ETV Bharat / sports

టాస్ గెలిచిన సన్​రైజర్స్.. రాజస్థాన్ బ్యాటింగ్ - సన్​రైజర్స్ రాజస్థాన్

IPL 2022 5th match: ఐపీఎల్​లో ఐదో మ్యాచ్​కు రంగం సిద్ధమైంది. సన్​రైజర్స్, రాజస్థాన్ రాయల్స్ తమ కప్పు వేటకు అస్త్రశస్త్రాలు సిద్ధం చేసుకున్నాయి. టాస్ గెలిచిన సన్​రైజర్స్ బౌలింగ్ ఎంచుకుంది.

Sunrisers Hyderabad vs Rajasthan Royals
Sunrisers Hyderabad vs Rajasthan Royals
author img

By

Published : Mar 29, 2022, 7:02 PM IST

Sunrisers Hyderabad vs Rajasthan Royals: ఐపీఎల్ 2022లో తొలి మ్యాచ్​కు సన్​రైజర్స్, రాజస్థాన్ రాయల్స్ సిద్ధమైపోయాయి. టాస్ గెలిచిన సన్​రైజర్స్ బౌలింగ్ ఎంచుకుంది. తొలి గేమ్​లో రాణించి పాయింట్ల పట్టికలో బోణీ కొట్టాలని ఇరు జట్లు ఉవ్విళ్లూరుతున్నాయి.

IPL 2022 5th match: భారీ ధర పెట్టి కొనుగోలు చేసిన నికోలస్​ పూరన్, సారథి కేన్ విలియమ్సన్.. సన్​రైజర్స్​కు మూలస్తంభాలుగా నిలవనున్నారు. ఇక ఎప్పటిలాగే ఆ జట్టు బౌలింగ్ విభాగం మెరుగ్గా ఉంది. డెత్​ ఓవర్స్​ స్పెషలిస్ట్​ భువనేశ్వర్​ కుమార్​, యార్కర్ కింగ్ నటరాజన్​, యువ పేసర్ ఉమ్రాన్​ మాలిక్​లపై సన్​రైజర్స్ ఆధారపడనుంది. వాషింగ్టన్ సుందర్​, శ్రేయస్​ గోపాల్ సైతం కీలకంగా మారనున్నారు.

ఈ ఐపీఎల్​కు రాజస్థాన్ రాయల్స్ సైతం మెరుగ్గా సన్నద్ధమైంది. విధ్వసంక జోస్​ బట్లర్​, దేవ్​దత్​ పడిక్కల్ సహా కెప్టెన్ సంజూ శాంసన్ రాణిస్తే.. రాజస్థాన్​ను ఆపడం కష్టమే. పవర్​ హిట్టర్ హెట్​మెయర్​, వాండర్​ డుస్సెన్​, జిమ్మీ నీషమ్​, రియాన్ పరాగ్​తో మిడిల్​ ఆర్డర్ బలంగా ఉంది. రవిచంద్రన్​ అశ్విన్​, యుజ్వేంద్ర చాహల్ చేరికతో బౌలింగ్​ దళం సైతం పటిష్ఠంగా కనబడుతోంది. గతేడాది ముంబయి తరఫున అద్భుత ప్రదర్శన చేసిన ట్రెంట్​ బౌల్ట్ నేతృత్వంలో ప్రసిద్ధ్ కృష్ణ, నవదీప్​ సైనీ కూడా కీలకం కానున్నారు.

ఇదీ చదవండి: 'మేం కప్పు గెలిస్తే డివిలియర్స్​నే గుర్తు చేసుకుంటా'

ETV Bharat Logo

Copyright © 2025 Ushodaya Enterprises Pvt. Ltd., All Rights Reserved.