ETV Bharat / sports

సూపర్​ ఓవర్​ నిబంధన ఎప్పుడు, ఎలా ప్రారంభమైంది?

దిల్లీ క్యాపిటల్స్-కింగ్స్ ఎలెవన్ పంజాబ్ మధ్య జరిగిన మ్యాచ్​ సూపర్ ఓవర్​కు దారితీసింది. ఉత్కంఠపోరులో దిల్లీ గెలిచి ఐపీఎల్​లో బోణీ కొట్టింది. ఈ నేపథ్యంలో క్రికెట్​లో సూపర్​ ఓవర్​ అంటే ఏమిటి? తొలిసారిగా ఈ నిబంధనను ఎప్పుడు, ఎందుకు ప్రవేశపెట్టారు? వంటి అంశాల సమాహారమే ఈ కథనం.

Super Over
సూపర్​ ఓవర్
author img

By

Published : Sep 22, 2020, 10:00 AM IST

Updated : Sep 25, 2020, 6:00 PM IST

సెప్టెంబరు 20న కింగ్స్ ఎలెవన్ పంజాబ్​తో జరిగిన రెండో టీ20.. సూపర్‌ ఓవర్‌కు దారి తీయగా ఉత్కంఠపోరులో దిల్లీ క్యాపిటల్స్ విజయం సాధించింది. తొలుత శ్రేయస్‌ అయ్యర్‌ జట్టు 157/8 పరుగులు చేయగా తర్వాత కేఎల్‌ రాహుల్‌ టీమ్‌ కూడా అన్నే పరుగులు చేసింది. దీంతో మ్యాచ్‌ టైగా మారి సూపర్‌ ఓవర్‌కు దారి తీసింది. ఈ నేపథ్యంలో సూపర్​ ఓవర్​ అంటే ఏమిటి? ఎప్పుడు, ఎందుకు ప్రవేశపెట్టారు? వంటి అంశాల సమాహారమే ఈ కథనం.

Super Over
సూపర్​ ఓవర్

తొలిసారిగా 2008లో

2008లో తొలిసారిగా సూపర్​ ఓవర్​ పద్ధతిని టీ20ల్లో ప్రవేశపెట్టారు. అంతకుముందు అంతర్జాతీయ టీ20ల్లో మ్యాచ్‌ టై అయితే బౌల్‌ అవుట్‌ పద్దతి ద్వారా విజేతను నిర్ణయించేవారు. ఇందులో ఒక్కో జట్టు నుంచి ఐదుగురు బౌలర్లు ఐదు బంతులతో వికెట్లను పడగొట్టాల్సి ఉంటుంది. 2007 టీ20 ప్రపంచక్‌పలో భారత్‌, పాక్‌ మ్యాచ్‌ టై అయితే ఈ పద్ధతినే అవలంబించారు. ఆ తర్వాత ఈ రూల్‌ మారింది. ఐసీసీ నిబంధన 16.9.4డి ప్రకారం.. ఒక మ్యాచ్‌లో తలపడిన రెండు జట్ల స్కోర్లు సమానమైనప్పుడు విజేత కోసం సూపర్‌ ఓవర్‌ నిబంధన తీసుకొచ్చారు. ఒక ఓవర్ ఎలిమినేటర్ అని కూడా పిలుస్తారు. ఇందులో ఇరు జట్లు ఆరు బంతులను మాత్రమే ఆడతాయి. ఈ ఆరు బంతుల్లో ఏ జట్టు ఎక్కువ పరుగులు చేస్తే ఆ జట్టే విజేత.

Super Over
సూపర్​ ఓవర్

సూపర్ ఓవర్‌ ఎలా ఆడతారు?

టీ20ల్లో ముందుగా ప్రతిజట్టు ముగ్గురు బ్యాట్స్​మెన్​ను ఎంపిక చేసుకుంటుంది. మ్యాచ్​లో ఏ జట్టైతే రెండో ఇన్నింగ్స్​ చేస్తుందో ఆ జట్టు సూపర్ ఓవర్‌ను మొదటగా ఆడుతుంది. ఇందులో రెండు వికెట్ల వరకే పరిమితి.

ఏ జట్టు అయితే అత్యధిక పరుగులు చేస్తుందో వారే విజేతలు. ఒకవేళ సూపర్ ఓవర్​ టై అయినా.. అందులో ఫలితం తేలే వరకు సూపర్​ ఓవర్​ను కొనసాగిస్తారు.

Super Over
సూపర్​ ఓవర్

సుపర్​ఓవర్​ను తొలిసారిగా ఆడింది వీరే

2008లో డిసెంబరు 26న వెస్టిండీస్​-న్యూజిలాండ్​ మధ్య జరిగిన టీ20 మ్యాచ్ సూపర్​ ఓవర్​కు దారితీసింది. ఇందులో విండీస్​ 25-1 స్కోరు చేయగా, న్యూజిలాండ్​ 2 వికెట్ల నష్టానికి 15 పరుగులు చేసి ఓటమిపాలైంది.

అంతర్జాతీయ క్రికెట్​లోనూ సూపర్​ ఓవర్​ టై అయితే?

2019లో సూపర్​ ఓవర్​లో కొత్త నిబంధన తెచ్చింది ఐసీసీ. ఇందులో కూడా స్కోరు టైగా ముగిస్తే.. మళ్లీ సూపర్​ఓవర్​ను నిర్వహిస్తారు. ఇలా ఫలితం వచ్చేవరకు సూపర్​ఓవర్​ను​ కొనసాగించేలా నియమాన్ని తీసుకొచ్చింది.

వన్డే క్రికెట్​లోనూ

వాస్తవానికి సూపర్ ఓవర్ అనేది ఐసీసీ వన్డే క్రికెట్ ఆట నియమ నిబంధనల్లో లేదు. కానీ, టీ20 నిబంధనల్లో ఉంది. ఆ తర్వాత 2011 క్రికెట్ ప్రపంచకప్ నాకౌట్ దశలో ఈ సూపర్ ఓవర్ నిబంధనను వన్డే క్రికెట్‌లో ప్రవేశపెట్టింది ఐసీసీ. కానీ, దీనిని ఉపయోగించే అవకాశం రాలేదు. 2017లో మహిళల క్రికెట్ ప్రపంచకప్, ఛాంపియన్స్ ట్రోఫీ నాకౌట్ దశలకూ సూపర్ ఓవర్‌ విధానాన్ని ఐసీసీ ప్రవేశపెట్టింది. ఆ తర్వాత 2019 ప్రపంచకప్ ఫైనల్​లో ఇంగ్లాండ్​, న్యూజిలాండ్​ మధ్య మ్యాచ్​ టైగా ముగిసి.. సూపర్​ ఓవర్​కు దారితీసింది. అది కూడా టై అయింది. దీంతో మ్యాచ్​లో ఎక్కువ బౌండరీలు కొట్టిన ఇంగ్లాండ్​ను విజేతగా ప్రకటించారు. దీనిపై విమర్శలు రావడం వల్ల ఫలితం తేలే వరకు సూపర్ ఓవర్ కొనసాగించాలని గతేడాది కొత్త రూల్ తీసుకొచ్చారు.

ఇదీ చూడండి మూడు ఓవర్లు​ పూర్తి.. నిలకడగా బెంగళూరు

Last Updated : Sep 25, 2020, 6:00 PM IST
ETV Bharat Logo

Copyright © 2024 Ushodaya Enterprises Pvt. Ltd., All Rights Reserved.