ETV Bharat / sports

టాప్ 4లోకి పంజాబ్- కేకేఆర్​పై ఘన​ విజయం

షార్జా వేదికగా జరిగిన మ్యాచ్​లో కోల్​కతా నైట్​ రైడర్స్​పై కింగ్స్​ ఎలెవన్​ పంజాబ్​ ఎనిమిది వికెట్లు తేడాతో విజయం సాధించింది. 150 పరుగులు లక్ష్యంతో బరిలో దిగిన పంజాబ్​.. ఏడు బంతులు మిగిలి ఉండగానే లక్ష్యాన్ని ఛేదించింది. విజయంలో మన్​దీప్​ సింగ్​(66), గేల్​(51) కీలక పాత్ర పోషించారు. ఈ విజయంతో ప్లే ఆఫ్స్​ రేసులో మరో అడుగు ముందుకు వేసింది. కోల్​కతా బౌలర్లలో వరుణ్​ చక్రవర్తి ఒక్క వికెట్​ తీశాడు.

punjab beats kolkata
కోల్​కతాపై పంజాబ్​ విజయం
author img

By

Published : Oct 26, 2020, 11:10 PM IST

Updated : Oct 27, 2020, 5:58 AM IST

ఐపీఎల్​ రెండో అర్ధభాగంలో కింగ్స్​ ఎలెవన్​ పంజాబ్ దుమ్మురేపుతోంది. ​వరుసగా ఐదో విజయాన్ని ఖాతాలో వేసుకుంది. షార్జా వేదికగా జరిగిన పోరులో కోల్​కతా నైట్​ రైడర్స్​పై ఎనిమిది వికెట్లు తేడాతో విజయం సాధించింది. 150 పరుగులు లక్ష్యంతో బరిలో దిగిన పంజాబ్​.. ఏడు బంతులు మిగిలి ఉండగానే లక్ష్యాన్ని ఛేదించింది. విజయంలో మన్​దీప్​ సింగ్​(66), గేల్​(51) కీలక పాత్ర పోషించారు. ఈ విజయంతో ప్లే ఆఫ్స్​కు మార్గం సుగమం చేసుకుంది. కోల్​కతా బౌలర్లలో వరుణ్​ చక్రవర్తి ఒక్క వికెట్​ తీశాడు.

అంతకముందు టాస్​ ఓడి బ్యాటింగ్​ చేసిన కోల్‌కతా మోస్తారు స్కోరు మాత్రమే చేసింది. రవి బిష్ణోయ్‌ (2/20), మహ్మద్‌ షమి (3/35), మురుగన్‌ అశ్విన్‌ (1/27), క్రిస్‌ జోర్డాన్‌ (2/25) సమష్టిగా చెలరేగి మోర్గాన్‌ సేనను దెబ్బకొట్టారు. దాంతో నిర్ణీత 20 ఓవర్లలో కోల్‌కతా 149/9కే పరిమితమైంది. అయితే ఆ జట్టు ఓపెనర్‌ శుభ్‌మన్‌ గిల్‌ (57; 45 బంతుల్లో 3×4, 4×6) అర్ధశతకంతో అలరించాడు. ఇయాన్‌ మోర్గాన్‌ (40; 25 బంతుల్లో 5×4, 2×6) మెరుపు ఇన్నింగ్స్‌ ఆడాడు. లాకీ ఫెర్గూసన్‌ (24*; 13 బంతుల్లో 3×4, 1×6) ఆఖర్లో షాట్లు ఆడాడు. మిగితా వారు విఫలమయ్యారు.

Last Updated : Oct 27, 2020, 5:58 AM IST
ETV Bharat Logo

Copyright © 2024 Ushodaya Enterprises Pvt. Ltd., All Rights Reserved.