మంగళవారం జరిగిన మ్యాచ్‌లో చెన్నైపై రాజస్థాన్ గెలవడంలో కీలకపాత్ర పోషించాడు సంజూ శాంసన్. 32 బంతుల్లో 72 పరుగులు చేసి 'మ్యాన్ ఆఫ్ ది మ్యాచ్'గా నిలిచాడు. అయితే ఇది తన కంటే బౌలర్ రాహుల్ తెవాటియాకు ఇచ్చుంటే బాగుండేది.
"రాత్రి మంచు పడుతూ ఉంటుంది. అప్పుడు బౌలింగ్ చేయడం కష్టం. అలాంటి సమయంలోనూ రాహుల్ మూడు కీలక వికెట్లు తీశాడు. మ్యాన్ ఆఫ్ ది మ్యాచ్ అతడికిస్తేనే బాగుండేది. నా వరకైతే గేమ్‌ను మార్చింది రాహుల్ తెవాటియానే" -సంజూ శాంసన్, రాజస్థాన్ బ్యాట్స్‌మన్
ఈ మ్యాచ్‌లో 16 పరుగుల తేడాతో రాజస్థాన్.. ప్రస్తుత సీజన్లో తొలి విజయం నమోదు చేసింది. సంజుకు తోడుగా కెప్టెన్ స్మిత్ 69 పరుగులతో రాణించాడు. సీఎస్కేలో డుప్లెసిస్(72) మినహా మిగతా అందరూ నామమాత్రంగానే ఆడారు. సెప్టెంబరు 25న దిల్లీతో చెన్నై తర్వాతి మ్యాచ్ ఆడనుండగా, సెప్టెంబరు 27న పంజాబ్‌తో తలపడనుంది రాజస్థాన్.