ETV Bharat / sports

చిత్తుగా ఓడిన పంజాబ్​-టేబుల్​ టాపర్​గా ముంబయి - IPL 2020 match today

కింగ్స్​ ఎలెవన్​ పంజాబ్​పై 48 పరుగులు తేడాతో ముంబయి ఇండియన్స్ విజయం సాధించింది. ముంబయి బౌలర్ల ఆధిపత్యంతో 20 ఓవర్లలో 8 వికెట్లు కోల్పోయి 143 పరుగులకే పరిమితమైంది రాహుల్​సేన. పాయింట్ల పట్టికలో ముంబయి అగ్రస్థానంలోకి చేరుకుంది.

KXIP vs MI: Mumbai Indians clinch victory by 48 runs
ఐపీఎల్​ 2020
author img

By

Published : Oct 1, 2020, 11:47 PM IST

అబుదాబి వేదికగా పంజాబ్‌తో జరిగిన ఐపీఎల్​ మ్యాచ్​లో కింగ్స్​ ఎలెవన్​ పంజాబ్​పై 48 తేడాతో ముంబయి ఇండియన్స్​ విజయం సాధించింది. నిర్ణీత 20 ఓవర్లలో 8 వికెట్లు కోల్పోయి 143 పరుగులే చేయగలిగింది పంజాబ్​. రాహుల్​ చాహర్​, జస్​ప్రీత్​ బుమ్రా, జేమ్స్ ప్యాటిన్సన్​ తలో రెండు వికెట్లు తీసి గెలుపులో కీలక పాత్ర పోషించారు.

ఫలితంగా.. పాయింట్ల పట్టికలో అగ్రస్థానానికి చేరింది ముంబయి ఇండియన్స్​. 4 మ్యాచ్​ల్లో 2 విజయాలతో 4 పాయింట్లు సాధించింది రోహిత్​ సేన. పంజాబ్​ ఆరో స్థానంలో ఉంది.

ఆరంభం అదిరినా..

భారీ ఛేదనలో బరిలోకి దిగిన పంజాబ్​.. ఆరంభంలో దూకుడుగా ఆడింది. ఓపెనర్లు మయాంక్​ అగర్వాల్​(25), రాహుల్​(17) తొలి వికెట్​కు 38 పరుగులు జోడించారు. తర్వాత వచ్చిన కరుణ్​ నాయర్​ డకౌటయ్యాడు. అక్కడినుంచి పంజాబ్​ స్కోరు బోర్డు నెమ్మదించింది. మిడిలార్డర్​లో నికోలస్​ పూరన్​(44) కాసేపు మెరుపులు మెరిపించినా జట్టును గెలిపించలేకపోయాడు.

మిగతా బ్యాట్స్​మెన్​ చెప్పుకోదగ్గ ప్రదర్శన చేయలేకపోయారు.

రోహిత్​, పొలార్డ్​, పాండ్య విజృంభణ..

తొలుత టాస్‌ ఓడి బ్యాటింగ్‌కు దిగిన ముంబయి నిర్ణీత ఓవర్లలో 4 వికెట్ల నష్టానికి 191 పరుగుల భారీ స్కోర్‌ చేసింది. కెప్టెన్‌ రోహిత్‌ శర్మ (70; 45 బంతుల్లో 8x4, 3x6) అర్ధశతకంతో మెరవగా.. చివర్లో కీరన్‌ పొలార్డ్ ‌(47; 20 బంతుల్లో 3x4, 2x6), హార్దిక్‌ పాండ్య (30; 11 బంతుల్లో 3x4, 2x6) మెరుపు ఇన్నింగ్స్‌ ఆడారు. దీంతో పంజాబ్‌ ముందు భారీ లక్ష్యం ఉంచింది. ఆది నుంచీ కట్టుదిట్టంగా బంతులేసిన పంజాబ్‌ బౌలర్లు చివర్లో చేతులెత్తేశారు. దీంతో పాండ్య, పొలార్డ్‌ బౌండరీల వర్షం కురిపించారు. చివరి 6 ఓవర్లలో 104 పరుగులు రాబట్టుకుంది రోహిత్​ సేన.

ETV Bharat Logo

Copyright © 2025 Ushodaya Enterprises Pvt. Ltd., All Rights Reserved.