ETV Bharat / sports

అరుదైన రికార్డు సాధించిన కోహ్లీ-డివిలియర్స్​ జోడీ - ఐపీఎల్​ కోహ్లీ డివిలియర్స్ భాగస్వామ్యం

రాయల్ ఛాలెెంజర్స్ బెంగళూరు జట్టు సారథి కోహ్లీ, డివిలియర్స్​ భాగస్వామ్యం అరుదైన రికార్డును సొంతం చేసుకుంది. సోమవారం కోల్​కతా నైట్​రైడర్స్​తో జరిగిన మ్యాచ్​తో ఐపీఎల్​ చరిత్రలోనే పదో సెంచరీ భాగస్వామ్యం నమోదు చేసిన తొలి జోడీగా రికార్డుకెక్కింది.

Virat Kohli-AB de Villiers
కోహ్లీ-డివిలియర్స్​
author img

By

Published : Oct 13, 2020, 9:37 AM IST

ఐపీఎల్​లో రాయల్ ఛాలెంజర్స్ బెంగళూరు జట్టు సారథి కోహ్లీ, డివిలియర్స్ కలిసి ఇప్పటివరకు అనేక భారీ భాగస్వామ్యాలు నెలకొల్పారు. సోమవారం కోల్​కతా నైట్​రైడర్స్​తో జరిగిన మ్యాచ్​తో మరో మైలురాయిని అందుకున్నారు. టోర్నీ చరిత్రలోనే పదో సెంచరీ భాగస్వామ్యం నమోదు చేసిన తొలి జోడీగా రికార్డుకెక్కారు. ఇప్పటివరకు వీరిద్దరు కలిసి మూడువేల పరుగుల భాగస్వామ్యాన్ని సాధించారు.

రెండో స్థానంలో తొమ్మిది సెంచరీల భాగస్వామ్యంతో కోహ్లీ-క్రిస్​గేల్​ ఉండగా.. ఆరు సెంచరీల భాగస్వామ్యంతో శిఖర్​ ధావన్​-డేవిడ్​ వార్నర్​ జోడీ మూడో స్థానంలో నిలిచారు.

షార్జా వేదికగా కోల్​కతాతో జరిగిన మ్యాచ్​లో బెంగళూరు జట్టు 82 పరుగులు తేడాతో గెలుపొందింది. మొదట బ్యాటింగ్‌ చేసిన బెంగళూరు రెండు వికెట్ల నష్టానికి 194 పరుగులు చేసింది. డివిలియర్స్ (73), కోహ్లీ(33) విధ్వంసం సృష్టించారు. 46బంతుల్లో సెంచరీ భాగస్వామ్యాన్ని నమోదు చేశారు. అనంతరం బరిలోకి దిగిన కోల్‌కతా తొమ్మిది వికెట్లు కోల్పోయి 112 పరుగులకే పరిమితమైంది. బెంగళూరు బౌలర్లు సమష్టిగా సత్తాచాటారు. కోహ్లీసేనకు ఇది ఐదో విజయం. ప్రస్తుతం పాయింట్ల పట్టికలో మూడో స్థానంలో ఉంది.

Virat Kohli-AB de Villiers
కోహ్లీ-డివిలియర్స్​

ఇదీ చూసింది ఏడుగురు ఫుట్​బాలర్స్​కు కరోనా పాజిటివ్​!

ETV Bharat Logo

Copyright © 2025 Ushodaya Enterprises Pvt. Ltd., All Rights Reserved.