ETV Bharat / sports

IPL 2021: బుకీలకు సహకరించిన ఇద్దరి అరెస్ట్​

author img

By

Published : Jun 12, 2021, 7:28 PM IST

ఐపీఎల్​ 14వ సీజన్​కు సంబంధించి బుకీలకు నకిలీ అనుమతి కార్డుల జారీ ప్రక్రియలో సాయం చేసిన ఇద్దరు వ్యక్తులను అరెస్ట్​ చేశారు దిల్లీ పోలీసులు. దిల్లీలోని అరుణ్​ జైట్లీ స్టేడియంలో రాజస్థాన్-హైదరాబాద్ మధ్య జరిగిన మ్యాచ్​ సందర్భంగా ఈ ఘటన జరిగింది.

ipl 2021, rajasthan vs hyderabad
ఐపీఎల్ 2021, రాజస్థాన్ వర్సెస్ హైదరాబాద్

ఐపీఎల్​ సందర్భంగా ఇద్దరు బుకీలకు నకిలీ అనుమతి కార్డులు జారీ చేసిన ఇద్దరిని దిల్లీ పోలీసులు అరెస్ట్ చేశారు. అక్రమ బెట్టింగ్​లతో సంబంధముందనే కారణంతో వీరేందర్ సింగ్ షా, బాలం సింగ్ అనే వ్యక్తులను అదుపులోకి తీసుకున్నారు.

దిల్లీలోని అరుణ్​ జైట్లీ స్టేడియంలో హైదరాబాద్​-రాజస్థాన్​ మధ్య జరిగిన మ్యాచ్​ సందర్భంగా ఈ ఘటన జరిగింది. వీరిద్దరు మనీశ్ కన్సాల్, క్రిషన్ గార్గ్​.. పేరిట నకిలీ కార్డులను రూపొందించినట్లు పోలీసులు పేర్కొన్నారు.

దిల్లీ క్రికెట్ అసోసియేషన్ తోడ్పాటు..

ఈ విషయం వెలుగులోకి వచ్చిన మరుక్షణమే పోలీసులకు పూర్తి సహకారం అందించనున్నట్లు తెలిపారు దిల్లీ క్రికెట్ అసోసియేషన్​ అధ్యక్షుడు రోహన్ జైట్లీ. ఇలాంటి చట్ట వ్యతిరేక కార్యకలాపాలను ఎట్టి పరిస్థితుల్లోనూ అనుమతించబోమని స్పష్టం చేశారు.

ఇదీ చదవండి: Black Lives matter: ఆ జట్టు ఉద్దేశం వేరేలా ఉంది

ETV Bharat Logo

Copyright © 2024 Ushodaya Enterprises Pvt. Ltd., All Rights Reserved.