ETV Bharat / sports

'ఐపీఎల్​లో గౌరవం దక్కలేదు'.. స్టార్​ క్రికెటర్​ షాకింగ్ కామెంట్స్! - Chris Gayle lack of respect

IPL 2022 Chris gayle: ఐపీఎల్​ 15వ సీజన్​లో తాను పాల్గొనపోవడానికి గల కారణాలను తెలిపాడు విధ్వంసక బ్యాటర్​ క్రిస్​ గేల్​. గత కొన్నేళ్లలో ఈ టోర్నీలో సరైన గౌరవం దక్కకపోవడం వల్లే ఈసారి దూరంగా ఉన్నానని చెప్పాడు.

IPL 2022 Chris gayle
ఐపీఎల్ 2022 క్రిస్ గేల్​
author img

By

Published : May 8, 2022, 7:34 AM IST

IPL 2022 Chris gayle: భారత టీ20 మెగా టోర్నీలో ఎన్నో విధ్వంసక ఇన్నింగ్స్‌ ఆడిన క్రిస్‌గేల్‌ ఈసారి 15వ సీజన్‌లో ఆడటం లేడు. ఈసారి అసలు వేలంలోనే పాల్గొనలేదు. అయితే, అతడు ఎందుకు వైదొలిగాడో మాత్రం కారణం తెలియదు. తాజాగా తన నిర్ణయానికి గల కారణాన్ని వెల్లడించాడు. గత కొన్నేళ్లలో ఈ టోర్నీలో సరైన గౌరవం దక్కకపోవడం వల్లే ఈసారి దూరంగా ఉన్నానని చెప్పాడు.

"గత కొన్నేళ్లలో భారత టీ20 టోర్నీలో నాకు సరైన గౌరవం దక్కలేదనిపించింది. ఇన్నేళ్లు ఈ టోర్నీలో ఇంత చేశాక అలా జరగడంతో వేలంలో ఉండకూడదనుకున్నా. క్రికెట్‌ కాకుండా ఇంకా చాలా జీవితం ఉంది" అని అతడు పేర్కొన్నాడు. అయితే వచ్చే ఏడాది మళ్లీ మెగా టోర్నీలో ఆడతానని చెప్పాడు. "వచ్చే సంవత్సరం తిరిగి టీ20 మెగా టోర్నీ ఆడతా. వాళ్లకు నా అవసరం ఉంది" అని అన్నాడు. గేల్‌ ఈ మెగా టీ20 లీగ్‌లో ఇదివరకు కోల్‌కతా, బెంగళూరు, పంజాబ్‌ జట్ల తరఫున ఆడాడు. 2021 మెగా టోర్నీలో పంజాబ్‌ తరఫున 10 మ్యాచ్‌ల్లో 125.32 స్ట్రైక్‌రేట్‌తో 193 పరుగులు చేశాడు.

ఇదీ చూడండి: భారత్​ స్టార్​ రన్నర్​ సూపర్​ రికార్డ్

ETV Bharat Logo

Copyright © 2024 Ushodaya Enterprises Pvt. Ltd., All Rights Reserved.