ETV Bharat / sports

IPL 2022: 'ఆర్సీబీ కప్పు గెలిచే వరకు నేను పెళ్లి చేసుకోను' - ఐపీఎల్​

IPL 2022: ఈ ఏడాది ఐపీఎల్​లో అభిమానులు బాగా సందడి చేశారు. తమ అభిమాన జట్లకు మద్దతు తెలిపేందుకు అరుపులు, కేకలతో పాటు బ్యానర్లను ప్రదర్శించారు. వాటిలో కొన్ని ఫన్నీగా ఉండి సామాజిక మాధ్యమాల్లో తెగ వైరల్ అయ్యాయి. అందులో టాప్-5 ఇప్పుడు చూద్దాం..

Most hilarious fan made banners
ఐపీఎల్​లో అభిమానుల ఫన్నీ బ్యానర్లు
author img

By

Published : May 25, 2022, 1:58 PM IST

IPL Funny Banners: ఐపీఎల్ సీజన్ ముగింపు దశకు వచ్చింది. మరో మూడు మ్యాచ్​లతో టోర్నీ విజేత ఎవరో తెలిసిపోతుంది. అయితే ఈ ఏడాది అభిమానులు ఐపీఎల్​లో బాగా సందడి చేశారు. తమ అభిమాన జట్లను ఉత్తేజపరిచేందుకు స్టేడియాలకు భారీగా తరలివచ్చారు. ఈక్రమంలో కొందరు అరుపులు, కేకలు, ఈలలలో సందడి చేస్తే.. మరికొందరు ఫన్నీ బ్యానర్లు ప్రదర్శించారు. అందులో కొన్ని సామాజిక మాధ్యమాల్లో తెగ వైరల్ అయ్యాయి. అవి ఇప్పుడు చూద్దాం..

Most hilarious fan made banners
ఐపీఎల్​లో అభిమానుల ఫన్నీ బ్యానర్లు

పాండ్య అర్ధసెంచరీ చేస్తే ఉద్యోగం వదిలేస్తా..: ఏప్రిల్ 11న ముంబయి వేదికగా గుజరాత్ టైటాన్స్​, సన్​రైజర్స్ హైదరాబాద్ మధ్య మ్యాచ్ జరిగింది. అప్పటికి బ్యాటింగ్​లో ఫామ్​లో లేని గుజరాత్ కెప్టెన్​ హార్దిక్ పాండ్యను ఉద్దేశించి ఓ అభిమాని బ్యానర్ ప్రదర్శించాడు. పాండ్య అర్ధ సెంచరీ చేస్తే తాను ఉద్యోగానికి రాజీనామా చేస్తానని ప్లకార్డుపై రాశాడు. పాండ్య కచ్చితంగా 50 కొట్టడు అనుకున్న అభిమానికి గట్టి షాక్ తగిలింది. ఈ మ్యాచ్లో పాండ్య హాఫ్ సెంచరీతో రాణించాడు. కానీ మ్యాచ్​ మాత్రం సన్​రైజర్స్ గెలిచింది. మ్యాచ్​ అనంతరం ఈ బ్యానర్​పై తెగ మీవ్స్ వచ్చాయి. ఆ అభిమానిని నెటిజన్లు ఓ ఆట ఆడుకున్నారు. రాజీనామా చేశావా? అని కామెంట్లు పెట్టారు. మరి బ్యానర్ ప్రదర్శించిన అభిమాని రాజీనామా చేశాడో లేదో తెలియదు.

Most hilarious fan made banners
ఐపీఎల్​లో అభిమానుల ఫన్నీ బ్యానర్లు

విరాట్ సెంచరీ చేసే వరకు నేను డేటింగ్ చేయను: విరాట్ కోహ్లీ అభిమానులు అతను సెంచరీ చేస్తాడని రెండేళ్లుగా కళ్లు కాయలుకాచేలా ఎదురుచూస్తున్నారు. అంతర్జాతీయ మ్యాచ్​లలో 71వ శతకం నమోదు చేసి తమ ఆకలి తీర్చుతాడని ఆశిస్తున్నారు. ఈ క్రమంలోనే ఆర్​సీబీ, ముంబయి మధ్య జరిగిన మ్యాచ్లో ఓ అభిమాని ఫన్నీ బ్యానర్ ప్రదర్శించాడు. విరాట్ 71వ సెంచరీ చేసే వరకు తాను డేటింగ్ చేయనని రాసుకొచ్చాడు.

