ETV Bharat / sports

ఐపీఎల్2020: దిల్లీ క్యాపిటల్స్ బలాలు, బలహీనతలు ఇవే! - ఇండియన్ ప్రీమియర్ లీగ్ వార్తలు

ఐపీఎల్ మరో నాలుగు రోజుల్లో ప్రారంభం కానుంది. ఇందుకోసం అన్ని జట్లు ఆసక్తిగా ఎదురుచూస్తున్నాయి. గత సీజన్​లో ప్లేఆఫ్స్​కు చేరి సత్తాచాటిన యువ కెప్టెన్ శ్రేయస్ అయ్యర్ సారథ్యంలోని దిల్లీ క్యాపిటల్స్ ఈసారి ఎలాగైనా గెలవాలన్న పట్టుదలతో ఉంది. వేలంలో కొత్త ఆటగాళ్లను తీసుకుని నూతనోత్సాహంతో బరిలో దిగనుంది. ఈ నేపథ్యంలో ఈ సీజన్​లో క్యాపిటల్స్ బలాలు, బలహీనతలపై ఓ లుక్కేద్దాం.

Delhi Capitals Strengths and Weaknesses
ఐపీఎల్2020
author img

By

Published : Sep 15, 2020, 6:17 PM IST

Updated : Sep 25, 2020, 5:59 PM IST

దిల్లీ క్యాపిటల్స్.. ఇంతకుముందు దిల్లీ డేర్​డెవిల్స్​గా ఉండేది. కానీ గత సీజన్​లో పేరును మార్చుకుంది. అయినా ఈ జట్టుకు అంతగా అదృష్టమేమీ కలిసిరాలేదు. యువ ఆటగాడు శ్రేయస్ అయ్యర్ సారథ్యంలో ఈ జట్టు గత ఐపీఎల్​లో ప్లే ఆఫ్స్​కు చేరుకుని సెకండ్ రన్నరప్​గా నిలిచింది. ఈసారి వేలంలో కొత్త ఆటగాళ్లను తీసుకుని నూతనోత్సాహంతో బరిలో దిగబోతుంది. యువకులతో కూడిన ఈ జట్టు ఈ లీగ్​లో ఎంతమేర రాణించగలదు? ఈ జట్టు బలాలు, బలహీనతలు ఏంటి? అనే విషయాలపై ఓ లుక్కేద్దాం.

బలాలు

ఈ జట్టుకు బలమైన బ్యాటింగ్ ఆర్డర్ ఉంది. గత బిగ్​బాష్ లీగ్​లో సత్తాచాటిన ఆస్ట్రేలియా ఆల్​రౌండర్ మార్కస్​ స్టోయినిస్​ను ఈసారి వేలంలో దక్కించుకుంది. ఇతడు ఈ జట్టుకు కీలక ఆటగాడిగా మారనున్నాడు. అలాగే మిడిలార్డర్​లో నమ్మదగిన వికెట్ కీపర్ బ్యాట్స్​మన్​ అలెక్స్​ కారేను తీసుకున్నారు. హెట్​మెయర్ రూపంలో మరో విధ్వంసకర ఆటగాడు జట్టులో చేరాడు.

Delhi Capitals Strengths and Weaknesses
దిల్లీ షెడ్యూల్

పృథ్వీ షా, శిఖర్ ధావన్ రూపంలో అదిరిపోయే ఓపెనింగ్ జోడీ కుదిరింది. మూడు, నాలుగు స్థానాల్లో శ్రేయస్ అయ్యర్ అద్భుతంగా రాణించగలడు. అలాగే ఈసారి టాపార్డర్​లో మరింత బలం కోసం ఎంతో అనుభవమున్న అజింక్యా రహానేను తీసుకున్నారు.

అనుభవమున్న రవిచంద్రన్ అశ్విన్ రాకతో స్పిన్ విభాగం పటిష్ఠంగా కనబడుతోంది. ఇతడికి తోడు ఇప్పటికే అక్షర్ పటేల్, అమిత్ మిశ్రా, నేపాల్ యువ స్పిన్నర్ సందీప్ లమిచానే రూపంలో నాణ్యమైన స్పిన్నర్లు ఉన్నారు. అంతర్జాతీయ అనుభవం ఉన్న వీరితో యూఏఈలో క్యాపిటల్స్​ సత్తాచాటాలని భావిస్తోంది.

