ETV Bharat / sports

IPL 2021: సెప్టెంబర్​ 19 నుంచి ఐపీఎల్​.. పూర్తి షెడ్యూల్​ ఇదే

author img

By

Published : Jul 25, 2021, 5:59 PM IST

Updated : Jul 25, 2021, 8:43 PM IST

ఐపీఎల్​ 2021.. యూఏఈ వేదికగా సెప్టెంబర్​ 19న తిరిగి ప్రారంభం కానుంది. రెండో దశలో తొలి మ్యాచ్​ ముంబయి ఇండియన్స్​- చెన్నై సూపర్​ కింగ్స్​ మధ్య జరగనుంది.

IPL 2021: Mumbai Indians to face off against Chennai Super Kings on September 19
ఐపీఎల్​

కరోనా కారణంగా అర్ధాంతరంగా నిలిచిపోయిన ఐపీఎల్​ 2021.. ఈ సెప్టెంబర్​ 19 నుంచి యూఏఈ వేదికగా తిరిగి ప్రారంభం కానుంది. రెండో దశలో తొలి మ్యాచ్​ డిఫెండింగ్​ ఛాంపియన్​ ముంబయి ఇండియన్స్​- చెన్నై సూపర్​ కింగ్స్​ మధ్య జరగనుంది. ఈ విషయాన్ని ఐపీఎల్​ వ్యవహారాలతో సంబంధం ఉన్న ఓ అధికారి వెల్లడించారు. దీనికి సంబంధించిన పూర్తి షెడ్యూల్​ను కూడా ప్రకటించింది బీసీసీఐ.

క్వాలిఫైయర్​ 1, క్వాలిఫైయర్​ 2.. అక్టోబర్​ 10, 13 తేదీల్లో జరగనుండగా.. ఎలిమినేటర్​ అక్టోబర్​ 11న నిర్వహించనున్నారు. ఇక ఫైనల్​ అక్టోబర్​ 15న జరగనుంది.

షెడ్యూల్ ఇదే..

ఐపీఎల్ రెండో దశ షెడ్యూల్

గతవారం ఐపీఎల్​కు సంబంధించిన విషయాన్ని బీసీసీఐ కార్యదర్శి జై షా వెల్లడించారు. "మరోసారి యూఏఈ వేదికగా లీగ్​ను నిర్వహించనున్నాం. టోర్నీ సజావుగా సాగడానికి అక్కడి ప్రభుత్వంతో కలిసి పనిచేయనున్నాం" అని షా తెలిపారు.

యూఏఈ వేదికగా జరిగే ఐపీఎల్​కు విదేశీ క్రికెటర్లు అందరూ అందుబాటులో ఉండేలా ప్రణాళికలు రూపొందిస్తోంది బీసీసీఐ. ఐపీఎల్​కు ముందే కరిబీయన్ ప్రీమియర్​ లీగ్​ ముగించేలా వెస్టిండీస్​ క్రికెట్​తో చర్చలు జరిపింది. ఆగస్టు 26 నుంచి సెప్టెంబర్​ 15 వరకు కరిబీయన్​ ప్రీమియర్ లీగ్​ జరిగేలా ఏర్పాట్లు చేశారు అక్కడి నిర్వాహకులు.

ఇదీ చూడండి: MS Dhoni: 'మహీ కోసం.. నాలుగో టైటిల్​ వేటలో'

Last Updated : Jul 25, 2021, 8:43 PM IST
ETV Bharat Logo

Copyright © 2024 Ushodaya Enterprises Pvt. Ltd., All Rights Reserved.