రాయల్ ఛాలెంజర్స్ బెంగళూరు సారథి విరాట్ కోహ్లీ అనుకోకుండా బంతిపై ఉమ్ము రాయబోయాడు. సోమవారం దిల్లీ క్యాపిటల్స్‌తో జరిగిన మ్యాచ్‌లో ఈ ఘటన చోటు చేసుకుంది. నవదీప్ సైని వేసిన ఇన్నింగ్స్ మూడో ఓవర్లో షార్ట్ కవర్‌లో ఫీల్డింగ్ చేస్తున్న కోహ్లి.. పృథ్వీ షా ఆడిన డ్రైవ్‌ను మెరుపు వేగంతో అడ్డుకున్నాడు. బంతిని పట్టుకున్న కోహ్లి ఎప్పట్లాగే వేలికి ఉమ్మురాసుకుని బంతిపై రుద్దేందుకు సిద్ధమయ్యాడు. దాదాపుగా బంతిపై వేళ్లను పెట్టిన అతడు తప్పును గుర్తించి.. అంపైర్‌ను చూస్తూ రెండు చేతులు పైకెత్తి క్షమాపణలు చెప్పాడు.
గత వారం కోల్‌కతా నైట్‌రైడర్స్‌తో మ్యాచ్‌లో రాజస్థాన్ రాయల్స్ ఆటగాడు రాబిన్ ఉతప్ప కూడా ఇదే మాదిరి బంతిపై ఉమ్ము రాశాడు. కరోనా మహమ్మారి నేపథ్యంలో బంతిపై ఉమ్ము రాయడాన్ని జూన్‌లో ఐసీసీ నిషేధించింది.
ఇదీ చూడండి ఎనిమిదేళ్ల తర్వాత ఫ్రెంచ్ ఓపెన్ క్వార్టర్స్‌కు..