ETV Bharat / sports

జాదవ్​ను అందుకే ముందు పంపించాం: ఫ్లెమింగ్​

author img

By

Published : Oct 8, 2020, 12:05 PM IST

స్పిన్ బౌలింగ్ ఆడగలడనే ఆలోచనతోనే​ జాదవ్​ను జడేజా, బ్రావో కన్నా ముందే పంపించినట్లు చెన్నై జట్టు కోచ్​ ఫ్లెమింగ్ తెలిపాడు​. విజయం దగ్గరకు వచ్చి మ్యాచ్‌ కోల్పోవడంపై విచారం వ్యక్తం చేశాడు.

Fleming
ఫ్లెమింగ్

కోల్​కతా​తో మ్యాచ్​లో చెన్నై జట్టు ఓటమికి కారణం కేదార్ జాదవ్ పేలవమైన ప్రదర్శనే కారణమని క్రీడాభిమానులు అభిప్రాయపడుతున్నారు. అతడిని రవీంద్ర జడేజా, డ్వేన్​ బ్రావో కన్నా ముందే ఎందుకు పంపారని ఫ్రాంచైజీని ప్రశ్నిస్తున్నారు. అతడికి స్పిన్​ బౌలింగ్​ వేసే సామర్థ్యం ఉన్నందునే, దానిని అంచనా వేయగలడని భావించి ముందుగా పంపించినట్లు హెడ్​ కోచ్ స్టీఫెన్ ఫ్లెమింగ్ వివరణ ఇచ్చాడు. అయితే తమ ప్రణాళిక తారుమారైందని అన్నాడు.

"కేదార్​ స్పిన్​ బాగా వేయగలడు. ప్రత్యర్థి ఆటగాళ్లపై ఆధిపత్యం చెలాయించగలడు. జడేజా మంచి ఫినిషర్​. అందుకే అలా పంపించాల్సి వచ్చింది. కానీ చివర్లో కోల్​కతా ఆటగాళ్ల ఒత్తిడి తీసుకురావడం వల్ల మా ప్రణాళిక తారుమారైంది. అయినా రోజులన్నీ ఒకేలా ఉండదు. ఈ మ్యాచ్​ మాకు ఓ గుణపాఠం నేర్పింది. ఇలాంటి ప్రదర్శన మళ్లీ చేయాలని అనుకోవడం లేదు. మా జట్టులో బౌలర్లు, బ్యాట్స్​మెన్ సమతుల్యత ఉంది. అందుకే మరో అదనపు బ్యాట్స్‌మన్‌ను తీసుకోవాలన్న ఆలోచన చేయలేదు. మాలోని లోపాలను సరిచేసుకుని తర్వాతి మ్యాచ్​కు సంసిద్ధంగా ఉంటాం"

-ఫ్లెమింగ్​, సీఎస్కే కోచ్​

168 పరుగుల లక్ష్య ఛేదనకు దిగిన చెన్నైకి మంచి ఆరంభమే లభించింది. ఓపెనర్‌ వాట్సన్‌ 50, వన్డౌన్‌లో వచ్చిన రాయుడు (30) రాణించాడు. తర్వాత వచ్చిన బ్యాట్స్‌మెన్‌ తీవ్రంగా నిరాశపరిచారు. బౌండరీలు బాదేందుకు ప్రయత్నించడంలో విఫలమయ్యారు. ధోనీ (11), కరన్‌ (17) కీలక సమయంలో ఔటయ్యారు. ఆ తర్వాత క్రీజులోకి వచ్చిన జాదవ్‌ (12 బంతుల్లో 7 పరుగులు) పేలవ ప్రదర్శన చేశాడు. దీంతో సాధించాల్సిన లక్ష్యం పెద్దదిగా మారింది. ఆఖర్లో జడేజా పోరాడినా ఫలితం లేకపోయింది. దీంతో చెన్నై 10 పరుగులు తేడాతో ఓటమిని చవిచూసింది.

ఇదీ చూడండి 'పరుగులు ఇవ్వకూడదని అనుకున్నా.. ధోనీ మాత్రం'

ETV Bharat Logo

Copyright © 2024 Ushodaya Enterprises Pvt. Ltd., All Rights Reserved.