ETV Bharat / sports

ఆ ఇద్దరు కెప్టెన్ల కాంబినేషన్​ రోహిత్​ శర్మ!

author img

By

Published : Nov 13, 2020, 10:23 AM IST

టీమ్​ఇండియా మాజీ కెప్టెన్లు ధోనీ, గంగూలీ కలిపితే రోహిత్​ శర్మ అని మాజీ క్రికెటర్​ ఇర్ఫాన్​ పఠాన్ చెప్పాడు​. అందుకే ఐపీఎల్​లో విజయవంతమైన సారథిగా కొనసాగుతున్నాడని అన్నాడు.

Rohit Sharma
రోహిత్​ శర్మ

టీమ్​ఇండియా స్టార్ ఓపెనర్​ రోహిత్​ శర్మను ప్రశంసించాడు మాజీ క్రికెటర్​ ఇర్ఫాన్​ పఠాన్​. మాజీ కెప్టెన్లు ధోనీ, గంగూలీ కాంబినేషన్ హిట్​మ్యాన్​ అని అన్నాడు. వారిద్దరు వ్యూహాత్మకంగా ఎలా ఆడతారో రోహిత్ కూడా అలానే ఆడతాడని చెప్పాడు. అతడికి​ ప్రత్యేక శైలి ఉందని తెలిపాడు. ఐపీఎల్​ ఫైనల్​లో ఆఫ్​ బ్రేక్​ బౌలర్​ జయంత్​ యాదవ్​ను తీసుకోవడం మంచి నిర్ణయమని అభిప్రాయపడ్డాడు.

"ఐపీఎల్​ ఫైనల్​లో జయంత్ యాదవ్​ను ఉపయోగించుకున్న విధానమే రోహిత్​ ప్రతిభకు నిదర్శనం. అతడు ఎలా ఆలోచిస్తాడనేది ఇక్కడ స్పష్టమవుతోంది. బౌలర్​ బుమ్రాను 17, 18వ ఓవర్లు వేయించి.. పొలార్డ్​ను సరైన సందర్భం చూసి బరిలో దింపుతాడు. బౌలర్ల కెప్టెన్ హిట్​మ్యాన్​ అని చెప్పడానికి ఇదే చక్కని ఉదాహరణ. ధోనీ, గంగూలీ కలిస్తే రోహిత్. వీరిద్దరూ బౌలర్లపై నమ్మకం ఉంచుతారు. వారికంటూ ప్రత్యేక శైలి ఏర్పరచుకున్నారు. రోహిత్​ కూడా అలాంటివాడే"

-ఇర్ఫాన్​​ పఠాన్​, భారత మాజీ క్రికెటర్​

ఐపీఎల్​లో రోహిత్​ విజయవంతమైన సారథిగా కొనసాగడానికి గల కారణాన్ని వెల్లడించాడు ఇర్ఫాన్​. ఆటగాళ్లను పరిస్థితుల ఆధారంగా ఎలా ఉపయోగించాలనే విషయమై అతడు బాగా ఆరితేరాడని అన్నాడు.

ఇదీ చూడండి :

ETV Bharat Logo

Copyright © 2024 Ushodaya Enterprises Pvt. Ltd., All Rights Reserved.