కోహ్లీ, పడిక్కల్ మెరుపులు, బెంగళూరు విజయం
రాజస్థాన్ రాయల్స్‌తో జరిగిన ఐపీఎల్ మ్యాచ్‌లో రాయల్ ఛాలెంజర్స్ బెంగళూరు విజయం సాధించింది. 8 వికెట్ల తేడాతో ఘనవిజయం నమోదు చేసింది. ఓపెనర్ ఫించ్ 8 పరుగులకే ఔటైనా.. మరో ఓపెనర్ దేవదత్ పడిక్కల్‌తో కలిసి సారథి కోహ్లీ రెండో వికెట్‌కు 99 పరుగుల భాగస్వామ్యం నమోదు చేశాడు. దీంతో ఏ సమయంలోనూ లక్ష్యానికి దూరంగా వెళ్లలేదు బెంగళూరు. పడిక్కల్ 63 పరుగుల చేసి ఔటైనా.. కోహ్లీ, డివిలియర్స్ లాంఛనాన్ని పూర్తి చేశారు. విరాట్ 72 పరుగులతో నాటౌట్‌గా నిలిచాడు.