ETV Bharat / sports

కొత్త ఫ్రాంఛైజీలకు డెడ్​లైన్.. వేలానికి ముందే.. - ఐపీఎల్ 2022 కొత్త ఫ్రాంఛైజీలు

IPL 2022: ఐపీఎల్​ మెగా వేలం నేపథ్యంలో రెండు కొత్త ఫ్రాంఛైజీలకు డెడ్​లైన్​ విధించింది బీసీసీఐ. జనవరి 22లోగా రెండు జట్లు చెరో ముగ్గురు ఆటగాళ్లను ఎంపిక చేసుకోవాలని పేర్కొంది.

ipl
ఐపీఎల్
author img

By

Published : Jan 12, 2022, 9:08 PM IST

IPL 2022: ఐపీఎల్ మెగా వేలం ప్రక్రియ త్వరలోనే ప్రారంభంకానున్న నేపథ్యంలో బీసీసీఐ కీలక ప్రకటన చేసింది. కొత్త ఫ్రాంఛైజీలైన లఖ్​నవూ, అహ్మదాబాద్​కు డెడ్​లైన్​ విధించింది. వేలానికి ముందు ఇరు జట్లు ముగ్గురు ఆటగాళ్లను రిటైన్​ చేసుకోవాల్సి ఉంది. ఈ నేపథ్యంలో బీసీసీఐ ప్రకటన చేసిందని ఐపీఎల్ ఛైర్మన్ బ్రిజేశ్ పటేల్ పేర్కొన్నారు.

'అహ్మదాబాద్, లఖ్​నవూ జట్లకు జనవరి 22 వరకు డెడ్​లైన్ విధించాం. ఈలోపు తాము చెరో ముగ్గురు ఆటగాళ్లను(ఇద్దరు స్వదేశీ, ఓ విదేశీ) రిటైన్ చేసుకోవాలి.' అని బ్రిజేశ్ పటేల్ తెలిపారు. ఈ మేరకు సంబంధిత ఫ్రాంఛైజీలకు మెయిల్ చేసినట్లు వెల్లడించారు.

ఫార్మల్ క్లియరెన్స్..

అయితే.. మంగళవారమే రెండు కొత్త ఫ్రాంఛైజీలకు అధికారిక అనుమతులు ఇచ్చింది బీసీసీఐ. ఐపీఎల్​ పాలక మండలి సమావేశం అనంతరం లఖ్​నవూ, అహ్మదాబాద్​ ఫ్రాంఛైజీలకు బీసీసీఐ ఫార్మల్ క్లియరన్స్ ఇచ్చినట్లు ఐపీఎల్ ఛైర్మన్ బ్రిజేశ్ పటేల్ తెలిపారు.

కాగా, ఐపీఎల్​ మెగావేలం తేదీ కూడా ఖరారైనట్లు బ్రిజేశ్ స్పష్టం చేశారు. బెంగళూరు వేదికగా ఫిబ్రవరి 12, 13 తేదీల్లో ఈ ప్రక్రియ నిర్వహించనున్నట్లు వెల్లడించారు.

టైటిల్​ స్పాన్సర్​గా టాటా గ్రూప్స్..

IPL Title Sponsor: దేశంలో అతిపెద్ద వ్యాపార సంస్థ అయిన టాటా గ్రూప్‌.. ఈ ఏడాది ఐపీఎల్‌ టైటిల్‌ కొత్త స్పాన్సర్‌గా వ్యవహరించనుంది. ఇప్పటివరకు టైటిల్‌ స్పాన్సర్‌గా ఉన్న చైనా మొబైల్‌ తయారీ సంస్థ 'వీవో' వైదొలగనుంది. ఈ మేరకు ఐపీఎల్‌ కమిటీ నిర్ణయించినట్లు ఐపీఎల్‌ ఛైర్మన్ బ్రిజేశ్‌ పటేల్‌ వెల్లడించారు.

ఇదీ చదవండి:

'కంగారూల గడ్డపై టెస్టు సిరీస్ విజయం.. ఓ సువర్ణాధ్యాయం'

బాక్సర్ లవ్లీనాకు సీఎం సత్కారం.. డీఎస్పీగా బాధ్యతలు అప్పగింత

ETV Bharat Logo

Copyright © 2024 Ushodaya Enterprises Pvt. Ltd., All Rights Reserved.