ETV Bharat / sports

రాజస్థాన్​పై హైదరాబాద్ ఘనవిజయం

RR vs SRH MATCH live updates
రాజస్థాన్ vs హైదరాబాద్ మ్యాచ్
author img

By

Published : Oct 22, 2020, 6:52 PM IST

Updated : Oct 22, 2020, 10:54 PM IST

22:52 October 22

రాజస్థాన్ రాయల్స్​పై హైదరాబాద్​ జట్టు.. 8 వికెట్ల తేడాతో విజయం సాధించింది. మనీశ్ పాండే అద్భుత విజయం సాధించింది. దీంతో పాయింట్ల పట్టికలో ఐదో స్థానానికి చేరుకుంది.

22:35 October 22

15 ఓవర్లు పూర్తయ్యేసరికి 2 వికెట్ల నష్టానికి 38 పరుగులు చేసింది హైదరాబాద్. క్రీజులో ఉన్న మనీశ్ పాండే అర్థ శతకంతో రాణించగా, మరో ఎండ్​లో ఉన్న విజయ్ శంకర్.. అతడికి సహకరమందిస్తున్నాడు. విజయానికి 30 బంతుల్లో 37 పరుగులు కావాలి.

22:10 October 22

రాజస్థాన్ నిర్దేశించిన లక్ష్యం వైపు హైదరాబాద్​ జట్టు వడివడిగా సాగుతోంది. ప్రస్తుతం 9 ఓవర్లు పూర్తయ్యేసరికి రెండు వికెట్ల నష్టానికి 76 పరుగులు చేసింది. క్రీజులో ఉన్న మనీశ్ పాండే, విజయ్ శంకర్.. స్కోరు బోర్డును నెమ్మదిగా పరుగులు పెట్టిస్తున్నారు.

21:49 October 22

155 పరుగుల లక్ష్య ఛేదనలో హైదరాబాద్​ బ్యాటింగ్ ప్రారంభించింది. కానీ వెంట వెంటనే ఓపెనర్ల వికెట్లు కోల్పోయింది. ప్రస్తుతం ఐదు ఓవర్లు పూర్తయ్యేసరికి రెండు వికెట్ల నష్టానికి 40 పరుగులు చేసింది. క్రీజులో మనీశ్ పాండే, విజయ్ శంకర్ ఉన్నారు. విజయానికి 90 బంతుల్లో 115 పరుగులు చేయాలి.

21:03 October 22

తడబడుతూ బ్యాటింగ్ చేసిన రాజస్థాన్ రాయల్స్.. నిర్ణీత 20 ఓవర్లలో 6 వికెట్ల నష్టానికి 154 పరుగులు చేసింది. సంజూ శాంసన్(36 పరుగులు) టాప్ స్కోరర్. మిగిలిన బ్యాట్స్​మెన్ అంతా తక్కువ పరుగులే చేసి వెనుదిరిగారు. హైదరాబాద్​ బౌలర్లలో హోల్డర్ 3, రషీద్ ఖాన్, విజయ్ శంకర్ తలో వికెట్ తీశారు.

20:36 October 22

రాజస్థాన్ వెంటవెంటనే రెండు వికెట్లు కోల్పోయింది. స్టోక్స్(30), శాంసన్(36).. వరుస ఓవర్లలో ఔటయ్యారు. ప్రస్తుతం 14 ఓవర్లు పూర్తయ్యేసరికి మూడు వికెట్లు కోల్పోయి 99 పరుగులు చేసింది. క్రీజులో స్మిత్, బట్లర్ ఉన్నారు.

20:08 October 22

రాజస్థాన్​ ధాటిగా బ్యాటింగ్​ చేస్తోంది. 9 ఓవర్లు పూర్తయ్యేసరికి ఒక వికెట్​ నష్టానికి 68 పరుగులు సాధించింది. శాంసన్​(28), స్టోక్స్​(20) క్రీజులో ఉన్నారు.

19:56 October 22

రాజస్థాన్​ తొలి పవర్​ప్లేలో మెరుగ్గానే పరుగులు రాబట్టింది. 6 ఓవర్లు ముగిసేసరికి జట్టు స్కోరు ఒక వికెట్​ నష్టానికి 47 పరుగులు. శాంసన్​(12), స్టోక్స్​(15) క్రీజులో ఉన్నారు.

19:52 October 22

జోరుమీదున్న ఊతప్పను సన్​రైజర్స్​ ఆల్​రౌండర్​ హోల్టర్ రనౌట్​ చేశాడు.​ ఫలితంగా 19 పరుగుల వ్యక్తిగత స్కోరు వద్ద ఔటయ్యాడు.

19:39 October 22

బ్యాటింగ్​ను నెమ్మదిగా ప్రారంభించింది రాజస్థాన్ రాయల్స్. 3 ఓవర్లు పూర్తయ్యేసరికి వికెట్లేమి నష్టపోకుండా 22 పరుగులు చేసింది. క్రీజులో స్టోక్స్, ఉతప్ప ఉన్నారు.

19:01 October 22

టాస్ గెలిచిన హైదరాబాద్ కెప్టెన్ వార్నర్.. బౌలింగ్ ఎంచుకున్నాడు. దీంతో బ్యాటింగ్​ మొదలుపెట్టనుంది రాజస్థాన్ జట్టు.

18:45 October 22

ఫ్లేఆఫ్ అవకాశాల కోసం పోటాపోటీ

దుబాయ్ వేదికగా రాజస్థాన్ రాయల్స్, సన్​రైజర్స్ హైదరాబాద్​ మధ్య మ్యాచ్​ జరగనుంది. ఫ్లేఆఫ్ అవకాశాలు సజీవం చేసుకోవాలంటే ఇరుజట్లకు ఈ మ్యాచ్​ ఎంతో కీలకం. మరి ఏమవుతుందో చూడాలి? భారత కాలమానం ప్రకారం రాత్రి ఏడున్నరకు ప్రారంభం కానుంది.

Last Updated : Oct 22, 2020, 10:54 PM IST
ETV Bharat Logo

Copyright © 2024 Ushodaya Enterprises Pvt. Ltd., All Rights Reserved.