ముంబయి ఇండియన్స్ ఆల్‌రౌండర్ హార్దిక్ పాండ్య.. త్వరలో బౌలింగ్ చేస్తాడని ఆ జట్టు డైరెక్టర్ జహీర్‌ఖాన్ చెప్పాడు. గతంలో తగిలిన గాయం వల్ల, ఇప్పటివరకు ఆడిన రెండు మ్యాచుల్లో బౌలింగ్ వేయలేదు. అయితే హార్దిక్ బౌలింగ్ కోసం తాను ఎదురుచూస్తున్నట్లు జహీర్ వెల్లడించాడు.
-
On your mark ✅
— Mumbai Indians (@mipaltan) September 27, 2020 " class="align-text-top noRightClick twitterSection" data="
Get set ✅
Go and smash them out of the park ✅#OneFamily #MumbaiIndians #MI #Dream11IPL @hardikpandya7 pic.twitter.com/NVSWCF1WR2
">On your mark ✅
— Mumbai Indians (@mipaltan) September 27, 2020
Get set ✅
Go and smash them out of the park ✅#OneFamily #MumbaiIndians #MI #Dream11IPL @hardikpandya7 pic.twitter.com/NVSWCF1WR2On your mark ✅
— Mumbai Indians (@mipaltan) September 27, 2020
Get set ✅
Go and smash them out of the park ✅#OneFamily #MumbaiIndians #MI #Dream11IPL @hardikpandya7 pic.twitter.com/NVSWCF1WR2
హార్దిక్ బౌలింగ్ కోసం ఎంతగానో ఎదురుచూస్తున్నాం. అతడో గొప్ప బౌలర్. పరిస్థితులకు అనుగుణంగా ఎలా ఆడాలో అతడికి బాగా తెలుసు. కాకపోతే గతంలో తగిలిన గాయాల వల్ల ఇప్పటివరకు జరిగిన మ్యాచుల్లో బౌలింగ్ వేయలేదు. ఫిజియోథెరపిస్ట్‌లతో దీని గురించే చర్చిస్తున్నాం. ప్రస్తుతం అతడి శరీరం బాగానే ఉందన్నారు. తర్వాతి మ్యాచుల్లో అతడు బౌలింగ్ వేసే అవకాశాలు పరిశీలిస్తున్నాం. మనందరం కాస్త ఓపిక, సహనంతో వేచి చూడాలి.
-జహీర్ ఖాన్, ముంబయి ఇండియన్స్ డెరెక్టర్
గతేడాది అక్టోబరులో వెన్ను గాయం కావడం వల్ల ఏడాది పాటు ఆటకు దూరమయ్యాడు హార్దిక్. తర్వాతి మ్యాచ్‌లో( సెప్టెంబరు 28న) బెంగళూరు జట్టుతో అమీతుమీ తేల్చుకోనుంది ముంబయి ఇండియన్స్. ఇప్పటివరకు ఆడిన రెండు మ్యాచుల్లో మొదటిది ఓడిపోగా.. రెండోది గెలిచింది.
ఇదీ చూడండి సంజు టీమ్ఇండియాలో లేడా?: షేన్ వార్న్