బలహీనతలు

ట్రెంట్ బౌల్ట్​ను ట్రేడ్ ఆప్షన్​లో ముంబయికి అప్పజెప్పిన దిల్లీలో ఈసారి కగిసో రబాడా మాత్రమే చెప్పుకోదగ్గ విదేశీ పేసర్. క్రిస్​ వోక్స్ లాంటి ఆల్​రౌండర్​ను తీసుకున్నా అతడు ఈలీగ్​కు దూరమయ్యాడు. దీంతో ఇతడి స్థానంలో ఎన్రిచ్ నోట్జేను తీసుకున్నారు. కానీ ఇతడికి అంతగా అనుభవం లేదు. డేనియల్ సామ్స్​ రూపంలో అన్​క్యాప్​డ్ ఆస్ట్రేలియా పేసర్ ఉన్నా ఇతడి అవకాశాలు రావడం కష్టమే. అలాగే ఇషాంత్ శర్మ, మోహిత్ శర్మ లాంటి భారత పేసర్లు ఉన్నా వీరి ప్రదర్శనపై పూర్తి నమ్మకం పెట్టుకునే అవకాశం ఉండదని అభిప్రాయపడుతున్నారు క్రీడా పండితులు.

Delhi Capitals Strengths and Weaknesses
దిల్లీ జట్టు

ఆల్​రౌండర్ విభాగంలోనూ ఈ జట్టు పేలవంగా కనిపిస్తోంది. స్టోయినిస్ మాత్రమే ఇందులో చెప్పుకోదగ్గ ఆల్​రౌండర్. మిగతా వారిలో అక్షర్ పటేల్, డేనియల్ సామ్స్, కీమో పాల్, లలిత్ యాదవ్​ ఉన్నారు. వీరంతా అటు బ్యాటింగ్​, ఇటు బౌలింగ్​లోనూ రాణించడంపైనే జట్టు విజయావకాశాలు ఆధారపడి ఉన్నాయి.

అవకాశాలు

ఇప్పటివరకు ఈ జట్టు ఐపీఎల్ టైటిల్ గెలవలేదు. ప్రతి సీజన్​లోనూ పాయింట్ల పట్టికలో చివరి నాలుగు స్థానాల్లో ఉండే ఈ జట్టు గతేడాది మాత్రం మంచి ప్రదర్శన చేసింది. దీంతో అదే ప్రదర్శనను ఈసారి కూడా పునరావృతం చేయలని భావిస్తోంది. జట్టులో ఎక్కువగా యువ ఆటగాళ్లు ఉండటం అటు ప్లస్​తో పాటు మైనస్​ కూడా. కానీ వారే అద్భుతాలూ సృష్టించగలరు. పంత్, అయ్యర్, ధావన్, పృథ్వీ షా, రహానే కలయికతో ఈసారి జట్టుకు ట్రోఫీ వస్తుందని యాజమాన్యం భావిస్తోంది.

Delhi Capitals Strengths and Weaknesses
దిల్లీ కొత్త ఆటగాళ్లు

ప్రమాదాలు

బౌలింగ్ విభాగంలో రబాడ, ఇషాంత్ శర్మ కాస్త అనుభవజ్ఞులు. కానీ వీరికి గాయమైతే బ్యాకప్ ఆప్షన్ కనిపించట్లేదు. టీ20 జట్టులో కీలకమైన ఆల్​రౌండర్ విభాగం కూడా బలహీనంగా కనిపిస్తోంది. స్టోయినిస్​కు గాయమైతే మరో సీనియర్ ఆల్​రౌండర్ లేడు.

కొసమెరుపు

ఏది ఏమైనా యువకులు సత్తాచాటడంపైనే ఈసారి దిల్లీ క్యాపిటల్స్ ఐపీఎల్ ట్రోఫీ గెలవడం ఆధారపడి ఉంది. రహానే, రవిచంద్రన్ అశ్విన్​ రూపంలో అనుభవజ్ఞులను ఈసారి జట్టులో చేర్చుకున్న దిల్లీ.. వారిని ఎంతవరకు ఉపయోగించుకుంటుందో చూడాలి. శ్రేయస్ అయ్యర్ కెప్టెన్సీ ఈ లీగ్​లో మరోసారి అందరి దృష్టినీ ఆకర్షిస్తోంది. టీమ్​ఇండియా భవిష్యత్ కెప్టెన్ అంటూ పేరు తెచ్చుకున్న ఇతడు మరి ఈ లీగ్​లో జట్టును ఎంతవరకు తీసుకెళతాడో తెలియాలంటే మరికొన్ని రోజులు ఆగాల్సిందే.

Last Updated : Sep 25, 2020, 5:59 PM IST
ETV Bharat Logo

Copyright © 2025 Ushodaya Enterprises Pvt. Ltd., All Rights Reserved.