గురువారం రాయల్ ఛాలెంజర్స్ బెంగళూరుతో జరిగిన మ్యాచ్‌లో కింగ్స్ ఎలెవన్ పంజాబ్ ఘనవిజయం సాధించింది. అయితే జట్టులో భాగస్వామి అయిన యూనివర్సల్ బాస్ క్రిస్ గేల్‌ను మొదటి రెండు మ్యాచ్‌లలో ఆడించలేదు. కాగా ఆ విధ్వంసకారుడి ఆట చూసేందుకు అభిమానులు ఎంతో ఆసక్తిగా ఎదురుచూస్తున్నారు. మైదానంలో గేల్ ఎంట్రీ ఎప్పుడంటూ ప్రశ్నిస్తున్నారు. తాజాగా ఈ విషయంపై స్పందించాడు పంజాబ్ సారథి రాహుల్.
"క్రిస్ గేల్ ఎంట్రీపై ఎలాంటి చింత వద్దు. అతడు సరైన సమయంలో క్రీజులో అడుగుపెడతాడు. గేల్ ఆటను చూసేందుకు మేము కూడా ఆసక్తిగానే ఎదురుచూస్తున్నాం. త్వరలోనే అతడు బరిలో దిగుతాడు."
-రాహుల్, పంజాబ్ సారథి
ప్రస్తుతం పంజాబ్ జట్టు పాయింట్ల పట్టికలో అగ్రస్థానంలో ఉంది. తన తర్వాతి మ్యాచ్‌లో 27న రాజస్థాన్ రాయల్స్‌తో తలపడనుంది.