ETV Bharat / sports

బెంగళూరుపై హైదరాబాద్ అదిరిపోయే గెలుపు

RCB VS SRH MATCH Live Score Updates
హైదరాబాద్ బెంగళూరు మ్యాచ్
author img

By

Published : Oct 31, 2020, 7:03 PM IST

Updated : Oct 31, 2020, 11:26 PM IST

22:42 October 31

కచ్చితంగా గెలవాల్సిన మ్యాచ్​లో హైదరాబాద్​ అద్భుతం చేసింది. బెంగళూరును 5 వికెట్ల తేడాతో చిత్తుగా ఓడించి, ప్లేఆఫ్స్​ ఆశల్ని సజీవం చేసుకుంది. షార్జా వేదికగా జరిగిన ఈ మ్యాచ్​లో తొలుత బ్యాటింగ్ చేసిన ఆర్సీబీ.. నిర్ణీత ఓవర్లలో 7 వికెట్లు కోల్పోయి 120 పరుగులు చేసింది. అనంతరం ఛేదనలో సన్​రైజర్స్ ధాటిగా ఆడింది. 14.1 ఓవర్లలోనే లక్ష్యాన్ని పూర్తి చేసింది.

22:25 October 31

నెమ్మదిగా లక్ష్యం వైపు సాగుతున్న హైదరాబాద్.. 11 ఓవర్లు పూర్తయ్యేసరికి మూడు వికెట్ల నష్టానికి 82 పరుగులు చేసింది. క్రీజులో విలియమ్సన్, అభిషేక్ సమద్ ఉన్నారు.

21:38 October 31

121 పరుగుల ఛేదనను ధాటిగా ఆరంభించింది హైదరాబాద్ జట్టు. నాలుగు ఓవర్లు పూర్తయ్యేసరికి వార్నర్(8) వికెట్​ కోల్పోయి, 31 పరుగులు చేసింది. క్రీజులో సాహా, మనీశ్ పాండే ఉన్నారు. విజయానికి 96 బంతుల్లో 90 పరుగులు కావాలి.

21:02 October 31

బెంగళూరు బ్యాట్స్​మెన్ తడబడ్డారు. హైదరాబాద్​ బౌలర్ల ధాటికి నిర్ణీత 20 ఓవర్లలో 7 వికెట్ల నష్టానికి 120 పరుగులు మాత్రమే చేయగలిగారు. ఫిలిప్పీ(32) టాప్ స్కోరర్. సన్​రైజర్స్ బౌలర్లలో సందీప్ శర్మ, హోల్డర్ తలో రెండు వికెట్లు.. నటరాజన్, నదీమ్, రషీద్ ఖాన్ ఒక్కో వికెట్ పడగొట్టారు.

20:19 October 31

జోరు మీద కనిపించిన డివిలియర్స్.. మూడో వికెట్​గా వెనుదిరిగాడు. ప్రస్తుతం 11 ఓవర్లు పూర్తయ్యేసరికి 3 వికెట్ల నష్టానికి 71 పరుగులు చేసింది బెంగళూరు. క్రీజులో ఫిలిప్పీ, సుందర్ ఉన్నారు.

20:10 October 31

బెంగళూరు ఇన్నింగ్స్​ను డివిలియర్స్​(8), ఫిలిప్పీ(29) గాడిన పెడుతున్నారు. 9 ఓవర్లకు బెంగళూరు స్కోరు 2 వికెట్ల నష్టానికి 52.

20:06 October 31

బెంగళూరు ఇన్నింగ్స్​ నెమ్మదిగా సాగుతోంది. డివిలియర్స్​(6), ఫిలిప్పీ(21) జాగ్రత్తగా ఆడుతున్నారు. 8 ఓవర్లకు బెంగళూరు స్కోరు 2 వికెట్ల నష్టానికి 42.

19:35 October 31

రాయల్ ఛాలెంజర్స్ బెంగళూరు బ్యాటింగ్ ప్రారంభించింది. 2 ఓవర్లు పూర్తయ్యేసరికి వికెట్లేమి నష్టపోకుండా 8 పరుగులు చేసింది. ఓపెనర్లు దేవ్​దత్ పడిక్కల్, ఫిలిప్పీ ఆచితూచి ఆడుతున్నారు.

18:59 October 31

షార్జా వేదికగా జరుగుతున్న మ్యాచ్​లో హైదరాబాద్​ జట్టు, టాస్ గెలిచి బౌలింగ్ ఎంచుకుంది. బెంగళూరు బ్యాటింగ్ ప్రారంభించనుంది. ఈ మ్యాచ్​లో కచ్చితంగా గెలిస్తేనే సన్​రైజర్స్​కు ప్లేఆఫ్స్​ అవకాశాలు ఉంటాయి.

జట్లు

బెంగళూరు: జోష్ ఫిలిప్పీ, దేవ్​దత్ పడిక్కల్, కోహ్లీ(కెప్టెన్), డివిలియర్స్, గుర్​కీరత్ సింగ్, వాషింగ్టన్ సుందర్, మోరిస్, ఉదానా, సిరాజ్, సైనీ, చాహల్

హైదరాబాద్: వార్నర్(కెప్టెన్), సాహా, మనీశ్ పాండే, విలియమ్సన్, అబ్దుల్ సమద్, హోల్డర్, అభిషేక్ శర్మ, రషీద్ ఖాన్, నదీమ్, సందీప్ శర్మ, నటరాజన్

Last Updated : Oct 31, 2020, 11:26 PM IST
ETV Bharat Logo

Copyright © 2024 Ushodaya Enterprises Pvt. Ltd., All Rights Reserved.