ETV Bharat / sports

ఐపీఎల్​లో రోహిత్ శర్మ అరుదైన ఘనత - విరాట్ సరసన రోహిత్

ముంబయి ఇండియన్స్ సారథి రోహిత్ శర్మ ఐపీఎల్​లో అరుదైన ఘనత సాధించాడు. పంజాబ్​తో జరుగుతోన్న మ్యాచ్​తో లీగ్​లో 5 వేల పరుగుల మార్కు అందుకున్న మూడో క్రికెటర్​గా అవతరించాడు.

Rohit sharma completed another milestone in IPL
ఐపీఎల్​లో రోహిత్ శర్మ అరుదైన ఘనత
author img

By

Published : Oct 1, 2020, 7:38 PM IST

ముంబయి ఇండియన్స్‌ కెప్టెన్‌ రోహిత్ శర్మ అరుదైన రికార్డు సాధించాడు. ఐపీఎల్‌ చరిత్రలో 5 వేల పరుగుల మార్కు అందుకున్న మూడో క్రికెటర్​గా నిలిచాడు. విరాట్‌ ​కోహ్లీ, సురేశ్‌ రైనాలు ఇతడికంటే ముందున్నారు.

ఈ మ్యాచ్​కు ముందు ఐపీఎల్​లో 4,998 పరుగులతో ఉన్న రోహిత్‌.. పంజాబ్​తో జరుగుతోన్న మ్యాచ్​లో తాను ఎదుర్కొన్న తొలి బంతికే ఫోర్ బాది 5 వేల పరుగుల మార్కును చేరుకున్నాడు. విరాట్‌ కోహ్లీ 180 మ్యాచ్​ల్లో 5,430 పరుగులతో అగ్రస్థానంలో ఉండగా, రైనా 193 మ్యాచ్​ల్లో 5,368 పరుగులతో రెండో స్థానంలో నిలిచాడు. రోహిత్​కు ఈ మ్యాచ్​ 191వది. ఈ లీగ్​లో హిట్​మ్యాన్ ఒక సెంచరీతో పాటు 37 అర్ధ శతకాలు సాధించాడు.

ETV Bharat Logo

Copyright © 2025 Ushodaya Enterprises Pvt. Ltd., All Rights Reserved.