 2022, 12:34 PM IST

IPL 2022 Deepak chahar: మరికొద్ది రోజుల్లో ఐపీఎల్​ ప్రారంభం కానున్న నేపథ్యంలో చెన్నై సూపర్​కింగ్స్ అభిమానులకు గుడ్​ న్యూస్. గాయం కారణంగా సీఎస్కే జట్టుకు దూరమైన బౌలర్​ దీపక్​ చాహర్​ తిరిగి టీమ్​లోకి వచ్చే అవకాశమున్నట్లు తెలుస్తోంది.

csk
chennai super kings

IPL 2022 Deepak chahar: చెన్నై సూపర్​ కింగ్స్​ అభిమానులకు శుభవార్త! గాయం కారణంగా ఈ మెగాలీగ్​కు దూరమైన స్టార్​ బౌలర్​ దీపక్​ చాహర్​ తిరిగి జట్టులోకి రానున్నాడని తెలుస్తోంది. ముందుగా చెప్పినట్లుగా అతడికి సర్జరీ అవసరం లేదని, సీజన్​ మొదలయ్యాక కొన్ని రోజులకు అందుబాటులోకి వచ్చే అవకాశాలు ఉన్నట్లు సమాచారం.

బెంగళూరు వేదికగా జరిగిన ఐపీఎల్​ మెగావేలంలో చెన్నై జట్టు భారీ ధర రూ.14కోట్లకు దీపక్​ చాహర్​ను దక్కించుకుంది. వేలంలో అత్యంత ఎక్కువ ధరకు అమ్ముడుపోయిన రెండో ఆటగాడిగా అతడు నిలిచాడు.

కాగా, వెస్టిండీస్‌తో జరిగిన మూడో టీ20లో అతడు తొడ కండరాల గాయానికి గురికావడం వల్ల ఈ సీజన్‌ మొత్తానికి దూరం కానున్నాడని వార్తలు వినిపించాయి.

deepak chahar
దీపక్​ చాహర్​

అంతర్జాతీయ కెరీర్​లో చాహర్​ 20 టీ20లు ఆడి 26 వికెట్లు పడగొట్టగా.. 7 వన్డేల్లో 10 వికెట్లు తీశాడు. బ్యాటింగ్​లోనూ సత్తా చాటిన చాహర్​.. వన్డేల్లో రెండు అర్థశతకాలు సాధించాడు. ఐపీఎల్​లో 63 మ్యాచులు ఆడి 59 వికెట్లు దక్కించుకున్నాడు. ఈ నెల 26న డిఫెండింగ్ ఛాంపియన్ చెన్నై సూపర్ కింగ్స్, రన్నరప్ కోల్‌కతా నైట్‌రైడర్స్ మధ్య మ్యాచ్‌తో ఐపీఎల్ 15వ సీజన్​ ప్రారంభం కానుంది.

ఇదీ చదవండి: Gujarat Titans: జేసన్​ రాయ్​ స్థానంలో ఆ ఓపెనర్​!

ETV Bharat Logo

Copyright © 2024 Ushodaya Enterprises Pvt. Ltd., All Rights Reserved.