ETV Bharat / sports

'రోహిత్​ కెప్టెన్​ కాకపోతే టీమ్​ఇండియాకే నష్టం' - గౌతమ్​ గంభీర్​ వార్తలు

టీమ్​ఇండియా వైస్​ కెప్టెన్​ రోహిత్​ శర్మను వన్డే, టీ20 ఫార్మాట్లకు నాయకత్వ పగ్గాలు చేపట్టాలని మాజీ క్రికెటర్​ గౌతమ్​ గంభీర్​ సూచించాడు. రోహిత్​ శర్మను కెప్టెన్​గా విస్మరిస్తే జట్టుకే నష్టం వాటిల్లుతుందని అభిప్రాయపడ్డాడు.

It would be a shame and loss for Indian cricket if Rohit isn't made T20 skipper: Gambhir
'రోహిత్​శర్మ కెప్టెన్​ కాకపోతే టీమ్​ఇండియాకే పెద్ద నష్టం'
author img

By

Published : Nov 11, 2020, 4:41 PM IST

టీమ్​ఇండియా వైట్​ బాల్​ కెప్టెన్సీ లేదా టీ20 ఫార్మాట్​ కెప్టెన్సీ బాధ్యతను వైస్​ కెప్టెన్​ రోహిత్​శర్మ స్వీకరించాలని మాజీ క్రికెటర్​ గౌతమ్​ గంభీర్​ అభిప్రాయపడ్డాడు. ఐపీఎల్​లో అత్యంత విజయవంతమైన కెప్టెన్​గా రోహిత్​ నిలిచాడని అన్నాడు. కెప్టెన్​ అయ్యేందుకు హిట్​మ్యాన్​కు తగిన అర్హతలు ఉన్నాయని గంభీర్​ తెలిపాడు.

"రోహిత్ ​శర్మ భారత కెప్టెన్​ కాకపోతే, జట్టుకే నష్టం కలుగుతుంది తప్ప రోహిత్​కు ఎలాంటి నష్టం వాటిల్లదు. ఒక మంచి కెప్టెన్​కు​ జట్టుతో అనుబంధం ఎంతో ముఖ్యమని నేను అంగీకరిస్తున్నా. కానీ, కెప్టెన్​ అవ్వడానికి పరిమితులు ఏమిటి? నాయకత్వ పగ్గాల కోసం పరిమితులతో సహా బెంచ్​ మార్క్​ ఒకేలా ఉండాలి. రోహిత్​ శర్మ తన జట్టుకు ఐదు ఐపీఎల్​ టైటిళ్లను అందించాడు. కెప్టెన్సీని ఇరువురికి పంచే మార్గాన్ని పరిశీలించవచ్చు. కోహ్లీ కెప్టెన్సీ కంటే రోహిత్​శర్మ నాయకత్వం ఎంత తేడా ఉంటుందో వైట్​ బాల్​ క్రికెట్​లో చూపించాడు. రోహిత్​ ఇప్పటివరకు ఐదు ఐపీఎల్​ టైటిళ్లను సాధించి పెట్టాడు. కోహ్లీ మాత్రం ఒక్క ట్రోఫీని తన ఖాతాలో వేసుకోలేదు. విరాట్​ పేలవమైన కెప్టెన్​ అని నేను అనడం లేదు. ఇద్దరూ ఒకే సమయంలో ఐపీఎల్​లో జట్టు పగ్గాలను చేపట్టారు. రోహిత్​ సరైన నాయకుడిగా నిలబడ్డాడని నేను భావిస్తున్నా."

- గౌతమ్​ గంభీర్​, టీమ్​ఇండియా మాజీ క్రికెటర్​

దుబాయ్​ వేదికగా జరిగిన ఐపీఎల్​ 2020 ఫైనల్​లో దిల్లీ క్యాపిటల్స్​పై ముంబయి ఇండియన్స్​ ఘన విజయం సాధించింది. ఈ గెలుపుతో ఐదోసారి ఐపీఎల్ టైటిల్ కైవసం చేసుకుంది. ముంబయి జట్టుకు ట్రోఫీని అందించడంలో కెప్టెన్​గా రోహిత్​శర్మ విజయవంతమైన ఇన్నింగ్స్​ ఆడాడు. రోహిత్​శర్మ నేతృత్వంలో ముంబయి ఇండియన్స్​ ఐదుసార్లు (2013, 2015, 2017, 2019, 2020) విజేతగా నిలిచింది.

ETV Bharat Logo

Copyright © 2024 Ushodaya Enterprises Pvt. Ltd., All Rights Reserved.