చెన్నై సూపర్ కింగ్స్ కెప్టెన్ మహేంద్ర సింగ్ ధోనీ మరో రికార్డుకు చేరువయ్యాడు. ఐపీఎల్ చరిత్రలో అత్యధిక మ్యాచులు ఆడిన క్రికెటర్‌గా నిలవనున్నాడు. ఇందులో భాగంగా శుక్రవారం రాత్రి, సన్‌రైజర్స్ హైదరాబాద్‌తో చెన్నై జట్టు తలపడనుంది. దీనితోనే మహీ ఈ ఘనత అందుకోనున్నాడు.
ఇప్పటికే 193 మ్యాచులాడిన ధోనీ సురేశ్ రైనాతో సమంగా ఉన్నాడు. అయితే ఈ సీజన్‌కు రైనా దూరం కావడం వల్ల.. ధోనీ ఈ రికార్డును అధిగమించనున్నాడు. మొత్తంగా ఈ లీగ్ పూర్తయ్యేసరికి 200కు పైగా మ్యాచులు ఆడిన తొలి క్రికెటర్‌గా నిలుస్తాడు.
ధోనీ, రైనా ఇద్దరు ఓకేసారి 2008లో సీఎస్కేలో అరంగేట్రం చేశారు. 2008లో అత్యధిక రికార్డు ధరకు మహీని తీసుకుంది చెన్నై ఫ్రాంచైజీ. అతడి సారథ్యంలో 163 మ్యాచులో ఆడగా.. 100 మ్యాచులు గెలిచింది. మూడు సార్లు ట్రోఫీని అందించాడు. ఎనిమిది సార్లు ఫైనల్స్‌కు చేర్చడంలో కెప్టెన్‌గా కీలకపాత్ర పోషించాడు. ఇప్పటివరకు మహీ ఆడిన 193 మ్యాచుల్లో 42.22 స్ట్రైక్ రేట్‌తో 4476 పరుగులు చేశాడు. ఇందులో 212 సిక్స్‌లు, 23 అర్థ శతకాలు ఉన్నాయి.
ఇదీ చూడండి పంజాబ్‌తో మ్యాచ్‌లో రోహిత్ శర్మ రికార్డుల సునామీ!