ETV Bharat / sports

కోల్​కతా బౌలర్ల దెబ్బకు చిత్తుగా ఓడిన రాజస్థాన్​ - RR won the toss and elected to bat first

RR won the toss and elected to bat first

author img

By

Published : Nov 1, 2020, 7:09 PM IST

Updated : Nov 1, 2020, 11:34 PM IST

23:14 November 01

రాజస్థాన్​ నిష్క్రమణ

దుబాయ్​ వేదికగా రాజస్థాన్​ రాయల్స్​తో జరిగిన మ్యాచ్​లో 60 పరుగుల తేడాతో కోల్​కతా నైట్​రైడర్స్​ విజయం సాధించింది. కేకేఆర్​ బౌలర్​ పాట్​ కమ్మిన్స్​ 4 వికెట్లు పడగొట్టి ప్రత్యర్థిని దెబ్బతీశాడు. ఈ మ్యాచ్​లో మోర్గాన్​ సేన గెలవడం వల్ల ఆ జట్టుకు ప్లేఆఫ్​ ఆశలు సజీవంగా ఉన్నాయి. లీగు దశలోనే టోర్నీ నుంచి నిష్క్రమించిన మూడో టీమ్​గా రాజస్థాన్​ రాయల్స్​ నిలిచింది. 

22:39 November 01

తడబడుతోన్న రాజస్థాన్

లక్ష్య ఛేదనలో రాజస్థాన్ తడబడుతోంది. వరుసగా వికెట్లు కోల్పోతూ కష్టాల్లో పడింది. ప్రస్తుతం 14 ఓవర్లు పూర్తయ్యే సరికి 6 వికెట్ల నష్టానికి 101 పరుగులు చేసింది. తెవాతియా (28), శ్రేయస్ గోపాల్ (5) పోరాడుతున్నారు. ఇంకా గెలుపు కోసం 36 బంతుల్లో 91 పరుగులు చేయాల్సి ఉంది రాజస్థాన్.

22:07 November 01

రాజస్థాన్​కు వరుస షాక్​లు

లక్ష్యఛేదనలో దూకుడుగా బ్యాటింగ్​ ప్రారంభించిన రాజస్థాన్ జట్టు కోల్​కతా బౌలర్​ పాట్​ కమిన్స్​ దెబ్బకు వరుసగా వికెట్లు కోల్పోయింది. 7 ఓవర్లు పూర్తయ్యే సమయానికి ఐదు వికెట్లు నష్టపోయిన స్మిత్​సేన 45 పరుగులు చేసింది. ప్రస్తుతం క్రీజ్​లో రాహుల్​ తెవాతియా (4), జోస్​ బట్లర్​ (9) ఉన్నారు. 

21:30 November 01

దూకుడుగా రాజస్థాన్

192 పరుగుల భారీ లక్ష్యంతో బరిలో దిగిన రాజస్థాన్ దూకుడుగా ఇన్నింగ్స్ ప్రారంభించింది. మొదటి ఓవర్లోనే 19 పరుగులు రాబట్టింది. స్టోక్స్ (11) రెచ్చిపోయి ఆడుతున్నాడు. భారీ షాట్ ఆడబోయి ఉతప్ప (6) క్యాచ్ ఔట్​గా వెనుదిరిగాడు.

21:07 November 01

రాజస్థాన్ లక్ష్యం 192

రాజస్థాన్​తో జరుగుతోన్న మ్యాచ్​లో మొదట బ్యాటింగ్ చేసిన కోల్​కతా భారీ స్కోర్ సాధించింది. 7 వికెట్ల నష్టానికి 191 పరుగులు చేసింది. మొదటి ఓవర్లోనే నితీశ్ రానా వికెట్ కోల్పోయినా.. గిల్ (36), రాహుల్ త్రిపాఠి (39) రెెండో వికెట్​కు 72 పరుగులు జోడించారు. మోర్గాన్ (68) కెప్టెన్ ఇన్నింగ్స్​తో జట్టు భారీ స్కోర్ సాధించడంలో కీలకపాత్ర పోషించాడు. మిగిలిన వారిలో నరైన్ (0), కార్తీక్ (0), రసెల్ (25) నిరాశపర్చారు. 

21:01 November 01

దూకుడుగా కోల్​కతా

కోల్​కతా బ్యాట్స్​మెన్ దూకుడు కొనసాగిస్తున్నారు. ప్రస్తుతం 18 ఓవర్లు పూర్తయ్యే సరికి 6 వికెట్ల నష్టానికి 158 పరుగులు చేశారు. 

