ETV Bharat / sports

రాజస్థాన్ ​X పంజాబ్: ప్లేఆఫ్స్​ రేసులో నిలిచేదెవరు? - IPL LATEST NEWS

రాజస్థాన్​ రాయల్స్​తో కింగ్స్ ఎలెవన్ పంజాబ్ శుక్రవారం తలపడనుంది. అబుదాబి వేదికగా భారత కాలమానం ప్రకారం రాత్రి 7.30 గంటలకు​ ప్రారంభం కానుంది.

KXIP vs RR Preview
రాజస్థాన్ vs పంజాబ్
author img

By

Published : Oct 30, 2020, 5:30 AM IST

Updated : Oct 30, 2020, 11:45 AM IST

వరుస విజయాలతో దూసుకెళ్తున్న పంజాబ్​ జట్టు.. పట్టికలో అట్టడుగున, ప్లే ఆఫ్స్​లో చోటు కోసం పోరాడుతోన్న రాజస్థాన్​ రాయల్స్​తో తలపడనుంది. ఐపీఎల్​ రెండో భాగంలో వరుసగా ఐదు మ్యాచ్​లు గెలిచి, ప్లే ఆఫ్స్​ దిశగా అడుగులు వేస్తున్న పంజాబ్..​ శుక్రవారం జరిగే ఈ మ్యాచ్​లో ఏం చేస్తుందో అనేది ఆసక్తికరం. స్టోక్స్, శాంసన్​ మెరుపు ఇన్నింగ్స్​తో గాడిలోపడ్డ రాజస్థాన్​ ముందుకెళ్తుందా? లేదా ఇంటిబాట పడుతుందా? అనేది కీలకంగా మారింది.

KXIP vs RR
రాజస్థాన్ vs పంజాబ్ మ్యాచ్​

పంజాబ్​ విజయభేరి కొనసాగేనా?

కేఎల్ రాహుల్ ఆధ్వర్యంలో పంజాబ్​ జట్టు విజయపరంపర కొనసాగిస్తోంది. వరుసగా ఐదు మ్యాచ్​లు గెలిచి.. 12 పాయింట్లతో నాలుగో స్థానంలో ఉంది. గేల్​ రాకతో మరింత దృఢంగా కనిపిస్తున్న పంజాబ్..​ ప్లే ఆఫ్స్​లో చోటు కోసం తీవ్రంగా ప్రయత్నిస్తోంది. మయాంక్​ అగర్వాల్ గాయాల కారణంగా చివరి రెండు మ్యాచ్​లు అందుబాటులో లేడు. అతడి స్థానాన్ని భర్తీ చేసిన మన్​దీప్​ సింగ్​ ఓపెనర్​గా బాగానే ఆడాడు. ​బౌలింగ్​లో కాస్త బలహీనంగా ఉన్న పంజాబ్ ప్రస్తుతం మంచిగానే ఆడుతోంది. చివరి ఐదు మ్యాచ్​ల్లో ప్రత్యర్థి జట్టును తక్కువ పరుగులకే కట్టడి చేయగలగడమే ఇందుకు ఉదాహరణ.

KL RAHUL
పంజాబ్ కెప్టెన్ కేఎల్ రాహుల్

'రాయల్​'గా ఆడలేకపోతోంది!

పాయింట్ల పట్టికలో ఏడో స్థానంలో ఉన్న రాజస్థాన్​కు అద్భుతం జరిగితే తప్ప ప్లే ఆఫ్స్​కు వెళ్లే అవకాశం కనిపించట్లేదు. 12 మ్యాచ్​ల్లో కేవలం 5 మాత్రమే గెలిచిన రాజస్థాన్​కు ఇందులో​ గెలిచినా ప్లే ఆఫ్స్ అవకాశాలు క్లిష్టంగానే ఉన్నాయి. ఒకవేళ పంజాబ్​ చేతిలో ఓడితే రాజస్థాన్​ ఇంటి బాట పట్టిన రెండో జట్టు అవుతుంది.

గత మ్యాచ్​లో డిఫెండింగ్​ ఛాంపియన్స్​ ముంబయిని చిత్తు చేసిన రాజస్థాన్..​ ఆత్మస్థైర్యంతో కనిపిస్తోంది. అదే జోరు ఈ మ్యాచ్​లోనూ చూపిస్తే పంజాబ్​ ఆశలు పటాపంచలైనట్లే. బౌలింగ్​లో జోఫ్రా అర్చర్​ ప్రత్యర్థి బ్యాట్స్​మెన్​కు చెమటలు పట్టిస్తున్నాడు. పంజాబ్​తో పోల్చితే.. రాజస్థాన్ బౌలింగ్​​ కాస్త బలంగానే ఉంది.

ben stokes
రాజస్థాన్ ఆల్​రౌండర్ బెన్ స్టోక్స్

జట్ల (అంచనా)

పంజాబ్​: కేఎల్ రాహుల్(సారథి), మన్​దీప్​ సింగ్, క్రిస్ గేల్, నికోలస్ పూరన్, గ్లెన్ మాక్స్​వెల్,​ దీపక్ హోడా, జేమ్స్ నీషమ్, మురుగన్ అశ్విన్, మహ్మద్ షమి, రవి బిష్ణోయ్, అర్ష్​దీప్​ సింగ్

రాజస్థాన్: రాబిన్ ఉతప్ప, బెన్ స్టోక్స్, సంజూ శాంసన్, బట్లర్, స్మిత్ (సారథి), రియాన్ పరాగ్, రాహుల్ తెవాతియా, జోఫ్రా ఆర్చర్, శ్రేయస్ గోపాల్, అంకిత్ రాజ్‌పూత్, కార్తీక్ త్యాగి

Last Updated : Oct 30, 2020, 11:45 AM IST
ETV Bharat Logo

Copyright © 2024 Ushodaya Enterprises Pvt. Ltd., All Rights Reserved.