క్వాలిఫైయర్-2 మ్యాచ్‌లో ఆసక్తికర సంఘటన జరిగింది. టాస్ గెలిచిన దిల్లీ క్యాపిటల్స్ కెప్టెన్ శ్రేయస్ అయ్యర్ తొలుత బ్యాటింగ్ ఎంచుకున్నాడు. టాస్ వేసిన తర్వాత జట్టులోని మార్పుల గురించి వ్యాఖ్యాత మార్క్ నికోలస్ అడగ్గా.. పృథ్వీ షా, డేనియల్ సామ్స్‌లకు బదులుగా షిమ్రాన్ హెట్మేయర్, ప్రవీణ్ దూబేలను జట్టులోకి తీసుకున్నారు. అయితే ప్లేయింగ్ ఎలెవన్‌లో జరిగిన మార్పుల్లో రెండో ఆటగాడి పేరును శ్రేయస్ మర్చిపోయాడు. ఇంతలో సన్‌రైజర్స్ కెప్టెన్ వార్నర్ ఆ మార్పును శ్రేయస్‌కు చెప్పాడు.
- — Simran (@CowCorner9) November 9, 2020 " class="align-text-top noRightClick twitterSection" data="
— Simran (@CowCorner9) November 9, 2020
">— Simran (@CowCorner9) November 9, 2020
అలా సహాయం చేశాడు
టాస్ వేయడానికి ముందు ఇరు కెప్టెన్లు జట్టు సమాచారాన్ని పంచుకోవడం వల్ల ఆ విషయం వార్నర్‌కు తెలిసింది. ఆ విషయాన్ని గుర్తు పెట్టుకున్న వార్నర్.. టాస్ సమయంలో శ్రేయస్‌కు సహాయం చేయగలిగాడు.
ఫైనల్లో దిల్లీ
ఆదివారం జరిగిన క్వాలిఫైయర్-2లో హైదరాబాద్ జట్టుపై దిల్లీ విజయం సాధించింది. ఈ గెలుపుతో శ్రేయస్ సేన ఫైనల్‌కు చేరింది. ఈ మ్యాచ్‌లో ఆల్‌రౌండర్ ప్రదర్శన చేసిన స్టోయినిస్‌కు మ్యాన్ ఆఫ్ ది మ్యాచ్‌గా నిలిచాడు.