20:29 November 01

నెమ్మదించిన కోల్​కతా

రాజస్థాన్​తో జరుగుతోన్న మ్యాచ్​లో కోల్​కతా బ్యాటింగ్​లో నెమ్మదిగా బ్యాటింగ్ చేస్తోంది. గిల్ (36), త్రిపాఠి (39) కాసేపు స్కోర్ బోర్డును పరుగులు పెట్టించారు. వీరు ఔటైన తర్వాత నరైన్ (0), కార్తీక్ (0) వికెట్లు త్వరగా కోల్పోయింది జట్టు. సారథి మోర్గాన్ (20) మాత్రం జోరు చూపిస్తున్నాడు. ఫలితంగా ప్రస్తుతం 13 ఓవర్లు పూర్తయ్యే సరికి కేకేఆర్ ఐదు వికెట్ల నష్టానికి 100 పరుగులు చేసింది.  

20:01 November 01

తొలి ఓవర్​లో వికెట్ కోల్పోయినా దూకుడుగా మాత్రం తగ్గించలేదు కోల్​కతా. ప్రస్తుతం 7 ఓవర్లు పూర్తయ్యేసరికి వికెట్ నష్టానికి 64 పరుగులు చేసింది. గిల్ (34), త్రిపాఠి (27) ఆచితూచి ఆడుతున్నారు. 

19:36 November 01

తొలి ఓవర్​లోనే వికెట్ కోల్పోయిన కోల్​కతా

రాజస్థాన్​తో జరుగుతోన్న మ్యాచ్​లో మొదట బ్యాటింగ్ చేస్తోన్న కోల్​కతా తొలి ఓవర్​లోనే వికెట్ కోల్పోయింది. ఇన్నింగ్స్ రెండో బంతికే నితీశ్ రానా (0) ఆర్చర్ బౌలింగ్​లో డకౌట్​గా వెనుదిరిగాడు. ప్రస్తుతం రెండు ఓవర్లు పూర్తయ్యే సరికి కేకేఆర్ వికెట్ నష్టానికి 13 పరుగులు చేసింది. గిల్ (13), రాహుల్ త్రిపాఠి (0) క్రీజులో ఉన్నారు.

19:15 November 01

జట్లు

కోల్​కతా నైట్​రైడర్స్

శుభ్​మన్ గిల్, నితీశ్ రానా, సునీల్ నరైన్, మోర్గాన్ (కెప్టెన్), కార్తీక్, రసెల్, రాహుల్ త్రిపాఠి, కమిన్స్, కమలేశ్ నాగర్​కోటి, శివం మావి, వరుణ్ చక్రవర్తి

రాజస్థాన్ రాయల్స్

రాబిన్ ఉతప్ప, స్టోక్స్, సంజూ శాంసన్, స్టీవ్ స్మిత్ (కెప్టెన్), బట్లర్, రియాన్ పరాగ్, రాహుల్ తెవాతియా, జోఫ్రా ఆర్చర్, శ్రేయస్ గోపాల్, వరుణ్ అరోన్, కార్తీక్ త్యాగి

18:48 November 01

టాస్ గెలిచి బౌలింగ్ ఎంచుకున్న రాజస్థాన్

ఐపీఎల్​ రోజురోజుకూ రసవత్తరంగా మారుతోంది. ప్లేఆఫ్స్​లో స్థానం కోసం జట్లు హోరాహోరీగా తలపడుతున్నాయి. ఈ క్రమంలోనే నేడు రాజస్థాన్ రాయల్స్​-కోల్​కతా నైట్​రైడర్స్ మధ్య మ్యాచ్​ జరగనుంది. ఇందులో గెలిచిన జట్టు 14 పాయింట్లతో ముందడుగు వేస్తుంది. ఇందులో గెలిచిన టీమ్​ టాప్-4లో ఉండాలంటే.. పంజాబ్ తన తర్వాతి మ్యాచ్​లో ఓడిపోవాలి. సన్​రైజర్స్​ కూడా రెండు మ్యాచ్​ల్లో ఏదో ఒకదానిలో ఓటమిపాలవ్వాలి. ఈ క్రమంలో ఈ మ్యాచ్​లో మొదట టాస్ గెలిచిన రాజస్థాన్ బౌలింగ్ ఎంచుకుంది.

Last Updated : Nov 1, 2020, 11:34 PM IST

For All Latest Updates

TAGGED:

match live
ETV Bharat Logo

Copyright © 2025 Ushodaya Enterprises Pvt. Ltd., All Rights Reserved.