ఒక్క పరుగు.. మ్యాచ్ గమనాన్నే మార్చేసిన సందర్భాలు చాలా ఉన్నాయి. ఐపీఎల్‌లోనూ అలాంటి సంఘటనలు చూశాం. జట్టు నిర్లక్ష్యం వల్ల అలా ఓడిపోతే తప్పు తమదేనని చింతించవచ్చు. కానీ వారు ఏ తప్పు చేయకుండా ఓడిపోతే.. ఓ అంపైర్ నిర్ణయం జట్టు కొంపముంచితే!.. నిన్న కింగ్స్ ఎలెవన్ పంజాబ్- దిల్లీ క్యాపిటల్స్ మధ్య జరిగిన మ్యాచ్‌లో ఇదే జరిగింది. అంపైర్ నిర్ణయం పంజాబ్ ఓటమికి కారణమైంది.
గతేడాది ఐపీఎల్లో నోబాల్స్ తప్పిదాలు చాలా జరిగాయి. దీంతో ఈసారి కొత్తగా టీవీ అంపైర్లకు నోబాల్ నిర్ణయించే బాధ్యతను అప్పగించారు. కానీ నిన్నటి మ్యాచ్‌లో అంపైర్ నితిన్ మేనన్ ప్రకటించిన షార్ట్ రన్ నిర్ణయం వివాదాస్పదమైంది. దిల్లీ చేతిలో పంజాబ్ ఓటమికి కారణమైంది. దీంతో మాజీ క్రికెటర్ వీరేంద్ర సెహ్వాగ్‌తో పాటు పలువురు అంపైర్‌ని తప్పుబడుతూ నెట్టింట పోస్టులు పెడుతున్నారు.
-
I don’t agree with the man of the match choice . The umpire who gave this short run should have been man of the match.
— Virender Sehwag (@virendersehwag) September 20, 2020 " class="align-text-top noRightClick twitterSection" data="
Short Run nahin tha. And that was the difference. #DCvKXIP pic.twitter.com/7u7KKJXCLb
">I don’t agree with the man of the match choice . The umpire who gave this short run should have been man of the match.
— Virender Sehwag (@virendersehwag) September 20, 2020
Short Run nahin tha. And that was the difference. #DCvKXIP pic.twitter.com/7u7KKJXCLbI don’t agree with the man of the match choice . The umpire who gave this short run should have been man of the match.
— Virender Sehwag (@virendersehwag) September 20, 2020
Short Run nahin tha. And that was the difference. #DCvKXIP pic.twitter.com/7u7KKJXCLb
ఏం జరిగిందంటే ?
మొదట బ్యాటింగ్ చేసిన దిల్లీ క్యాపిటిల్స్ 8 వికెట్ల నష్టానికి 157 పరుగులు చేసింది. అనంతరం 158 పరుగుల లక్ష్యంతో బరిలోకి దిగిన కింగ్స్ ఎలెవన్ పంజాబ్.. చివర్లో విజయానికి 12 బంతుల్లో 25 పరుగులు చేయాల్సి ఉంది. ఆ సమయంలో దిల్లీ కెప్టెన్ శ్రేయస్ అయ్యర్ రబాడకు బౌలింగ్ అప్పగించాడు. ఈ ఓవర్‌లో జాగ్రత్తగా ఆడిన మయాంక్ అగర్వాల్ (89) రెండు ఫోర్లు బాదాడు. ఆ ఓవర్ మూడో బంతిని ఫుల్‌టాస్‌గా వేయగా.. ఎక్స్‌ట్రా కవర్ దిశగా మయాంక్ ఆడాడు. ఈ సమయంలో రెండు పరుగుల కోసం ప్రయత్నించగా నాన్‌స్ట్రైక్ ఎండ్‌లో ఉన్న క్రిస్ జోర్దాన్ సింగిల్‌ని పూర్తి చేసే క్రమంలో కీపర్ ఎండ్‌వైపు సరిగా క్రీజులో బ్యాట్ పెట్టలేదని తేల్చిన స్వ్కేర్ లెగ్ అంపైర్ నితిన్ మేనన్.. 'షార్ట్ రన్'గా ప్రకటించి పంజాబ్‌కు ఒక పరుగు మాత్రమే ఇచ్చాడు.
చివరి ఓవర్‌లో మయాంక్ ఔట్ కావడం వల్ల పంజాబ్ 157/8తో నిలిచింది. ఫలితంగా ఇరుజట్ల స్కోర్లు సమమై మ్యాచ్ సూపర్ ఓవర్‌కు దారితీసింది. ఈ సూపర్ ఓవర్‌లో దిల్లీ గెలుపొందింది.