ETV Bharat / sports

రాజస్థాన్​ వరుస విజయాలకు కోల్​కతా బ్రేక్​ - ఐపీఎల్ 2020 మ్యాచ్ 12

దుబాయ్​ వేదికగా బుధవారం జరిగిన ఐపీఎల్​ మ్యాచ్​లో రాజస్థాన్​ రాయల్స్​పై 37 పరుగుల తేడాతో కోల్​కతా నైట్​రైడర్స్ విజయం సాధించింది. ఈ గెలుపుతో రెండో విజయాన్ని తమ ఖాతాలో వేసుకుంది కేకేఆర్​.

RR vs KKR Match: Kolkata beat Rajasthan by 37 runs
ఐపీఎల్​: రాజస్థాన్​ వరుస విజయాలకు కోల్​కతా బ్రేక్​
author img

By

Published : Sep 30, 2020, 11:51 PM IST

​ఐపీఎల్​లో రాజస్థాన్​ రాయల్స్​ వరుస విజయాలకు బ్రేక్​ పడింది. బుధవారం దుబాయ్​ వేదికగా జరిగిన మ్యాచ్​లో.. రాజస్థాన్​ రాయల్స్​పై 37 పరుగుల తేడాతో కోల్​కతా నైట్ ​రైడర్స్​ విజయం సాధించింది. కేకేఆర్​ బౌలర్ల ధాటికి 20 ఓవర్లలో 9 వికెట్లు కోల్పోయి 137 పరుగులే చేసింది స్మిత్​సేన. రాజస్థాన్​ బ్యాట్స్​మెన్​లో టామ్​ కరన్​ (54), జోస్​ బట్లర్​ (21) తప్ప మిగిలిన వారందరూ పేలవ ప్రదర్శనతో వెనుదిరిగారు. కోల్​కతా బౌలర్లు​ శివమ్​ మావి (2), కమ్​లేష్​ నాగర్​కోటి (2), వరుణ్​ చక్రవర్తి (2) జట్టుకు విజయాన్ని అందించడంలో కీలకపాత్ర పోషించారు.

టాస్​ ఓడి బ్యాటింగ్​కు దిగిన కోల్​కతా నైట్​రైడర్స్​ నిర్ణీత 20 ఓవర్లలో ఆరు వికెట్లు కోల్పోయి 174 పరుగులు చేసింది. ఓపెనర్‌ శుభ్‌మన్‌ గిల్‌ (47, 34 బంతుల్లో; 5×4, 1×6), మోర్గాన్‌ (34*, 23 బంతుల్లో; 1×4,2×6) రాణించడం వల్ల రాజస్థాన్‌కు కోల్‌కతా 175 పరుగుల లక్ష్యాన్ని నిర్దేశించింది. ఓపెనర్‌ సునీల్ నరైన్‌ (15, 14 బంతుల్లో; 2×4,1×6) మరోసారి నిరాశ పరిచాడు. ఉతప్ప ఇచ్చిన జీవన దానాన్ని అతడు సద్వినియోగం చేసుకోలేకపోయాడు. ఉనద్కత్ బౌలింగ్‌లో క్లీన్ బౌల్డ్ అయ్యాడు. మరోవైపు గిల్ మాత్రం మరోసారి చక్కని ప్రదర్శన కనబరిచాడు. నరైన్‌ ఔటైన తర్వాత నితీశ్‌ రాణా (22, 17 బంతుల్లో; 2×4, 1×6)తో కలిసి ఇన్నింగ్స్‌ను చక్కదిద్దాడు. అతడితో కలిసి రెండో వికెట్‌కు 46 పరుగులు చేశాడు.

అయితే తెవాతియా వేసిన 10వ ఓవర్‌లో రాణా పెవిలియన్‌కు చేరాడు. కొద్దిసేపటికే గిల్‌ కూడా ఆర్చర్‌కు రిటర్న్‌క్యాచ్‌ ఇచ్చి వెనుదిరిగాడు. అనంతరం బ్యాటింగ్‌కు వచ్చిన దినేశ్ కార్తీక్‌ (1), రసెల్ (24, 14 బంతుల్లో; 3×6), కమిన్స్‌ (12, 10 బంతుల్లో; 1×4) ఎక్కువ సేపు క్రీజులో నిలవలేకపోయారు. ఆఖర్లో మోర్గాన్‌ బ్యాట్‌ ఝుళిపించడం వల్ల కోల్‌కతా 174 పరుగులకు చేరింది. టామ్‌ కరన్‌ వేసిన 20వ ఓవర్‌లో 16 పరుగులు వచ్చాయి. రాజస్థాన్‌ బౌలర్లలో జోఫ్రా ఆర్చర్‌ రెండు వికెట్లు తీయగా, అంకిత్ రాజ్‌పుత్, ఉనద్కత్, టామ్‌ కరన్‌, తెవాతియా తలో వికెట్ తీశారు.

రసెల్‌ను తెలివిగా..

లెగ్ స్టంప్‌ వైపు వేసిన బంతుల్ని సులువుగా సిక్సర్లు బాదుతున్న రసెల్‌ను రాజస్థాన్‌ బౌలర్లు తెలివిగా బోల్తా కొట్టించారు. అతడికి తెలివిగా ఔట్‌సైడ్‌ ఆఫ్‌ స్టంప్‌ వైపు బంతుల్ని ఎక్కువగా వేశారు. అంకిత్‌ రాజ్‌పుత్‌ అలాగే వేసిన బంతిని థర్డ్‌మ్యాన్ దిశగా భారీ షాట్‌కు యత్నించి రసెల్.. ఉనద్కత్‌ చేతికి చిక్కాడు.

ETV Bharat Logo

Copyright © 2024 Ushodaya Enterprises Pvt. Ltd., All Rights Reserved.