ETV Bharat / sports

అదరగొట్టిన రాహుల్​.. ఆర్సీబీపై పంజాబ్​ విజయం - ఆర్సీబీ పంజబ్​ స్క్వాడ్​

రాయల్​ ఛాలెంజర్స్​ బెంగళూరుపై ​కింగ్స్​ ఎలెవన్​ పంజాబ్​ 97 పరుగుల తేడాతో విజయం సాధించింది. 207పరుగుల లక్ష్యంతో బరిలో దిగిన ఆర్సీబీ 109కే ఆలౌట్​ అయ్యింది. బౌలర్లలో రవి బిష్ణోయ్​(3), మురుగన్ అశ్విన్​(3) రాణించారు. పంజాబ్​ జట్టు విజయంలో సారథి కేఎల్​ రాహుల్​(132) కీలక పాత్ర పోషించాడు. శతకంతో మెరిసి.. ఇన్నింగ్స్​ను వన్​ మ్యాన్​ షోగా నడిపించాడు.

kings xi punjab
కోలకతా విజయం
author img

By

Published : Sep 24, 2020, 11:32 PM IST

Updated : Sep 25, 2020, 6:00 PM IST

దుబాయ్ వేదికగా బెంగళూరుతో జరిగిన మ్యాచ్​లో కింగ్స్​ ఎలెవన్​ పంజాబ్​ జట్టు 97 పరుగుల తేడాతో విజయం సాధించింది. 207పరుగుల లక్ష్యంతో బరిలో దిగిన ఆర్సీబీ.. 17ఓవర్లలో 109 పరుగులకే ఆలౌట్​ అయ్యింది. పంజాబ్​ బౌలర్లలో మురుగన్​ అశ్విన్​, రవి బిష్ణోయ్​ తలో మూడు వికెట్లు పడగొట్టి ఆర్సీబీని దెబ్బతీశారు. ఈ విజయంతో పాయింట్ల పట్టికలో బోణీ కొట్టింది పంజాబ్. తొలి ఇన్నింగ్స్​లో దంచేసిన కేఎల్​ రాహుల్(132*)​కు మ్యాన్​ అఫ్​ ది మ్యాచ్​ అవార్డు లభించింది.

డీలాపడ్డ ఆర్సీబీ...

భారీ లక్ష్య ఛేదనలో కోహ్లీ సేనకు ఆదిలోనే ఎదురుదెబ్బ తగిలింది. గత మ్యాచ్​లో అర్థశతకంతో మెరిసిన దేవదత్త.. తొలి ఓవర్​లో కేవలం ఒక పరుగే చేసి ఔటయ్యాడు. తర్వాతి ఓవర్​లో జోష్ ఫిలిప్పి ఎల్బీడబ్ల్యూగా వెనుదిరిగాడు. ఆ తర్వాత కోహ్లీ(1), శివమ్​ దుబె(12) పెవీలియన్​కు క్యూ కట్టారు. అరోన్​ ఫించ్​(20), సుందర్​(30), ఏబీ డివీలియర్స్(28)లు కొద్దిసేపు క్రీజులో నిలిచినా ఫలితం దక్కలేదు. మొత్తంగా తన తొలి మ్యాచ్​లో సన్​రైజర్స్​ హైదరాబాద్​పై గెలిచినా.. రెండో మ్యాచ్​లో దారుణంగా విఫలమైంది ఆర్సీబీ.

రాహుల్​ ధనాధన్​..

అంతకముందు టాస్‌ ఓడి బ్యాటింగ్‌కు దిగిన పంజాబ్‌ జట్టు నిర్ణీత 20 ఓవర్లలో మూడు వికెట్లు కోల్పోయి 206 పరుగులు‌ చేసింది. సారథి కేఎల్​ రాహుల్​ (132; 69 బంతుల్లో 14x4, 7x6) ఓపెనర్‌గా బరిలో దిగి చివరి వరకు క్రీజులో ఉండి శతకంతో చెలరేగాడు. మయాంక్‌ అగర్వాల్‌(26; 20 బంతుల్లో 4x4), నికోలస్‌ పూరన్ ‌(17; 18 బంతుల్లో 1x4), కరున్‌ నాయర్ ‌(15; 8 బంతుల్లో 2x4) కూడా చెలరేగి ఆడారు.

Last Updated : Sep 25, 2020, 6:00 PM IST
ETV Bharat Logo

Copyright © 2024 Ushodaya Enterprises Pvt. Ltd., All Rights Reserved.