ETV Bharat / sports

'బౌలర్లపై నమ్మకం ఉంచడం చాలా ముఖ్యం'

author img

By

Published : Oct 19, 2020, 6:15 AM IST

ముంబయితో హోరాహోరీగా జరిగిన మ్యాచ్​లో ఎట్టకేలకు గెలిచింది పంజాబ్. ఈ సందర్భంగా మాట్లాడిన పంజాబ్ కెప్టెన్ కేఎల్ రాహుల్.. ఇప్పటివరకూ ఓడిపోయిన మ్యాచ్​ల్లోనూ టీం ఉత్తమ ప్రదర్శన కనబర్చిందని వ్యాఖ్యానించాడు.

KL RAHUL_KXI
'బౌలర్లపై నమ్మకం ఉంచడం చాలా ముఖ్యం'

డబుల్​ సూపర్​ ఓవర్లు ఆడి మ్యాచ్​ గెలిచిన అనంతరం మాట్లాడిన పంజాబ్​ కెప్టెన్​ కేఎల్​ రాహుల్.. ఇలా జరగడం చాలా అరుదు అని వ్యాఖ్యానించాడు. కొన్ని సార్లు ఇలాంటి క్లిష్ట పరిస్థితులను ఎదుర్కోవడం కష్టంగా ఉంటుందని పేర్కొన్నాడు.

" ఇప్పటివరకూ ఓడిపోయిన మ్యాచ్​ల్లోనూ ఉత్తమ ప్రదర్శన కనబర్చాం. ప్రతి మ్యాచ్​ ఈ విధంగా గెలవడానికి మొదటినుంచి ప్రయత్నిస్తున్నాం. 20 ఓవర్లు కీపింగ్​ చేసిన తర్వాత బ్యాటింగ్​ బరిలోకి దిగి ఆడే మొదటి ఆరు ఓవర్లు చాలా కీలకం. సూపర్​ ఓవర్​ ఆడాలని ఏ జట్టూ భావించదు. బౌలర్లపై నమ్మకం ఉంచడం చాలా ముఖ్యం".

-కేఎల్​ రాహుల్, కింగ్స్ ఎలెవన్ పంజాబ్ జట్టు కెప్టెన్

'ప్రతి గెలుపు ఆనందాన్నిస్తుంది'

జట్టులో సీనియర్​ ఆటగాళ్లు కీలక పాత్ర పోషించారని కేఎల్​ రాహుల్​ అన్నాడు. మొదటి ఏడు మ్యాచ్​ల్లో ఎక్కువగా ఓటమి పాలయ్యామని, ఇప్పుడు గెలిచే ప్రతి మ్యాచ్​ ఆనందాన్నిస్తుందని వ్యాఖ్యానించారు. గెలుపు కోసమే కాకుండా ఆనందిస్తూ ఆడటమే ముఖ్యమని పేర్కొన్నాడు.

ఆదివారం అబుదాభి వేడుకగా జరిగిన ముంబయి వర్సెస్ కింగ్స్ ఎలెవన్ పంజాబ్​ మ్యాచ్​లో ఇరు జట్లూ హోరాహోరీగా ఆడాయి. రెండు సూపర్​ ఓవర్లకు దారితీసిన ఈ మ్యాచ్​లో ఎట్టకేలకు గెలుపు సొంతం చేసుకుంది పంజాబ్.

ఇదీ చదవండి:పంజాబ్​ 'డబుల్​ సూపర్'​.. ముంబయి డీలా

ETV Bharat Logo

Copyright © 2024 Ushodaya Enterprises Pvt. Ltd., All Rights Reserved.