ETV Bharat / sports

'సూర్య' ప్రతాపం.. ప్లేఆఫ్స్​కు చేరిన ముంబయి - ముంబయి ఇండియన్స్​ vs ఆర్సీబీ లైవ్​ అప్​డేట్స్

అబుదాబి వేదికగా రాయల్​ ఛాలెంజర్స్​ బెంగళూరుతో జరిగిన మ్యాచ్​లో ముంబయి ఇండియన్స్​ విజయకేతనం ఎగురవేసింది. ఈ గెలుపుతో ప్రస్తుత ఐపీఎల్​లో ప్లేఆఫ్స్​కు చేరిన తొలి జట్టుగా రోహిత్​ సేన నిలిచింది.

MI vs RCB: Mumbai Indians beat Royal Challengers Bangalore by 5 wickets
'సూర్య' ప్రతాపం.. ప్లేఆఫ్స్​కు చేరిన ముంబయి
author img

By

Published : Oct 28, 2020, 11:29 PM IST

ఆల్‌రౌండ్​ ప్రదర్శనతో ముంబయి అదరగొట్టింది. అబుదాబి వేదికగా జరిగిన మ్యాచ్‌లో బెంగళూరును అయిదు వికెట్ల తేడాతో చిత్తుచేసింది. ఈ విజయంతో 13వ సీజన్‌లో ప్లేఆఫ్‌కు చేరిన తొలి జట్టుగా నిలిచింది. మొదట టాస్‌ ఓడి బ్యాటింగ్‌కు దిగిన బెంగళూరు నిర్ణీత 20 ఓవర్లలో ఆరు వికెట్లు కోల్పోయి 164 పరుగులు చేసింది. ఓపెనర్‌ దేవదత్‌ పడిక్కల్‌ (74) అర్ధశతకం సాధించాడు. ఆ జట్టును బుమ్రా (3/14) దెబ్బతీశాడు. అనంతరం బరిలోకి దిగిన ముంబయి 19.1 ఓవర్లలో అయిదు వికెట్లు కోల్పోయి లక్ష్యాన్ని ఛేదించింది. సూర్యకుమార్‌ (79*) అజేయ అర్ధశతకంతో విజృంభించాడు.

ఛేదనకు దిగిన ముంబయికి గొప్ప ఆరంభమేమి లభించలేదు. డికాక్‌ (18)ను సిరాజ్‌ ఔట్‌ చేయడం వల్ల 37 పరుగులకు తొలివికెట్‌ కోల్పోయింది. కొద్దిసేపటికే ఇషాన్‌ కిషన్‌ (25), సౌరభ్‌ తివారి (5) వెనుదిరిగారు. ఈ దశలో బ్యాటింగ్‌కు వచ్చిన కృనాల్ పాండ్య (10)తో కలిసి సూర్యకుమార్ ఇన్నింగ్స్ చక్కదిద్దడానికి ప్రయత్నించాడు. అయితే కృనాల్‌ను చాహల్‌ ఔట్‌ చేసి ముంబయిని దెబ్బతీశాడు. వికెట్లు పడుతున్నా మరోవైపు సూర్యకుమార్‌ తన పోరాటం కొనసాగించాడు. రన్‌రేటు నియంత్రణలోనే ఉంచుతూ స్కోరుబోర్డు ముందుకు నడిపించాడు. ఈ క్రమంలో 29 బంతుల్లో అర్ధశతకం అందుకున్నాడు. అనంతరం మరింత చెలరేగి జట్టుకు విజయాన్ని అందించాడు. హార్దిక్‌ (17) 19వ ఓవర్‌లో వెనుదిరిగాడు. బెంగళూరు బౌలర్లలో చాహల్‌, సిరాజ్‌ చెరో రెండు వికెట్లు, మోరిస్‌ ఒక వికెట్‌ తీశాడు. స్టెయిన్‌ (4-0-43-0) విఫలమయ్యాడు.

రాణించిన పడిక్కల్..

అంతకుముందు టాస్ ఓడి బ్యాటింగ్‌కు దిగిన బెంగళూరుకు శుభారంభం దక్కింది. కుర్రాళ్లు పడిక్కల్‌, ఫిలిప్‌ (33) ఆది నుంచే బౌండరీల మోత మోగించారు. పవర్‌ప్లేలో వికెట్‌ నష్టపోకుండా 54 పరుగులు చేశారు. అయితే రాహుల్ చాహర్‌ వేసిన 8వ ఓవర్‌లో ఫిలిప్‌ స్టంపౌటవ్వడం వల్ల 71 పరుగుల వద్ద బెంగళూరు తొలి వికెట్‌ కోల్పోయింది. తర్వాత క్రీజులోకి వచ్చిన కోహ్లీ (9; 14 బంతుల్లో) నిరాశపరిచాడు. మరోవైపు పడిక్కల్‌ బౌండరీలు సాధిస్తూ స్కోరుబోర్డు ముందుకు నడిపించాడు. ఈ క్రమంలో 30 బంతుల్లో అర్ధశతకం సాధించాడు. తొలుత నిదానంగా ఆడిన డివిలియర్స్‌ (15) గేర్‌ మార్చడం వల్ల 15 ఓవర్లకు బెంగళూరు 129/2 పటిష్ఠ స్థితితో నిలిచింది. అయితే అనంతరం ముంబయి బౌలర్లు క్రమం తప్పకుండా వికెట్ల తీస్తూ స్కోరుకు కళ్లెం వేశారు. 17వ ఓవర్‌ వేసిన బుమ్రా.. పడిక్కల్‌, దూబె (4)ను పెవిలియన్‌కు చేర్చి పరుగులేమి ఇవ్వలేదు. ఆఖర్లో సుందర్‌ (10*), గుర్‌కీరత్ (14*) బ్యాట్‌ ఝుళిపించారు. ముంబయి బౌలర్లలో బుమ్రా మూడు, బౌల్ట్‌, రాహుల్ చాహర్‌, పొలార్డ్‌ తలో వికెట్ తీశారు.

ETV Bharat Logo

Copyright © 2024 Ushodaya Enterprises Pvt. Ltd., All Rights Reserved.