ETV Bharat / sports

రోహిత్​తో మాట్లాడాకే కుదుటపడ్డా: సూర్యకుమార్​ - టీమ్​ఇండియాలో చోటు దక్కకపోవడంపై బాధపడ్డా

భారత జట్టులో చోటు దక్కని సందర్భంలో, రోహిత్​ శర్మ మాటలు ఎంతో ఆత్మవిశ్వాసాన్ని నింపాయని సూర్యకుమార్​ యాదవ్ చెప్పాడు​. ఈసారి ఐపీఎల్​లో తన ప్రదర్శన పట్ల సంతృప్తిగా ఉన్నట్లు తెలిపాడు.

rohith
రోహిత్​
author img

By

Published : Nov 22, 2020, 5:16 PM IST

ఆస్ట్రేలియా పర్యటనలో చోటు దక్కపోవడంపై తాను అసంతృప్తికి గురైనట్లు టీమ్​ఇండియా ఆటగాడు సూర్యకుమార్​ యాదవ్ చెప్పాడు​. జట్లు ప్రకటించిన రోజు తాను చాలా బాధపడ్డాడని అన్నాడు. కానీ ఆ సమయంలో ముంబయి ఇండియన్స్​ సారథి రోహిత్​ శర్మతో మాట్లాడిన తర్వాత ఆ బాధ పోయిందని తెలిపాడు. హిట్​మ్యాన్​ మాటలు ఎంతో స్ఫూర్తినిచ్చాయని వెల్లడించాడు.

Suryakumar
సూర్యకుమార్​

"ఆ రోజు జిమ్​లో రోహిత్​ నా పక్కన కూర్చున్నాడు. నేను బాధలో ఉన్నాని అతడితో చెప్పాను. 'ఐపీఎల్ ప్రారంభం నుంచి జట్టు కోసం నువ్వు నీ బాధ్యతను సరిగ్గా నిర్వర్తిస్తున్నావు. టీమ్​ఇండియాలో చోటు దక్కకపోవడంపై ఆలోచించకుండా, ఇప్పుడు కూడా అదే చేస్తావని నా నమ్మకం. సరైనా సమయంలో నీకు అవకాశం వస్తుంది. అది ఈరోజు లేదా ఇంకెప్పుడైనా రావాల్సిందే. నీపైనా నువ్వు విశ్వాసం ఉంచు' అని నాతో అన్నాడు. ఈ మాటలు నన్ను బాధ నుంచి బయటకు లాగి, ఆత్మవిశ్వశాన్ని నింపాయి"

-సూర్యకుమార్​ యాదవ్​, టీమ్​ఇండియా క్రికెటర్​

rohith
రోహిత్​

సంతృప్తినిచ్చింది

ఈ ఐపీఎల్​తో తాను మరింత మెరుగయ్యానని సూర్యకుమార్ చెప్పాడు​. మంచి ప్రదర్శన చేయడం కోసం బాగా శ్రమించానని తెలిపాడు.

"2018 నుంచి నన్ను నేను మరింత మెరుగుపరుచుకోవడానికి ప్రతిరోజు శ్రమిస్తూనే ఉన్నాను. సాధారణంగా లెగ్​ సైడ్​ ఆడటానికి బాగా ఇష్టపడతాను. ఆ తర్వాత మరింత ప్రాక్టీస్​ చేసి ఆఫ్​ సైడ్​ స్ట్రోక్స్​ ఆడటం బాగా నేర్చుకున్నాను. మొత్తంగా ఈ ఐపీఎల్​లో నా ప్రదర్శనకు నేను సంతృప్తిగా ఉన్నాను. లీగ్​ ప్రారంభం నుంచి ఎక్కువ పరుగులు చేయడం కన్నా జట్టు విజయానికి ఏం చేయగలను అనే విషయాన్ని ఎక్కువగా ఆలోచించాను"

ఈ సీజన్​లో అద్భుత ప్రదర్శనతో క్రికెట్ ​అభిమానుల నుంచి పలువురు మాజీ, ప్రస్తుత క్రికెటర్లందరీ దృష్టినీ ఆకర్షించాడు. అతడికి టీమ్​ఇండియాలో చోటు దక్కుతుందని అందరూ అనుకున్నారు. కానీ అతడు ఎంపిక కాలేదు. దీంతో పలువులు క్రికెటర్లు సూర్యకు మద్దతు తెలుపుతూ సెలక్టర్లపై విమర్శలు కూడా చేశారు.

ఇదీ చూడండి :

సూర్యకుమార్​ బ్యాటింగ్​ అద్భుతం: రోహిత్​

కోహ్లీ స్లెడ్జింగ్​పై సూర్య కుమార్ యాదవ్ వివరణ

ETV Bharat Logo

Copyright © 2024 Ushodaya Enterprises Pvt. Ltd., All Rights Reserved.