ఐపీఎల్లో తొలిసారి ఆడాలనుకున్న యూఎస్ పేసర్ అలీ ఖాన్.. గాయం కారణంగా టోర్నీ నుంచి తప్పుకున్నాడు. కోల్‌కతా నైట్‌రైడర్స్ తరఫున హ్యారీ గుర్నీ స్థానంలో ఇతడు జట్టులోకి వచ్చాడు. గాయాల వల్లే ఇప్పటికే భువేశ్వర్(హైదరాబాద్), మిశ్రా(దిల్లీ), మార్ష్(హైదరాబాద్) వైదొలిగారు.
"కోల్‌కతా నైట్‌రైడర్స్ ఆటగాడు హ్యారీ గుర్నీ స్థానంలో అలీ ఖాన్‌ను నియమించాం. టోర్నీలో స్థానం దక్కించుకున్న తొలి అమెరికన్ క్రికెటర్‌గా గుర్తింపు పొందాడు. దురదృష్టవశాత్తు, ఇతడు గాయంతో లీగ్‌కు దూరమవ్వాల్సి వచ్చింది"
ఐపీఎల్ నిర్వహకులు
ఇప్పటివరకు ఆడిన నాలుగు మ్యాచ్‌ల్లో కోల్‌కతా రెండు విజయాలు సొంతం చేసుకుని.. పాయింట్ల పట్టికలో నాలుగో స్థానంలో కొనసాగుతోంది. చెన్నై సూపర్ కింగ్స్‌తో బుధవారం తలపడేందుకు సిద్ధమవుతోంది.