అబుదాబి వేదికగా జరిగిన క్వాలిఫయర్-2 మ్యాచ్‌లో సన్‌రైజర్స్ హైదరాబాద్‌పై 17 పరుగుల తేడాతో దిల్లీ క్యాపిటల్స్ విజయం సాధించింది. ఈ మ్యాచ్‌లో దిల్లీ బ్యాట్స్‌మన్ మార్కస్ స్టోయినిస్, శిఖర్ ధావన్ అద్భుత ఇన్నింగ్స్ ఆడి జట్టు విజయంలో కీలకపాత్ర పోషించారు. హైదరాబాద్ బౌలర్ సందీప్ వేసిన 19వ ఓవర్లో ధావన్ ఎల్బీగా వెనుదిరిగాడు. అయితే తర్వాత అది నాటౌట్‌గా తేలింది. కానీ అప్పటికే గబ్బర్ బౌండరీ దాటాడు. ఈ విషయంపై మాజీ ఆల్‌రౌండర్ యువరాజ్.. ధావన్‌ను ట్రోల్ చేయగా.. బౌండరీ లైన్ దాటిన తర్వాత నాటౌట్ అని తెలుసుకున్నట్లు శిఖర్ తెలిపాడు.
హైదరాబాద్‌తో జరిగిన మ్యాచ్‌లో ధావన్ ఔట్ కాకపోయినా మైదానాన్ని వీడాడని ట్విట్టర్లో శిఖర్ను యువరాజ్ సింగ్ ఆటపట్టించాడు. దీనిపై స్పందించిన ధావన్.."హా..హా.. బ్యాట్‌కు బంతి తగిలిందనుకుని భ్రమపడ్డా. నేను బౌండరీ చేరుకున్నప్పుడు అది నాటౌట్ అని నాకు తెలిసింది" అని రిప్లై ఇచ్చాడు గబ్బర్.
-
Hahahah pajhi mainu lag gya plumb hai tah muuh chuk chal paya jadh boundary tey pahuncha tadh pata lag gya 🤣🤣🤣🤣🤣
— Shikhar Dhawan (@SDhawan25) November 9, 2020 " class="align-text-top noRightClick twitterSection" data="
">Hahahah pajhi mainu lag gya plumb hai tah muuh chuk chal paya jadh boundary tey pahuncha tadh pata lag gya 🤣🤣🤣🤣🤣
— Shikhar Dhawan (@SDhawan25) November 9, 2020Hahahah pajhi mainu lag gya plumb hai tah muuh chuk chal paya jadh boundary tey pahuncha tadh pata lag gya 🤣🤣🤣🤣🤣
— Shikhar Dhawan (@SDhawan25) November 9, 2020
ఆరెంజ్ క్యాప్ రేసులో
ఐపీఎల్ ప్రస్తుత సీజన్లో 4 హాఫ్ సెంచరీలు, 2 శతకాలు నమోదు చేసిన శిఖర్ ధావన్ మొత్తంగా 603 పరుగులు చేశాడు. ప్రస్తుతం ఆరెంజ్ క్యాప్ జాబితాలోని అగ్రస్థానంలో కింగ్స్ ఎలెవన్ కెప్టెన్ కేఎల్ రాహుల్ (670) తర్వాత రెండో స్థానంలో ధావన్ ఉన్నాడు. ఈ క్యాప్‌ను సాధించడానికి శిఖర్ మరో 67 పరుగులు చేయాల్సిఉంది.