Most hilarious fan made banners
ఐపీఎల్​లో అభిమానుల ఫన్నీ బ్యానర్లు

ఆర్​సీబీ కప్పు గెలిచేవరకు పెళ్లి చేసుకోను: ఇప్పటివరకు ఒక్కసారి కూడా కప్పు గెలవకపోయినా ఆర్​సీబీకి అనేక మంది అభిమానులున్నారు. మహిళలు కూడా ఆ జట్టును ఎక్కువ ఇష్టపడతారు. ఆర్​సీబీ, చెన్నై మధ్య జరిగిన మ్యాచ్​లో ఓ లేడీ.. తమ అభిమాన జట్టు కప్పు గెలిచేవరకు తాను పెళ్లి చేసుకోబోనని ప్లకార్డు ప్రదర్శించింది. ఇది కాస్త సోషల్​ మీడియాలో వైరల్​ అయింది. ఆర్​సీబీ ఈసారి కాస్త లక్కుతో ప్లే ఆఫ్స్​కు చేరింది. బుధవారం జరిగే మ్యాచ్​లో లఖ్​నవూతో తలపడునుంది. గెలిస్తే క్వాలిఫయర్​ 2లో రాజస్థాన్​ను ఎదుర్కొంటుంది. లేదంటే ఇంటిబాట పడుతుంది. మరి ఈ లేడీ ఫ్యాన్ పెళ్లి కోసమైనా.. ఆర్సీబీ ఈసారి కప్పు గెలుస్తుందేమో చూడాలి.

Most hilarious fan made banners
ఐపీఎల్​లో అభిమానుల ఫన్నీ బ్యానర్లు

కెమెరామెన్ ఇటువైపు కూడా చూడు: మ్యాచ్​ సమయంలో కెమెరామెన్​ ఎప్పుడూ అందమైన అమ్మాయిలనే చూపిస్తుంటారు. లేదా ఆసక్తి గల సన్నివేశాలు, బ్యానర్లను కవర్ చేస్తుంటారు. అయితే మమ్మల్ని కూడా కాస్త కవర్ చెయ్ అంటూ ఆర్సీబీ, చెన్నై మ్యాచ్​లోనే ఓ అభిమాని ప్రదర్శించిన బ్యానర్ నవ్వులు పూయించింది. ఓ అంతర్జాతీయ మ్యాచ్​లో ధోని ఏదో చెబుతున్నప్పుడు నాన్​స్ట్రయికర్ పట్టించుకోడు. దీంతో ధోని ఆగ్రహం వ్యక్తం చేస్తాడు. ఇదే ఫొటోను ప్లకార్డుపై ప్రదర్శించి కెమెరామెన్ అబ్బాయిల వైపు కూడా చూడాలని అర్థం వచ్చేలా ఓ అభిమాని రాసుకొచ్చాడు.

Most hilarious fan made banners
ఐపీఎల్​లో అభిమానుల ఫన్నీ బ్యానర్లు

గర్ల్​ఫ్రెండ్​ కన్నా మ్యాచే ముఖ్యం: క్రికెట్ అభిమానులకు గర్ల్​ఫ్రెండ్స్​తో మ్యాచ్​లు కూడా చాలా ముఖ్యం. అయితే ఓ అభిమానికి వింత పరిస్థితి ఎదురైంది. ఐపీఎల్​ కావాలో తాను కావాలో తేల్చుకోలాని అతని గర్ల్​ఫ్రెండ్ షరతు పెట్టిందట. దీంతో అతను మ్యాచే ముఖ్యమని స్డేడియానికి వచ్చాడట. 'నేను కావాలా ఐపీఎల్ కావాలా తేల్చుకోమని నా గర్ల్​ఫ్రెండ్ అడిగింది. అందుకు సమాధానంగా నేను మ్యాచ్ చూడటానికే వచ్చా' అని అభిమాని ప్రదర్శించిన ప్లకార్డు అందరి దృష్టినీ ఆకర్షించింది. సన్​రై​జైర్స్ హదరాబాద్, కోల్​కతా నైట్ రైడర్స్ మ్యాచ్లో ఈ ఘటన జరిగింది.

ఇదీ చదవండి: IPL eliminator 2022: బెంగళూరు లక్కా.. లఖ్​నవూ మ్యాజిక్కా..?

ETV Bharat Logo

Copyright © 2024 Ushodaya Enterprises Pvt. Ltd., All Rights Reserved.