ETV Bharat / sports

'మన్​దీప్ ఆట తీరు చూస్తే ఉద్వేగం కలుగుతోంది' - KL Rahul was all praise for his teammate Mandeep Singh

సమష్టిగా ఆడటం వల్ల వరుస విజయాలు సాధిస్తున్నట్లు చెప్పాడు పంజాబ్ సారథి కేఎల్ రాహుల్. మ్యాచ్ గెలిపించిన మన్​దీప్ సింగ్, క్రిస్ గేల్​పై ప్రశంసలు కురిపించాడు. మన్​దీప్ ఆడిన తీరు చూస్తే అందరికీ ఉద్వేగం కలుగుతుందని అన్నాడు.

Way Mandeep played made everyone emotional: KL Rahul
'మన్​దీప్ ఆట తీరు చూస్తే ఉద్వేగం కలుగుతుంది'
author img

By

Published : Oct 26, 2020, 11:58 PM IST

Updated : Oct 27, 2020, 12:05 AM IST

వరుస విజయాలతో కింగ్స్ ఎలెవన్ పంజాబ్ ఐపీఎల్ పాయింట్ల పట్టికలో నాలుగో స్థానానికి దూసుకెళ్లింది. ఐపీఎల్ తొలి అర్ధభాగంలో తడబడి.. ఇప్పుడు భారీ విజయాలు నమోదు చేస్తోంది. తాజాగా కోల్​కతాతో జరిగిన మ్యాచ్​లో ఎనిమిది వికెట్ల తేడాతో గెలుపొందింది. జట్టు సమష్టిగా ఆడటం వల్లే విజయాలు సాధిస్తున్నామని పంజాబ్ జట్టు సారథి కేఎల్ రాహుల్ పేర్కొన్నాడు. ఇటీవలే తన తండ్రిని కోల్పోయిన మన్​దీప్ సింగ్ బ్యాటింగ్​పై ప్రశంసలు కురిపించాడు. ఈ మ్యాచ్​లో 66 పరుగులతో అజేయంగా నిలిచాడు మన్​దీప్.

"బయో బబుల్​లో మనకు సన్నిహితులు ఉండరు. మన్​దీప్ ఆడిన విధానం చూస్తే అందరికీ ఉద్వేగం కలుగుతుంది. అనిల్ కుంబ్లే కోచ్​గా ఉన్నప్పుడు జట్టులో ఇద్దరు లెగ్​ స్పిన్నర్లు ఉండటం ఆశ్చర్యం కలిగించదు. బ్యాటింగ్, బౌలింగ్, ఫీల్డింగ్​లో రాణించాం. ఇది జట్టు సమష్టి ప్రదర్శన. ఈ విజయాల్లో కోచ్​లదే కీలక పాత్ర."

-కేఎల్ రాహుల్, పంజాబ్ సారథి

మ్యాన్ ఆఫ్ ది మ్యాచ్​గా నిలిచిన క్రిస్ గేల్​పై ప్రశంసలు కురిపించాడు రాహుల్. తొలి అర్ధభాగంలో గేల్​ను ఆడించకుండా ఉండటమనేది కఠిన నిర్ణయమని అన్నాడు. క్రిస్ గేల్ డ్రెస్సింగ్ రూంలో ఉండటం తమకు గొప్ప విషయమని చెప్పుకొచ్చాడు.

190 పరుగులు చేయాల్సింది

షార్జా వంటి పిచ్​ల తీరును ముందుగానే పసిగట్టాల్సిందని అన్నాడు కోల్​కతా కెప్టెన్ ఇయాన్ మోర్గాన్ అన్నాడు. వికెట్లు త్వరగా కోల్పోయినప్పుడు మరింత దూకుడుగా ఆడాల్సిందని చెప్పాడు. 180-190 పరుగులు చేయాల్సిందని అభిప్రాయపడ్డాడు. అయితే శుభ్​మన్ గిల్ రాణించడం, పంజాబ్​ను 12వ ఓవర్ వరకు బాగానే కట్టడి చేయడం మ్యాచ్​లో కోల్​కతాకు సానుకూలాంశాలని చెప్పాడు.

Last Updated : Oct 27, 2020, 12:05 AM IST
ETV Bharat Logo

Copyright © 2025 Ushodaya Enterprises Pvt. Ltd., All Rights Reserved.