హైదరాబాద్‌తో జరిగిన మ్యాచ్‌లో కోల్‌కతా సూపర్ ఓవర్‌లో విజయం సాధించింది. 164 పరుగుల లక్ష్యంతో బరిలో దిగిన సన్‌రైజర్స్ 163 పరుగులు చేయడం వల్ల మ్యాచ్ టైకి దారితీసింది.. ఆపై హైదరాబాద్ సూపర్ ఓవర్‌లో రెండు పరుగులకే రెండు వికెట్లు కోల్పోయిన కారణంగా కోల్‌కతా సునాయాసంగా విజయం సాధించింది. రషీద్ ఖాన్ బౌలింగ్‌లో మూడు పరుగులు తీయడం ద్వారా మోర్గాన్ టీమ్ ఈ సీజన్‌లో ఐదో విజయాన్ని నమోదు చేసింది.
-
One word to describe this man right now. GO! 👇#SRHvKKR #KKRHaiTaiyaar #Dream11IPL pic.twitter.com/Qsj8AeEBaQ
— KolkataKnightRiders (@KKRiders) October 18, 2020 " class="align-text-top noRightClick twitterSection" data="
">One word to describe this man right now. GO! 👇#SRHvKKR #KKRHaiTaiyaar #Dream11IPL pic.twitter.com/Qsj8AeEBaQ
— KolkataKnightRiders (@KKRiders) October 18, 2020One word to describe this man right now. GO! 👇#SRHvKKR #KKRHaiTaiyaar #Dream11IPL pic.twitter.com/Qsj8AeEBaQ
— KolkataKnightRiders (@KKRiders) October 18, 2020
కోల్‌కతా నిర్దేశించిన 164 పరుగుల లక్ష్యాన్ని ఛేదించే క్రమంలో హైదరాబాద్ తొలుత 20 ఓవర్లలో 6 వికెట్లు కోల్పోయి 163 పరుగులే చేసింది. కెప్టెన్ డేవిడ్ వార్నర్(47 నాటౌట్; 33 బంతుల్లో 5x4), అబ్దుల్ సమద్(23; 15 బంతుల్లో 2x4, 1x6) రాణించినా ఫలితం లేకుండా పోయింది. అయితే, ఓపెనర్లు జానీ బెయిర్‌స్టో(36; 28 బంతుల్లో 7x4), కేన్ విలియమ్సన్(29; 19 బంతుల్లో 4x4, 1x6) మెరుపు ఓపెనింగ్ ఇచ్చారు. వీరిద్దరూ 6 ఓవర్లకు 57 పరుగులు చేశారు. దీంతో హైదరాబాద్ సునాయాసంగా విజయం సాధిస్తుందని అంతా భావించారు. కానీ, అక్కడి నుంచే వార్నర్ టీమ్ వికెట్లు కోల్పోవడం ప్రారంభమైంది. ఫెర్గూసన్ 3/15తో మెరవడం వల్ల తొలుత విలియమ్సన్ ఔటవ్వగా కాసేపటికే ప్రియమ్ గార్గ్(4), మనీష్ పాండే(6), విజయ్ శంకర్(7) ఇలా వచ్చి అలా వెళ్లిపోయారు. చివర్లో వార్నర్, సమద్ బాధ్యతాయుతంగా ఆడి జట్టును గెలిపించేలా కనిపించారు. కానీ ఇన్నింగ్స్ చివరి బంతికి రెండు పరుగులు అవసరమైన వేళ వార్నర్ ఒకే పరుగు తీయడంతో మ్యాచ్ టైగా ముగిసింది.
అంతకుముందు టాస్ ఓడి బ్యాటింగ్‌కు దిగిన కోల్‌కతా 20 ఓవర్లలో 5 వికెట్ల నష్టానికి 164 పరుగులు చేసింది. కెప్టెన్ ఇయాన్ మోర్గాన్(34; 23 బంతుల్లో 3x4 1x6), దినేశ్ కార్తీక్(29; 14 బంతుల్లో 2x4, 2x6) మెరుపు బ్యాటింగ్‌తో హైదరాబాద్ ముందు మోస్తారు లక్ష్యాన్ని నిర్దేశించింది.
తొలుత శుభ్‌మన్ గిల్(36; 37 బంతుల్లో 5x4), రాహుల్ త్రిపాఠి(23; 16 బంతుల్లో 2x4, 1x6) శుభారంభం చేయగా తొలి వికెట్‌కు 48 పరుగులు జోడించారు. ప్రమాదకరంగా మారుతున్న ఈ జోడీని నటరాజన్ ఆరో ఓవర్ చివరి బంతికి విడదీశాడు. త్రిపాఠిని బౌల్డ్ చేసి హైదరాబాద్‌కు తొలి బ్రేక్ ఇచ్చాడు. ఆపై నితీశ్ రాణా(29; 20 బంతుల్లో 3x4, 1x6)తో కలిసి శుభ్‌మన్‌గిల్ కోల్‌కతా ఇన్నింగ్స్‌ను చక్కదిద్దే ప్రయత్నం చేసినా కుదరలేదు. 87 పరుగుల వద్ద గిల్, 88 పరుగుల వద్ద రాణా వెనువెంటనే ఔటయ్యారు. ఆండ్రూ రసెల్(9) కూడా నిరాశపరిచాడు. దీంతో కోల్‌కతా 105 పరుగులకే నాలుగు వికెట్లు కోల్పోయింది. చివర్లో ధాటిగా ఆడిన మోర్గాన్, కార్తీక్ జట్టు స్కోరును 160 దాటించారు. కాగా, చివరి బంతికి మోర్గాన్ ఔటయ్యాడు. హైదరాబాద్ బౌలర్లలో నటరాజన్ రెండు వికెట్లు తీయగా.. రషీద్ ఖాన్, విజయ్ శంకర్, బాసిల్ థంపి తలా ఒక వికెట్ పడగొట్టారు.