ETV Bharat / sports

బెంగళూరుXదిల్లీ: గెలుపు స్వారీ చేసేదెవరు? - ఆర్సీబీ vs దిల్లీ మ్యాచ్​ ప్రివ్యూ

దిల్లీ క్యాపిటల్స్​, రాయల్​ ఛాలెంజర్స్​ బెంగళూరు జట్ల మధ్య దుబాయ్​ వేదికగా నేడు(సోమవారం) మ్యాచ్​ జరగనుంది. భారత కాలమానం ప్రకారం రాత్రి 7:30 గంటలకు ప్రారంభం కానుంది. విజయంపై ఇరుజట్లు ధీమాగా ఉన్నాయి.

Royal Challengers Bangalore vs Delhi Capitals
ఆర్సీబీ vs దిల్లీ
author img

By

Published : Oct 5, 2020, 5:29 AM IST

Updated : Oct 5, 2020, 6:51 AM IST

మరో రసవత్తర పోరుకు రంగం సిద్ధమైంది. రాయల్ ఛాలెంజర్స్ బెంగళూరు-దిల్లీ క్యాపిటల్స్ మధ్య దుబాయ్​ వేదికగా సోమవారం మ్యాచ్​ జరగనుంది. ఇప్పటివరకు నాలుగు మ్యాచ్​లు ఆడి మూడింటిలో విజయం సాధించిన దిల్లీ.. పాయింట్ల పట్టికలో ముందంజలో ఉంది. రాజస్థాన్​పై అద్భుత విజయంతో కోహ్లీసేన జోరుపెంచి.. పాయింట్ల పట్టికలో మూడో స్థానంలో కొనసాగుతోంది. ఇప్పుడు ఈ రెండు జట్లు తొలిసారి తలపడనున్నాయి. ఈ సందర్భంగా ఇరు జట్ల బలాలు బలహీనతలపై ఓ లుక్కేద్దాం.

వ్యూహాలు ఫలించేనా?

ఈ సీజన్​లో ఎలాంటి అంచనాలు లేకుండా వచ్చి.. అందర్నీ ఆశ్చర్యపరుస్తున్న జట్టు దిల్లీ క్యాపిటల్స్​. ఓపెనర్లు పృథ్వీ షా, ధావన్​​ బ్యాటింగ్​లో మెరుపులు మెరిపిస్తుంటే.. సారథి శ్రేయస్​ అయ్యర్​ ఫోర్లు, సిక్సర్లతో బౌలర్లకు చుక్కలు చూపిస్తున్నాడు. వారిని ఆపడం ప్రత్యర్థి బౌలర్లకు పెద్ద సవాలనే చెప్పాలి. పంత్​​ కూడా మంచి ఫామ్​లో ఉన్నాడు. ఇక బౌలర్లు హర్షల్​ పటేల్, రబాడా, అమిత్​ మిశ్రాల అండ జట్టుకు ఉండనే ఉంది.

దిల్లీ వేగాన్ని ఆపగలదా?

తొలి మ్యాచ్​లో మంచి ఆరంభాన్నిచ్చి అభిమానుల్లో ఆశలు పెంచిన కోహ్లీ సేన.. ఆ తర్వాత మ్యాచ్​లో నిరాశపరిచింది. శనివారం రాజస్థాన్​తో జరిగిన మ్యాచ్​లో దూకుడు పెంచి అందరి దృష్టినీ ఆకర్షించింది. కోహ్లీ(72), పడిక్కల్(63)​​ అద్భుతంగా ఆడారు. వాషింగ్టన్​ సుందర్​, డివిలియర్స్​ కూడా మంచి ఫామ్​లో ఉన్నారు. బౌలింగ్​ పరంగా సైనీ, చాహల్​, జంపా, శివమ్​ దూబె వంటి స్టార్​ బౌలర్లతో జట్టు బలంగా ఉంది.

రాయల్​ ఛాలెంజర్స్​ బెంగళూరు:

విరాట్ కోహ్లీ (కెప్టెన్​), డివిలియర్స్, పార్థివ్ పటేల్, ఆరోన్ ఫించ్, జోష్ ఫిలిప్, క్రిస్ మోరిస్, మహ్మద్ సిరాజ్, దేవదత్ పడిక్కల్​, యుజ్వేంద్ర చాహల్, నవదీప్ సైనీ, ఆడమ్ జంపా.

దిల్లీ క్యాపిటల్స్​

పృథ్వీ షా, శిఖర్ ధావన్, శ్రేయస్ అయ్యర్ (కెప్టెన్), రిషభ్ పంత్, హెట్​మెయర్, స్టోయినిస్, అశ్విన్, కగిసో రబాడ, ఎన్రిచ్ నోర్ట్జే, అమిత్ మిశ్రా, హర్షల్ పటేల్

Last Updated : Oct 5, 2020, 6:51 AM IST
ETV Bharat Logo

Copyright © 2025 Ushodaya Enterprises Pvt. Ltd., All Rights Reserved.