ETV Bharat / sports

ఐపీఎల్: వాళ్లిద్దరి దగ్గరే ఆరెంజ్, పర్పుల్ క్యాప్ - రబాడతో పర్పుల్ క్యాప్

ఐపీఎల్​ 13వ సీజన్​లో ఆరెంజ్ క్యాప్, పర్పుల్ క్యాప్​ కోసం పోటీ కొనసాగుతోంది. ఆరెంజ్​ క్యాప్ జాబితాలో పంజాబ్ సారథి రాహుల్ టాప్​లో ఉండగా.. అత్యధిక వికెట్లతో రబాడ పర్పుల్ క్యాప్ రేసులో ముందున్నాడు.

Orange Cap and Purple Cap standings
రాహుల్​ వద్ద ఆరెంజ్.. రబాడతో పర్పుల్ క్యాప్
author img

By

Published : Oct 28, 2020, 5:12 PM IST

ఐపీఎల్​ లీగ్​ మ్యాచ్​లు దాదాపు ముగింపు దశకు వచ్చేశాయి. అయినా ఇంకా ప్లే ఆఫ్ బెర్తులు ఖరారు కాలేదు. కానీ ఆరెంజ్, పర్పుల్ క్యాప్ విషయంలో మాత్రం కాస్త స్పష్టత కనిపిస్తోంది. ఈ టోర్నీలో పంజాబ్ కెప్టెన్ కేఎల్ రాహుల్ ఎక్కువ పరుగులు చేసి ఆరెంజ్ క్యాప్​తో కొనసాగుతుండగా, దిల్లీ బౌలర్ రబాడ పర్పుల్ క్యాప్​ను తన వద్ద ఉంచుకున్నాడు. వీరిద్దరూ ప్రత్యర్థులపై పూర్తి ఆధిపత్యం చెలాయిస్తున్నారు.

ఆరెంజ్ క్యాప్

పంజబ్ సారథి కేఎల్ రాహుల్.. ఈ సీజన్​లో ఆడిన 12 మ్యాచ్​ల్లో 595 పరుగులు చేసి, టాప్​ గేర్​లో దూసుకెళ్తున్నాడు. ఇతడి తర్వాత దిల్లీ ఓపెనర్ ధావన్ 471 పరుగులతో ఉన్నాడు. దిల్లీ జట్టుపై మంగళవారం జరిగిన మ్యాచ్​లో 66 పరుగులు చేసిన హైదరాబాద్ సారథి వార్నర్.. ఏకంగా ఆరు స్థానాలు ఎగబాకి 436 పరుగులతో మూడో స్థానంలోకి వచ్చాడు.

Orange Cap and Purple Cap standings
ఆరెంజ్ క్యాప్ లిస్ట్

పర్పుల్ క్యాప్

దిల్లీ బౌలర్ రబాడ, 12 మ్యాచ్​ల్లో 23 వికెట్లు తీసి జాబితాలో టాప్​లో ఉన్నాడు. పంజాబ్ బౌలర్ షమి, 20 వికెట్లతో రెండో స్థానంలో కొనసాగుతూ రబాడకు పోటీ ఇస్తున్నాడు. దిల్లీతో మ్యాచ్​లో 3 వికెట్లు తీసిన సన్​రైజర్స్ బౌలర్ రషీద్ ఖాన్.. 17 వికెట్లతో మూడో స్థానంలో ఉన్నాడు.

Orange Cap and Purple Cap standings
పర్పుల్ క్యాప్ లిస్ట్

ETV Bharat Logo

Copyright © 2025 Ushodaya Enterprises Pvt. Ltd., All Rights Reserved.