ఎట్టకేలకు చెన్నై విజయం సాధించింది. దుబాయ్ వేదికగా జరిగిన పోరులో బెంగళూరు జట్టుపై ఎనిమిది వికెట్లు తేడాతో గెలుపొందింది. 146 పరుగుల లక్ష్యంతో బరిలో దిగిన సీఎస్కే.. 18.4ఓవర్లలోనే రెండు వికెట్లు కోల్పోయి లక్ష్యాన్ని ఛేదించింది. విజయంలో బ్యాట్స్‌మన్ గైక్వాడ్(69), సామ్ కరణ్ మూడు వికెట్లు పడగొట్టి కీలక పాత్ర పోషించారు. ఆర్సీబీ బౌలర్లలో క్రిస్ మోరిస్, చాహల్ తలో వికెట్ తీశారు.
బెంగళూరుపై చెన్నై జట్టు విజయం - IPL CSK VS RCB
18:38 October 25
18:26 October 25
15 ఓవర్లు పూర్తయ్యేసరికి చెన్నై రెండు వికెట్ల నష్టానికి 127 పరుగులు చేసింది. క్రీజులో ధోనీ(11), రుతురాజ్(51) ఆచితూచి ఆడుతోన్నారు. 30 బంతుల్లో 19 పరుగులు అవసరం.
18:20 October 25
చెన్నై జట్టు రెండో వికెట్ కోల్పోయింది. రాయుడు(39) ఔటయ్యాడు. దీంతో క్రీజులోకి ధోనీ వచ్చాడు. రుతురాజ్ గైక్వాడ్(49) జాగ్రత్తగా ఆడుతోన్నాడు. దీంతో 13.4 ఓవర్లకు రెండు వికెట్లు కోల్పోయి 114 పరుగులు చేసింది సీఎస్కే.
18:13 October 25
13 ఓవర్లు పూర్తయ్యేసరికి 111 పరుగులు చేసింది సీఎస్కే. క్రీజులో రాయుడు(38), రుతురాజ్ గైక్వాడ్(48) ఉన్నారు. 42 బంతుల్లో 35 పరుగులు అవసరం.
17:50 October 25
ఛేదనలో ఆచితూచి ఆడుతున్న చెన్నై బ్యాట్స్‌మెన్.. 8 ఓవర్లు పూర్తయ్యేసరికి వికెట్ నష్టానికి 59 పరుగులు చేశారు. క్రీజులో రుతురాజ్, రాయుడు ఉన్నారు. అంతకుముందు 25 పరుగులు చేసిన డుప్లెసిస్.. మోరిస్ బౌలింగ్‌లో ఔటయ్యాడు.
17:28 October 25
146 పరుగుల లక్ష్య ఛేదనను ధాటిగా ఆరంభించింది చెన్నై. ఓపెనర్లు రుతురాజ్, డుప్లెసిస్ దూకుడుగా ఆడుతున్నారు. దీంతో మూడు ఓవర్లు పూర్తయ్యేసరికి వికెట్లేమి నష్టపోకుండా 25 పరుగులు చేసింది. విజయానికి 102 బంతుల్లో 121 పరుగులు చేయాలి.
17:00 October 25
దుబాయ్ వేదికగా చెన్నై జరుగుతున్న మ్యాచ్‌లో బెంగళూరు చక్కగా ఆడింది. నిర్ణీత 20 ఓవర్లలో 6 వికెట్లు కోల్పోయి 145 పరుగులు చేసింది. కెప్టెన్ కోహ్లీ(50) అర్థశతకంతో మెరిశాడు. మిగిలిన బ్యాట్స్‌మెన్‌లో డివిలియర్స్(39) కొంతమేర ఆకట్టుకున్నాడు. చెన్నై బౌలర్లలో సామ్ కరన్ 3, దీపక్ చాహర్ 2, శాంట్నర్ ఓ వికెట్ పడగొట్టారు.
16:32 October 25
నిలకడగానే ఆర్సీబీ బ్యాటింగ్
బెంగళూరు నిలకడబా బ్యాటింగ్ కొనసాగిస్తోంది. ప్రస్తుతం 15 ఓవర్లు పూర్తయ్యే సరికి 101 పరుగులు చేసింది. సారథి కోహ్లీ (30), డివిలియర్స్ (29) ఆచితూచి ఆడుతున్నారు.
16:11 October 25
నిలకడగా బెంగళూరు బ్యాటింగ్
ఓపెనర్ల వికెట్లను కోల్పోయింది బెంగళూరు. ఫించ్ (15), పడిక్కల్ (22) పెవిలియన్ చేరారు. ప్రస్తుతం 9 ఓవర్లకు రెండు వికెట్ల నష్టానికి 63 పరుగులు చేసింది ఆర్సీబీ. కోహ్లీ (11), డివిలియర్స్ (10) క్రీజులో ఉన్నారు.
15:40 October 25
దూకుడుగా బెంగళూరు
చెన్నైతో జరుగుతోన్న మ్యాచ్‌లో మొదట బ్యాటింగ్ చేస్తోన్న బెంగళూరు దూకుడుగా ఇన్నింగ్స్ ప్రారంభించింది. ప్రస్తుతం రెండు ఓవర్లకు 18 పరుగులు చేసింది. దేవదత్ పడిక్కల్ (2), ఫించ్ (12) క్రీజులో ఉన్నారు.
14:49 October 25
చెన్నై పరువు దక్కించుకుంటుందా?
దుబాయ్ వేదికగా జరుగుతున్న మ్యాచ్‌లో టాస్ గెలిచి బ్యాటింగ్ ఎంచుకుంది రాయల్ ఛాలెంజర్స్ బెంగళూరు. ఇప్పటికే 14 పాయింట్లతో మెరుగ్గా ఉన్న ఈ జట్టు.. ఇందులోనూ గెలిచి ఫ్లేఆఫ్స్‌లో చోటు ఖరారు చేసుకోవాలని భావిస్తోంది. మరి చెన్నై వీరిని అడ్డుకుంటుందా? లేదా దాసోహం అవుతుందా అనేది చూడాలి.
జట్లు
చెన్నై: రుతురాజ్, డుప్లెసిస్, రాయుడు, జగదీశన్, ధోనీ(కెప్టెన్), జడేజా, శాంట్నర్, సామ్ కరన్, దీపక్ చాహర్, తాహిర్, మోను కుమార్
బెంగళూరు: దేవ్‌దత్, ఫించ్, కోహ్లీ(కెప్టెన్), డివిలియర్స్, మొయిన్ అలీ, గుర్కీరత్ సింగ్, మోరిస్, సుందర్, సైనీ, సిరాజ్, చాహల్