ETV Bharat / sports

ఐపీఎల్‌ అభిమానులకు మరో గుడ్​న్యూస్​.. త్వరలోనే బీసీసీఐ ప్రకటన?

IPL 2022 Audience: ఐపీఎల్ పండగ మొదలై వారం పూర్తి కానుంది. కరోనా భయంతో మ్యాచ్​లకు పరిమిత సంఖ్యలోనే ప్రేక్షకులను అనుమతిస్తున్నారు. ప్రస్తుతం లీగ్​ దశలో 25 శాతం మంది ప్రేక్షకులను అనుమతిస్తున్న బీసీసీఐ.. ఇక నుంచి 50 శాతం అభిమానులకు అనుమతించాలని భావిస్తోంది.

IPL 2022 Audience
IPL 2022 Audience
author img

By

Published : Apr 1, 2022, 10:08 AM IST

IPL 2022 Audience: దేశంలో కరోనా కేసులు తగ్గుముఖం పడుతున్నందున మరింత ఎక్కువ మంది వీక్షకుల్ని ఐపీఎల్ మ్యాచ్​లకు అనుమతించాలని బీసీసీఐ భావిస్తోంది. మహారాష్ట్ర ప్రభుత్వం విధించిన కరోనా నిబంధనల ప్రకారం.. ప్రస్తుతం స్టేడియం సామర్థ్యంలో 25 శాతం మందిని మాత్రమే అనుమతిస్తుంది. కొవిడ్​ కేసులు తగ్గుతున్న నేపథ్యంలో ఏప్రిల్​ 1వ తేదీన మహారాష్ట్ర ప్రభుత్వం కరోనా నిబంధనలను పూర్తిగా ఎత్తివేసింది. దీంతో 50 శాతం ప్రేక్షకులను బీసీసీఐ అనుమతించనుందని తెలుస్తోంది. ఇందుకు మహారాష్ట్ర ప్రభుత్వం గ్రీన్​ సిగ్నల్​ కూడా ఇచ్చిందని సమాచారం.

ఇక, ఏప్రిల్ 5 నుంచి 50% మంది ప్రేక్షకుల సామర్థ్యం కోసం ఏర్పాట్లు చేయాలని ముంబయి క్రికెట్ అసోసియేషన్​ను బీసీసీఐ ఆదేశించినట్లు తెలుస్తోంది. దీనిపై త్వరలోనే అధికారిక ప్రకటన విడుదల అవుతుందని సమాచారం. ఆ తర్వాత ఆన్‌లైన్‌లో టికెట్లు అందరికీ అందుబాటులోకి రానున్నాయి. అన్నీ కుదిరితే ఏప్రిల్ 5న వాంఖడే స్టేడియంలో జరగబోయే రాయల్ ఛాలెంజర్స్ బెంగళూరు- రాజస్థాన్ రాయల్స్ మ్యాచ్​కు 50 శాతం ప్రేక్షకులు రానున్నారు. ఈసారి లీగ్​లో కొత్తగా మరో రెండు జట్ల ఎంట్రీతో వినోదం రెండింతలు పెరిగింది. పది జట్లను గ్రూప్స్​గా విడదీసి ఈ సారి కొత్త ఫార్మాట్​లో ఐపీఎల్​ నిర్వహిస్తున్నారు. రెండు గ్రూప్​లను ఏర్పాటు చేసి, పది జట్లలో ఐదు జట్లకు గ్రూప్​ ఏ, మిగతా వాటికి గ్రూప్​ బీలో చేర్చారు.

ఇదీ చదవండి: 'యువీ వికెట్​తో నా జీవితమే మారిపోయింది'

ETV Bharat Logo

Copyright © 2024 Ushodaya Enterprises Pvt. Ltd., All Rights Reserved.