ETV Bharat / sports

IPL 2021: సిక్స్​ కొడితే బంతి మార్చాల్సిందే! - బీసీసీఐ

కొవిడ్ నేపథ్యంలో ఇండియన్​ ప్రీమియర్​ లీగ్​ (ఐపీఎల్​) (IPL News) కోసం భారత క్రికెట్​ నియంత్రణ మండలి (బీసీసీఐ) (BCCI) వినూత్న నిర్ణయాలు తీసుకుంటోంది. ఇకపై బంతి సిక్స్​ పడిందంటే చాలు మరో కొత్త బంతిని ఇవ్వనుందట.

BCCI IPL
బీసీసీఐ ఐపీఎల్
author img

By

Published : Aug 10, 2021, 4:25 PM IST

ఇండియన్‌ ప్రీమియర్‌ లీగ్‌ను (ఐపీఎల్​) (IPL News) విజయవంతం చేసేందుకు బీసీసీఐ (BCCI) కఠిన నిర్ణయాలు తీసుకుంటోంది. ఏ మాత్రం కరోనా వైరస్‌కు అవకాశం ఇవ్వకూడదని భావిస్తోంది. అన్ని వ్యవహారాలను దగ్గరుండి పర్యవేక్షిస్తోంది. ఆటగాళ్లు ఎవరైనా సిక్సర్‌ బాదితే ప్రత్యామ్నాయ బంతిని ఇవ్వనుందని తాజా సమాచారం.

ప్రస్తుత పరిస్థితుల్లో బ్యాట్స్‌మెన్‌ సిక్సర్లు బాదితే స్టాండ్స్‌లోకి వెళ్లిన బంతిని అంపైర్లు వెంటనే శానిటైజ్‌ చేస్తున్నారు. బీసీసీఐ అంతకు మించే జాగ్రత్తలు తీసుకుంటోందని తెలుస్తోంది. ఏకంగా మరో బంతిని ఇవ్వనుందని అంటున్నారు. నిజానికి బంతి వల్ల కొవిడ్‌ వచ్చే అవకాశాలు దాదాపుగా లేవని అధ్యయనాలు చెబుతున్నాయి. అయినప్పటికీ బీసీసీఐ ఏ మాత్రం రిస్క్‌ తీసుకోవాలని భావించడం లేదు.

'ఒకవేళ బంతి స్టాండ్స్‌ లేదా స్టేడియం అవతల పడితే నాలుగో అంపైర్‌ మరో బంతిని ఇస్తారు. అంతకు ముందు బంతి దొరకగానే దానిని ఆల్కహాల్‌ ఆధారిత వైప్స్‌ లేదా యూవీ-సీతో శుభ్రపరుస్తారు. మళ్లీ బంతుల లైబ్రరీలో చేర్చుతారు' అని మీడియాలో కథనాలు వస్తున్నాయి. ఆటగాళ్లు మైదానంలో ఉమ్మి వేయడాన్నీ బీసీసీఐ నిషేధించనుందని తెలిసింది. ఇందుకోసం టిష్యూ పేపర్లను వారికి అందివ్వనుంది. వాటిని ఆటగాళ్లే జాగ్రత్తగా చెత్త కుండీలో వేయాలి. లీగ్‌ కోసం యూఏఈలో 14 బయో బుడగలను ఏర్పాటు చేస్తుంది.

ఇదీ చదవండి: పాపం హేల్స్​.. వరుసగా రెండు బంతులు అక్కడే తగిలాయి!

ETV Bharat Logo

Copyright © 2025 Ushodaya Enterprises Pvt. Ltd., All Rights Reserved.