ETV Bharat / sports

'అసలైన ప్రయాణం ఇప్పుడే మొదలైంది.. కప్​ మాదే'

నవంబరు 5న క్వాలిఫయర్​-1లో భాగంగా ముంబయి ఇండియన్స్​తో అమీతుమీ తేల్చుకునేందుకు సిద్ధమైంది దిల్లీ క్యాపిటల్స్​. ఈ సందర్భంగా తమ జట్టులో స్పూర్తి నింపేందుకు ఓ వీడియోను పోస్ట్​ చేసింది దిల్లీ ఫ్రాంచైజీ. లీగ్​ ప్రారంభం ముందు నుంచి ఇప్పటివరకు ప్రయాణం ఎలా సాగిందో వివరిస్తూ ఇందులో చూపించారు. ఈ ఏడాది ఐపీఎల్​ టైటిల్​ను గెలుస్తామని ధీమా వ్యక్తం చేశారు ఆటగాళ్లు.

Delhi Capitals
దిల్లీ క్యాపిటల్స్
author img

By

Published : Nov 3, 2020, 4:20 PM IST

దిల్లీ క్యాపిటల్స్​ లీగ్​ తొలి అర్ధభాగంలో అదరగొట్టినా.. రెండో అర్ధ భాగంలో డీలా పడింది. వరుసగా నాలుగు పరాజయాలను చవి చూసింది. అయినా ఎట్టకేలకు మళ్లీ పుంజుకుని బెంగళూరుపై విజయం సాధించి ఫామ్​లోకి వచ్చింది. పాయింట్ల పట్టికలో రెండో స్థానంలో నిలిచి ప్లేఆఫ్స్​కు అర్హత సాధించింది.

నవంబరు 5న క్వాలిఫయర్​-1లో భాగంగా ముంబయి ఇండియన్స్​తో తలపడేందుకు సిద్ధమైంది. ఈ సందర్భంగా దిల్లీ ఫ్రాంచైజీ తమ ఆటగాళ్లలో స్ఫూర్తి నింపేందుకు ఓ వీడియోను సామాజిక మాధ్యమాల్లో పోస్ట్​ చేసింది. 'అసలైన ప్రయాణం ఇప్పుడే మొదలైంది' అంటూ వ్యాఖ్య రాసుకొచ్చింది. ఇందులో కోచ్​ రికీ పాంటింగ్​, పృథ్వీ షా, బౌలర్​ రబాడా సహా పలువురు క్రికెటర్లు మాట్లాడుతూ కనిపించారు. ఐపీఎల్​ 2020 ట్రోఫీని సొంతం చేసుకుంటామని ధీమా వ్యక్తం చేశారు. లీగ్​ ప్రారంభం ముందు నుంచి ఇప్పటివరకు తమ జట్టు ఆటగాళ్లు ఏ విధంగా కష్టపడ్డారు, ఎలా శ్రమించారు, ప్రతిరోజు ఎలా గడిపారు ఇలా తమ ఐపీఎల్​ ప్రయాణాన్ని వీడియో ఆసాంతం చూపించారు.

ఇదీ చూడండి 'ఓ ఘట్టం ముగిసింది.. ప్రతి ఒక్కరికీ ధన్యవాదాలు'

ETV Bharat Logo

Copyright © 2024 Ushodaya Enterprises Pvt. Ltd., All Rights Reserved.