ETV Bharat / sports

ముంబయిపై గెలిచి చెన్నై పరువు నిలుపుకొంటుందా? - చెన్నై vs ముంబయి మ్యాచ్ ప్రిడిక్షన్

షార్జా వేదికగా ముంబయి, చెన్నై జట్ల మధ్య శుక్రవారం మ్యాచ్​ జరగనుంది. భారతకాలమానం ప్రకారం రాత్రి ఏడున్నరకు ప్రారంభం కానుంది.

CSK face fierce rivals Mumbai Indians
చెన్నై ముంబయి మ్యాచ్
author img

By

Published : Oct 23, 2020, 5:30 AM IST

ఈ సీజన్​లో ఘోరంగా ఆడుతున్న చెన్నై సూపర్​కింగ్స్.. శుక్రవారం జరిగే మ్యాచ్​లో ముంబయి ఇండియన్స్​తో తలపడనుంది. ఇప్పటికే ఫ్లేఆఫ్స్​ నుంచి దాదాపుగా తప్పుకున్న సీఎస్కే.. ఈరోజు గెలిచి పరువు నిలుపుకోవాలని భావిస్తోంది. మరి ఏమవుతుందో చూడాలి.

CSK face fierce rivals Mumbai Indians
చెన్నై సూపర్​కింగ్స్

గత మ్యాచ్​తో పాటు అంతకు ముందు మ్యాచ్​ల్లోనూ నిలకడలేని ప్రదర్శనలు చేస్తూ ఓటములు చవిచూసింది చెన్నై. బ్యాటింగ్, బౌలింగ్​.. రెండు విభాగాల్లోనూ కనీసం ఒక్కరంటే ఒక్కరు కూడా దూకుడుగా ఆడలేకపోతున్నారు. దీంతో 10 మ్యాచ్​ల్లో మూడింట్లోనే గెలిచింది. మిగిలిన మ్యాచ్​ల్లో చెన్నై గెలవాలంటే అద్భుతమే జరగాలి!

మరోవైపు ముంబయి జట్టు.. ఆరు మ్యాచ్​ల్లో విజయం సాధించి, ఫ్లే ఆఫ్స్​లోకి వెళ్లేందుకు దిల్లీ, బెంగళూరుతో పోటీ పడుతోంది. జట్టులో అందరూ ఫామ్​లో ఉండటం వీరికి కలిసొచ్చే అంశం. కాకపోతే ఇదే సీజన్​లో చెన్నైతో జరిగిన ప్రారంభ మ్యాచ్​లో ఓడిపోయింది రోహిత్ సేన. ఇప్పుడు ఏం జరుగుతుందో చూడాలి.

CSK face fierce rivals Mumbai Indians
ముంబయి చెన్నై మ్యాచ్​లోని దృశ్యం

జట్లు(అంచనా)

చెన్నై సూపర్​కింగ్స్: డుప్లెసిస్, వాట్సన్, రాయుడు, ధోనీ(కెప్టెన్), జడేజా, జాదవ్, దీపక్ చాహర్, శార్దుల్ ఠాకుర్, చావ్లా, హేజిల్​వుడ్

ముంబయి ఇండియన్స్: రోహిత్ శర్మ (కెప్టెన్), డికాక్, సూర్యకుమార్ యాదవ్, ఇషాన్ కిషన్, హార్దిక్, పొలార్డ్, కృనాల్, కౌల్టర్ ​నైల్, చాహర్, బౌల్ట్, బుమ్రా

ETV Bharat Logo

Copyright © 2024 Ushodaya Enterprises Pvt. Ltd., All Rights Reserved.