ETV Bharat / sports

కోహ్లీ వల్లే బెంగళూరు జట్టు అలా: గావస్కర్

ఈ సీజన్​లో కోహ్లీ స్థాయికి తగ్గట్లు ఆడలేకపోయాడని గావస్కర్ చెప్పాడు. అందుకే ఆర్సీబీ టోర్నీ నుంచి వైదొలగాల్సి వచ్చిందని అభిప్రాయపడ్డాడు.

Virat Kohli didn't quite match his own high standards with bat: Sunil Gavaskar
కోహ్లీ
author img

By

Published : Nov 7, 2020, 10:50 AM IST

ఐపీఎల్​ ప్రస్తుత సీజన్​లో కోహ్లీ.. తన స్టాండర్డ్స్​కు తగ్గట్లు ఆడలేదని భారత మాజీ కెప్టెన్ సునీల్ గావస్కర్ చెప్పాడు. బెంగళూరు జట్టు వైఫల్యానికి ఇది ఓ కారణమని అభిప్రాయపడ్డాడు. విరాట్-డివిలియర్స్, ప్రతి మ్యాచ్​లోనూ భారీగా పరుగులు చేసి ప్రత్యర్థిపై ఒత్తిడి తేవాల్సిందని అన్నాడు.

ప్లేఆఫ్స్​లో భాగంగా శుక్రవారం జరిగిన ఎలిమినేటర్​ మ్యాచ్​లో హైదరాబాద్​ చేతిలో ఓడిన ఆర్సీబీ.. సీజన్​ నుంచి నిష్క్రమించింది. ఈ నేపథ్యంలో గావస్కర్ పై వ్యాఖ్యలు చేశాడు.

"ఐపీఎల్​లో కోహ్లీ కొన్ని స్టాండర్డ్స్​ను నమోదు చేశాడు. కానీ ఈ సీజన్​లో వాటిని అందుకోవడం గాని, అధిగమించడం గానీ చేయలేకపోయాడు. బహుశా ఆర్సీబీ నిష్క్రమణకు అదీ ఓ కారణమేమో. బౌలింగ్​ విభాగం బలహీనమైన సరే ఫించ్, దేవ్​దత్ పడిక్కల్, కోహ్లీ, డివిలియర్స్ లాంటి అద్భుతమైన బ్యాట్స్​మెన్​ ఆ జట్టులో ఉన్నారు. అయితే ఐదో స్థానంలో సరైన ఆల్​రౌండర్​ ఉంటే విరాట్-ఏబీ లపై కొంతమేర ఒత్తిడి తగ్గుతుంది" -సునీల్ గావస్కర్, టీమ్​ఇండియా మాజీ సారథి

sunil gavaskar
మాజీ కెప్టెన్ సునీల్ గావస్కర్

బెంగళూరపై గెలిచిన హైదరాబాద్.. ఆదివారం జరిగే క్వాలిఫయర్​-2లో దిల్లీతో తలపడనుంది. ఇందులో గెలిచిన జట్టు.. ఫైనల్లో ముంబయిని ఢీకొంటుంది. నవంబరు 10న ఈ మ్యాచ్​ జరగనుంది.

ఇవీ చదవండి:

ETV Bharat Logo

Copyright © 2024 Ushodaya Enterprises Pvt. Ltd., All Rights Reserved.