ETV Bharat / sports

మహిళల టీ20 లీగ్​ విజేతగా ట్రయల్ బ్లేజర్స్

author img

By

Published : Nov 9, 2020, 11:28 PM IST

షార్జా వేదికగా జరిగిన మహిళల టీ20 లీగ్​ మూడో సీజన్​ విజేతగా స్మృతి మంధాన సారథ్యంలోని ట్రయల్​ బ్లేజర్స్​ నిలిచింది. డిఫెండింగ్​ ఛాంపియన్​ సూపర్​నోవాస్​పై 16 పరుగుల తేడాతో విజయం సాధించి తొలిసారి ట్రోఫీని ముద్దాడింది.

Trailblazers beat Supernovas to win maiden title
మహిళల టీ20 లీగ్​: సూపర్​నోవాస్​పై ట్రయల్​బ్లేయర్స్​ విజయం

మహిళల టీ20 లీగ్‌ మూడో సీజన్‌ విజేతగా ట్రయల్‌బ్లేజర్స్‌ నిలిచింది. షార్జా వేదికగా జరిగిన ఫైనల్‌లో డిఫెండింగ్‌ ఛాంపియన్‌ సూపర్‌నోవాస్‌ను 16 పరుగుల తేడాతో చిత్తు చేసి తొలి టైటిల్‌ను దక్కించుకుంది. తొలుత టాస్ ఓడి బ్యాటింగ్‌కు దిగిన ట్రయల్‌బ్లేజర్స్‌ నిర్ణీత 20 ఓవర్లలో ఎనిమిది వికెట్లకు 118 పరుగులు చేసింది. స్మృతి మంధాన (68) కెప్టెన్‌ ఇన్నింగ్స్‌ ఆడింది. అనంతరం బరిలోకి దిగిన సూపర్‌నోవాస్‌ 20 ఓవరల్లో ఏడు వికెట్లు కోల్పోయి 102 పరుగులకే పరిమితమైంది. హర్మన్‌ప్రీత్‌ (30) టాప్‌ స్కోరర్‌. సాల్మ (3/18), దీప్తి (2/9) ఆ జట్టును దెబ్బతీశారు.

ఛేదనకు దిగిన సూపర్‌నోవాస్‌ ఏ దశలోనూ పైచేయి సాధించలేదు. దీప్తి శర్మ ధాటికి 37 పరుగులకే మూడు వికెట్లు కోల్పోయి కష్టాల్లో పడింది. ఈ దశలో బ్యాటింగ్‌కు వచ్చిన శశికళ (19)తో కలిసి హర్మన్‌ప్రీత్‌ ఇన్నింగ్స్‌ చక్కదిద్దే ప్రయత్నం చేసింది. కాగా, దూకుడుగా ఆడే క్రమంలో శశికళ వెనుదిరిగింది. మరోవైపు హర్మన్‌ప్రీత్ తన పోరాటం కొనసాగించింది. అడపాదడపా బౌండరీలు సాధిస్తున్నప్పటికీ కావాల్సిన రన్‌రేటు భారీగా పెరిగిపోయింది. ఆఖరి 12 బంతుల్లో 27 పరుగులు అవసరమవగా.. సాల్మ మూడు వికెట్లు తీసి 4 పరుగులే ఇవ్వడం వల్ల సూపర్‌నోవాస్ ఓటమి ఖరారైంది. సూపర్‌నోవాస్‌లో ఛామరి (6), జెమిమా (13), తానియా భాటియా (14), అనూజ (8), రాధ (5*), షకీరా (4*) పరుగులు చేశారు. ట్రయల్‌బ్లేజర్స్ బౌలర్లలో సాల్మ మూడు, దీప్తి రెండు, సోఫియా ఒక వికెట్‌ తీశారు.

అర్ధశతకం బాదిన స్మృతి

అంతకుముందు టాస్ ఓడి బ్యాటింగ్‌కు దిగిన ట్రయల్‌బ్లేజర్స్‌కు శుభారంభం లభించింది. డాటిన్‌ (20) నిదానంగా ఆడినా స్మృతి దూకుడుగా బ్యాటింగ్​ చేయడం వల్ల ఆ జట్టు పవర్‌ప్లేలో 45 పరుగులు చేసింది. అయితే డాటిన్‌ను పూనమ్‌ బోల్తా కొట్టించడం వల్ల 71 పరుగుల వద్ద తొలి వికెట్ కోల్పోయింది. అనంతరం బ్యాటింగ్‌కు వచ్చిన రిచా (10)తో కలిసి స్మృతి స్కోరుబోర్డును ముందుకు నడిపించింది. ఈ క్రమంలో 38 బంతుల్లో అర్ధశతకం పూర్తిచేసింది. అయితే సూపర్‌నోవాస్‌ బౌలర్లు గొప్పగా పుంజుకుని క్రమం తప్పకుండా వికెట్లు సాధించి స్కోరుకు కళ్లెం వేశారు. ఆఖరి అయిదు ఓవర్లలో స్మృతిసేన 17 పరుగులే చేసి ఆరు వికెట్లు కోల్పోయింది. చివరి ఓవర్‌లో ఒక్క పరుగు వ్యవధిలోనే నాలుగు వికెట్లు చేజార్చుకుంది. ట్రయల్‌బ్లేజర్స్‌ బ్యాటర్లలో దీప్తి (9), హర్లీన్ (4), సోఫియా (1), జులన్‌ గోస్వామి (1) పరుగులు చేశారు. హర్మన్‌సేన బౌలర్లలో రాధ ఐదు, పూనమ్‌, శశికళ చెరో వికెట్‌ తీశారు.

ETV Bharat Logo

Copyright © 2024 Ushodaya Enterprises Pvt. Ltd., All Rights Reserved.