ETV Bharat / sports

'బ్యాటింగ్ ఆర్డర్​లో కేకేఆర్ మార్పులు చేయాలి'

కోల్​కతా నైట్​రైడర్స్​ కెప్టెన్​ దినేశ్​ కార్తీక్ బ్యాటింగ్​ ఆర్డర్​ మార్చాల్సిన అవసరం ఉందని గంభీర్​ అభిప్రాయపడ్డాడు. రస్సెల్, మోర్గాన్ తర్వాత అతను దిగితే బాగుంటుందని సూచించాడు.

Gambhir
గంభీర్
author img

By

Published : Oct 4, 2020, 4:17 PM IST

కోల్​కతా నైట్​రైడర్స్​ బ్యాటింగ్​ ఆర్డర్​లో మార్పులు చేయాలని టీమ్​ఇండియా మాజీ క్రికెటర్​ గౌతమ్​ గంభీర్​ అభిప్రాయపడ్డాడు. మోర్గాన్​, రస్సెల్​ తర్వాతే కెప్టెన్ దినేశ్​ కార్తీక్​ బ్యాటింగ్​ చేయాలని ​సూచించాడు. సునీల్​ నరైన్​ను టాప్​ ఆర్డర్​ నుంచి తప్పించాలని పేర్కొన్నాడు. ముంబయి ఇండియన్స్​తో జరిగిన మ్యాచ్​లో కోల్​కతా ఓటమి చవిచూసింది. ఇప్పటివరకు జరిగిన మ్యాచ్​ల్లో మోర్గాన్​ కంటే ముందు కార్తీక్​ బరిలోకి దిగాడు. అయినప్పటికీ అతనికంటే ఎక్కువ స్కోరు సాధించలేకపోయాడు. ఈ క్రమంలోనే అభిమానుల నుంచి అనేక విమర్శలు ఎదుర్కొంటున్నాడు కార్తీక్​.

Gambhir
గౌతమ్​ గంభీర్​

"రాహుల్​ త్రిపాఠి టాప్​ ఆర్డర్​లో దిగాలి. దినేశ్​ కార్తీక్.. మోర్గాన్​, రస్సెల్​ తర్వాత​ ఆరో స్థానంలో మైదానంలో అడుగుపెట్టాలి. సునీల్​ నరైన్​ను ఎనిమిది లేదా తొమ్మిదో స్థానానికి పరిమితం చేస్తే మంచిది. జట్టులో అత్యుత్తమ బౌలర్ల చేత డెత్​ ఓవర్లు వేయించాలి. కానీ అది చేయలేదు."

-గౌతమ్​ గంభీర్​, టీమ్​ఇండియా మాజీ క్రికెటర్​

యువ బౌలర్​ వరుణ్ చక్రవర్తి బాగానే బౌలింగ్​ చేస్తాడని పేర్కొన్నాడు గంభీర్. అయితే, 19వ ఓవర్​ సమయంలో అతని చేతికి బంతినివ్వాలనుకోవడం సరైన నిర్ణయం కాదని అన్నాడు. గత మ్యాచ్​లో 20కిపైగా అదనపు పరుగులు ఇచ్చారని గంభీర్​ తెలిపాడు. వాటిని కూడా నియంత్రణలో పెట్టుకోవాలని సూచించాడు.

ETV Bharat Logo

Copyright © 2024 Ushodaya Enterprises Pvt. Ltd., All Rights Reserved.