ETV Bharat / sports

'భారత టీ20 జట్టుకు ఎంపికవడం నమ్మలేకపోతున్నా' - వరుణ్ చక్రవర్తి స్పందన

ఈ ఏడాది ఐపీఎల్​లో ఉత్తమ బౌలింగ్​ చేసిన కోల్​కతా నైట్​ రైడర్స్ ఆటగాడు వరుణ్ చక్రవర్తి భారత టీ20 జట్టుకు ఎంపికయ్యాడు. ఈ విషయాన్ని నమ్మలేకపోతున్నానని పేర్కొన్నాడు వరుణ్.

Varun Chakravarthy_KKR
'భారత టీ20 జట్టుకు ఎంపికవడం నమ్మలేకపోతున్నా'
author img

By

Published : Oct 28, 2020, 7:46 AM IST

భారత టీ20 జట్టుకు ఎంపిక కావడాన్ని నమ్మలేకపోతున్నానని కోల్‌కతా నైట్‌రైడర్స్‌ స్పిన్నర్‌ వరుణ్‌ చక్రవర్తి అన్నాడు. భారత జట్టుకు ఎంపికయ్యానని సోమవారం కింగ్స్‌ ఎలెవన్‌ పంజాబ్‌తో మ్యాచ్‌ ముగిసిన తర్వాత తెలిసింది.

" ఆ వార్తను నమ్మలేకపోయా. కేకేఆర్‌ తరపున నిలకడగా రాణించి జట్టుకు విజయాలు అందించాలనేది నా ప్రాథమిక లక్ష్యం. ఇప్పుడు భారత జట్టులోనూ ఆడి అలాగే చేస్తాననే నమ్మకంతో ఉన్నా. నాపై విశ్వాసముంచిన సెలక్టర్లకు ధన్యవాదాలు. అసలు మాటలు రావట్లేదు" అని వరుణ్ చెప్పాడు. ఈ సీజన్‌లో దిల్లీ క్యాపిటల్స్‌పై అయిదు వికెట్లతో సంచలన ప్రదర్శన చేసిన వరుణ్‌ జాతీయ జట్టుకు తనను ఎంపిక చేయక తప్పని పరిస్థితిని సెలక్టర్లకు కలిగించాడు.

ఇదీ చదవండి:నా బౌలింగ్ బలం అదే: రషీద్​ ఖాన్​

ETV Bharat Logo

Copyright © 2025 Ushodaya Enterprises Pvt. Ltd., All Rights Reserved.