ETV Bharat / sports

ఆసీస్ మాజీ క్రికెటర్ హస్సీకి మరోసారి కొవిడ్​ పాజిటివ్​ - హస్సీకి మరోసారి కొవిడ్​ పాజిటివ్​

ఆసీస్ మాజీ క్రికెటర్​ మైకేల్​ హస్సీకి మరోసారి కరోనా నిర్ధరణ అయింది. శుక్రవారం నిర్వహించిన పరీక్షల్లో నెగెటివ్​గా తేలినప్పటికీ.. తాజాగా చేసిన టెస్టులో వైరస్​ ఉన్నట్లు తేలింది. ఐపీఎల్​ సందర్భంగా కొవిడ్ బారిన పడ్డారు హస్సీ.

ipl-2021-michael-hussey-tests-covid-19-positive-for-the-second-time
ఆసీస్ మాజీ క్రికెటర్ హస్సీకి మరోసారి కొవిడ్​ పాజిటివ్​
author img

By

Published : May 11, 2021, 1:39 PM IST

ఆస్ట్రేలియా మాజీ క్రికెటర్​ మైకేల్ హస్సీకి మరోసారి కొవిడ్​ పాజిటివ్​గా తేలింది. శుక్రవారం నిర్వహించిన పరీక్షల్లో నెగెటివ్​ రిపోర్ట్​ వచ్చినప్పటికీ.. తాజాగా చేసిన టెస్టులో వైరస్​ నిర్ధరణ అయింది.

ఐపీఎల్​లో కరోనా సోకిన తొలి విదేశీయుడు హస్సీనే కావడం విశేషం. మూడ్రోజుల కిందట చేసిన పరీక్షల్లో అతనికి నెగెటివ్ నివేదిక వచ్చింది. దీంతో హస్సీ వేగంగా కోలుకున్నట్లు అనిపించింది. కానీ స్వల్ప లక్షణాలు ఉండడం వల్ల మరోసారి అతనికి కొవిడ్ టెస్టు చేశారు.

“నేను ఈరోజు హస్సీతో మాట్లాడాను. మంచి ఉత్సాహంతో ఉన్నాడు. స్వల్ప లక్షణాలు ఉన్నాయి. మైక్​ తన హోటల్ గదిలో ఐసోలేషన్​లో ఉన్నాడు” అని ఆస్ట్రేలియన్ క్రికెట్ అసోసియేషన్ చీఫ్ ఎగ్జిక్యూటివ్ టోడ్​ గ్రీన్​బెర్గ్​ తెలిపారు.

ఇదీ చదవండి: 'మిగిలిన ఐపీఎల్​ మ్యాచ్​ల్లో మా ఆటగాళ్లు ఆడకపోవచ్చు!'

ETV Bharat Logo

Copyright © 2025 Ushodaya Enterprises Pvt. Ltd., All Rights Reserved.